అంగడి సరుకై.....
సుజాత తిమ్మన...
93 91 34 10 29 ..
పురాణాలూ తిరగేసినా కనిపిస్తారు...
రంభా...ఊర్వశి...మేనకలు..
మహారాజుల కాలం నాటికెళితే..
దేవదాసిలుగా దర్శనమిస్తారు...
జమిందారీ గిరిలోబోగం సానిలుగా
బ్రతుకు భారమై ఉంటారు ఊరికి దూరంగా..
అద్భుతాలను సృష్టిస్తూ ...
అనుహ్యమయిన టెక్నాలజీతో
అభివుద్ది పదంలోకి దూసుకెళుతున్నా...
ఆడంబరాల ముసుగు వేసుకోవాలని కొందరు..
అమ్మా నాన్నల నిర్లక్ష్యానికి గురి అవుతూ కొందరు..
మగవాడి మాయ మాటలకి మోసపోయి కొందరు..
కారణాలు ఎవైతేమి ...
కాల్ గర్ల్స్ అన్న పేరుతో అమ్మాయిలు ..
జీవిస్తున్నాం అనుకుంటూ...మృతమై తిరుగుతున్నారు..
అమ్మా అని పిలిపించుకుకోవాల్సిన అమ్మతనం
అంగడి సరుకై.....బేరాలకు తూగే తూకమవుతోంది...!!
*********
No comments:
Post a Comment