శివం -34
శివమ్మ కధ -10
(శివమ్మ ఇంటికి వస్తాడు శివుడు ...నంది, భృంగి నాగరాజు తో కలిసి బ్రహ్మ విష్ణువు, మాతలు చూస్తూ ఉండగా, శివమ్మ తో సరదాగా ఉంటూ తనడైన హాస్య చతురత తో ప్రవర్తిస్తాడు శివయ్య. శివుని కోరిక మీద శివమ్మ ఆయానకి గోరుముద్దలు తినిపిస్తుంది. అప్పుడు శివయ్య "అమ్మా, ఏంటిది "అంటాడు)
శివమ్మ "ఏంటి శివయ్య ఏమైంది? "
నేను "చుసుకోవద్దా అమ్మ, నాకు నోరు కాలింది "
విష్ణు దేవుడు "హాలాహలం తాగాడు మహాదేవుడు అప్పుడు కూడా ఒక్కమాట అనలేదు ,కాని "...అన్నాడు.
పార్వతి మాత "సోదరా ఎక్కడ గొంతు కాలుతుందేమో అని నేను వెళ్లి నా చేతితో గొంతుని నిమిరాను సోదరా "అంది.
బ్రహ్మ "మహాదేవుడికి ఏమి అవుతుంది ? తమరు పత్ని యందు ప్రేమ చూపి ఆ విదంగా ఐనన బావించారు ..ఇప్పుడు ఈ శివమ్మ బిడ్డ ల భావించి ఇలా చేస్తుంది "అన్నాడు.
ఆ ఘటన చూసీ నందికి కన్నుల పండగ గా ఉంది .
నంది "మహాదేవుడికి ఇలా ముద్దలు కలిపి పెట్టాలి అని నాకు ఎందుకు ఆలోచన రాలేదబ్బ ,వచ్చిఉన్నా బాగుండేది నేను అడిగితేయ్ కాదు అనే వారు కాదు "అనుకున్నాడు నంది.
నాగరాజు , భృంగి "బహుశా ఇది భక్త చరిత్ర లో అమోఘ ఘట్టం ,చూసినందుకు మన భక్తీ కూడా ధన్యం" అనుకున్నారు.
శివమ్మ " నేను పెడతా గా శివయ్య చుస్కోలేదు ..."అంది.
నేను "బుంగమూతి వేసుకొని తొందరగా పెట్టు అమ్మ ..ఆకలిగా ఉంది ..ఇదిగో నువ్వు ఆలస్యం చేస్తే నేను తినను ...పో..."అలిగినట్టు అన్నాను.
శివమ్మ "అయ్యో బంగారు తండ్రి ..నా బుజ్జి కన్నయ్య ..అలగకు చిట్టి తండ్రి ."అంటూ నా బుగ్గలు ముద్దుగా నిమిరింది .
ఎవరకి మాత్రం ఏం మాటలు ఉంటాయి ..అందరూ చూస్తూ ఉండిపోయారు ...
అందరి కళ్ళలో ఒక భక్తీ ఉన్మాదం ..
నేను "అమ్మ అమ్మ నాకు ఆ గుజ్జు తీసి పెట్టావు ..భలే ఉంటుంది .."అన్నాను.
శివమ్మ "అలగేయ్ చిన్నోడా అంతే చేస్తా ..నీకు ఎలా కావలి చెప్పు అలా చేద్దాం "అంది.
అంటూ "ఆ ఆ.. నోరు తెరువు, అంటూ గుజ్జు పెట్టింది .."
శివమ్మ పెట్టే ముద్దలతో నేను మైమరిచిపోతున్న .
శివమ్మ "శివయ్య ....ఇదిగో ఇదిగో ఈ ముద్ద తిను ..."అంది లాలనగా.
నేను "అమ్మా నాకు గుజ్జు మళ్ళీ తీసిపెట్టు భలేగా ఉంది "అన్నాను ఆనందంగా.
శివమ్మ "నా బుజ్జి తండ్రి కదు ఈ ముద్ద తినవయ్య "అంది.
నేను "అహ నాకు గుజ్జేయ్ కావాలి.."అన్నాను మొండిగా.
అందరు శివయ్య అల్లరి చూసి పులకిస్తున్నారు ..ఇంత చమత్కారం ఉంది శివయ్య లో అనుకుంటున్నారు..
ఆ చమత్కారం కూడా శివుని ఆజ్ఞ లేనిదే వస్తుందా, అనుకుంటున్నారు.
శివమ్మ "ఇలా అల్లరి చేస్తే ఎలా కన్నయ్య ..తిను..నీకు ఆ చందమామని తీసుకొని వస్తా "అంది శివమ్మ పసి పిల్లాడి ని అన్నట్లు..
అందరు టక్కున నవ్వుకున్నారు ...
నంది "శివమ్మ మాత ..మేమన్నా మహాదేవుడికి కొంచెం దూరంగా ఉంటాం .ఆ చంద్రయ్య అదృష్టం ఏమో గాని, ఎప్పుడూ ఆయన్ని అతుకొని అలంకారంగా ఉంటాడు "అన్నాడు.
నేను "నంది మా అమ్మ కి తెల్సు అది ..మిగతా సగం చంద్రుడ్ని కూడా తేచి ఇస్తాను అని మా అమ్మ ఉద్దేశం ,కదా అమ్మ "అన్నాను వెనకేసుకొని వచినట్టు.
పార్వతి మాత "మహాదేవులు వారు ..చూడండి ఎంత విశేషం చెప్పరో "అంది.
కాని శివమ్మకి మాత్రం ఆ ముద్దా ఎలా తినిపించాలి, అని ఆలోచన.
విష్ణు దేవుడు "ఏ తల్లి ఐనా తన బిడ్డ కు ఎలా కడుపు నింపాలి అనే చూస్తుంది ..చూడండి బ్రహ్మ దేవా ,లక్ష్మి దేవి , సోదరి ...తను మహాదేవుడు అని పూర్తిగా మరిచిపోతోంది .ఇక పూర్తిగా తన బిడ్డ అని అనుకుని చూసుకుంటోంది ..ఏమి జరగబోతుందో? మహదేవుడు మనకి అర్ధం కాకుండా చేసాడు. " అన్నాడు.
ఇది వీక్షించే వారు కూడా "శివయ్య శివయ్య "అని తల్చుకున్నారు ..
శివయ్య "నాకు గుజ్జేయ్ పెట్టు అమ్మ ..."అన్నాడు.
శివమ్మ "శివయ్య గుజ్జు రావాలి అంటే నాలుగు ఐదు ముద్దలు తినవయ్య ,అప్పుడు బాగా వస్తుంది ..నా బంగారు కొండ కదా .." అక్కడికి ఏదో నాకు తెలియనట్టు .."అంది.
అప్పుడు తట్టింది శివమ్మకి ఆలోచానా ..
తినని అని నేను చేస్తున్న మారం విని ..
ఇదిగో కన్నయ్య "ఇది నీ భక్తుల ముద్దా "అని అంది ..
అంతే నేను నోరు తెరిచి ఆనందంగా తిన్నా "భలే ఉంది అమ్మ ఈ ముద్దా "అన్నాను.
అందరు శివమ్మ సమయస్పూర్తి చూసి ఎంత ఆనందపడ్డారో..
అది తిన్నా కాని ,మళ్ళీ గుజ్జే కావాలి అని చూసాను నేను.
మళ్ళీ శివమ్మ ఏమి అనబోతుందా అని చూసారు అందరు ...
శివమ్మ క్రమక్రంగా తన బిడ్డ అని అనుకుంటుంది ,,,,పూర్తిగా నన్ను తన బిడ్డ వలె భావిస్తుంది ..
శివమ్మ "కన్నయ్య నీకు గుజ్జు తీసి పెడతా గా ...నాలుగు ముద్దలు తిను.."
నేను "ఆ ఆ ఆ నాకు గుజ్జేయ్ కావలి "పసిపిల్లలు కారణం లేకుండా గొడవ చేసినట్టు చేసాను.
అసలు ఈ శివయ్య చేసే అల్లరి చూసి మురిసిపోతుది పార్వతి మాత ..మాత యొక్క చిద్విలాసం కి అసలు ఎవరు ఏమి చెప్పలేరు కదా ..అందులోనూ అది దంపతులు.
శివమ్మ "ఇది ..ఇది ఇది....ఇది// పార్వతి మాత ముద్దా తిను చిన్న తండ్రి "అంది.
శివయ్య పార్వతి ముద్ద అనేసరికి ఆనందంగా నోరు తెరిచాడు ...
శివమ్మ పెట్టిన ముద్దా తిన్నాడు శివయ్య .. ఏమిటో తెలిదు ..
పార్వతి మాత "సోదరా ! ఆహా ఆమె భక్తీ పారవశ్యం చాల చాల అమోఘం ..ఆ ముద్దా పారవశ్యత నాకు అర్ధం అయ్యింది ."అమది.
పార్వతి మాత కి ఎంతో ఆనందం కదా, ఆమె ముద్దా అనేసరికి వద్దు వద్దు అన్నా తిన్నాడు శివయ్య ..అమ్మ ఆనందానికి అవధులు లేవు..
నవ్వుతు చూస్తుంది శివయ్య వైపు అమ్మ ...శివయ్య కూడా అంతే చూస్తున్నాడు ..
"హరహర మహాదేవ అన్నాడు "నంది భృంగి నాగరాజు ..
No comments:
Post a Comment