అన్నమయ్య సూక్తి చంద్రిక - అచ్చంగా తెలుగు

అన్నమయ్య సూక్తి చంద్రిక

Share This
అన్నమయ్య సూక్తి చంద్రిక(1-30)
(అన్నమయ్య  కీర్తనలలోని  సూక్తులకు    ఆంగ్ల లిప్యంతరీకరణము, ఆంగ్లానువాదము, వివరణములు )
           -డా. తాడేపల్లి పతంజలి
 

01
ఎండదాకక నీడహిత వెఱగరాదు(1-11)
ఆంగ్ల లిప్యంతరీకరణము 
Eṇḍadākaka nīḍahita veṟagarādu(1-11)
భావం
ఎండ బాధ తెలియకుండా నీడ యొక్క సుఖం తెలియదు.
ఆంగ్లానువాదము
with out knowing the sunbeam the shades pleasure is unknown.
02
తినక చేదును దీపు తెలియనేరాదు.(1-11)
ఆంగ్ల లిప్యంతరీకరణము 
Tinaka cēdunu dīpu teliyanērādu.(1-11)
భావం
తినకుండా చేదు, తీపి తెలియదు.
ఆంగ్లానువాదము
without eating bitter, sweet does not know.
03
ఆతుమ కలవ్యాపకమని తలపోసినపిమ్మట
జాతియు గులాభిమానముజర్చింపనెరాదు(01-47)
ఆంగ్ల లిప్యంతరీకరణము 
Ātuma kalavyāpakamani talapōsinapim'maṭajātiyu gulābhimānamujarcimpanerādu(01-47)
భావం
అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడని తెలుసుకొన్న పిమ్మట జాతి పై న, కులము పైన ఆభిమానము చర్చింపకూడదు. 
ఆంగ్లానువాదము
After knowing that there is that GOD in all of them, the community and the spirit of the caste should not discuss .
04
ఎద్దేమెఱుంగు అడుకుల చవి మూట(1-87)
Eddēmeṟuṅgu aḍukula cavi mūṭa(1-87)
భావం
ఓ భారము మోసే స్వామీ ! అనేక రకాలుగా సంసారపు పాపపు కర్మములు చేసి  వీపు పగిలేటట్లు విర్రవీగాను. అయినా నా గురించి నువ్వు పట్టించుకోవు. నా సంతోషము నీకు అక్కరలేదు. ఎద్దుకు అటుకుల మూట రుచి ఏమి తెలుస్తుంది లేవయ్యా!
How the bull knows about the taste of the Rice wetted, parched and flattened?
05
కుమ్మరికి నొకయేడు గుదియ కొకనాడవును(1-64)
Kum'mariki nokayēḍu gudiya kokanāḍavunu
భావం
కుమ్మరికి ఒకయేడు పట్టేది- కట్టెకు ఒక్కరోజు పడుతుంది.
It takes a year for the potter -but it  Take a day  to Cudgel.
వివరణ
ఈ జీవి ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారి విష్ణునామాన్ని తలచుకొంటే చాలు చేసిన పాపాలన్నీ నశిస్తాయి.
కుమ్మరికి ఒకయేడు పట్టేది- కట్టెకు ఒక్కరోజు పడుతుంది.
విష్ణు నామము కట్టె. పాపపురాశి కుండలదొంతి. సంవత్సరమంతా కష్టపడి కుమ్మరి చేసిన కుండల దొంతి , ఒక్క కట్టెతో 
ముక్కలు ముక్కలు చేసినట్లు- అనేక పాపాలరాశిని, విష్ణునామము ముక్కలుచేస్తుంది.

06
తడిపాత మెడగోత తలపు విషయాసక్తి (1-104)
Taḍipāta meḍagōta talapu viṣayāsakti (1-104)
భావము
తడిపాత మెడగోత అనగా తడిగుడ్డతో గొంతులు కోయడం, మెత్తగాఉంటూ ద్రోహం చేయటం. లౌకిక విషయాలపై ఆసక్తి తడిపాతమెడగోత వంటిది. 
The interest in worldly affairs is like Enticing
వివరణ
లౌకిక విషయాలు మెత్తగా, హాయిగా అనిపిస్తాయి. కాని వాటివల్లఈ జన్మకి ఎంతద్రోహం జరుగుతోందోఊహించలేము. కనుక వాటి
పట్ల ఆసక్తి తగ్గించుకోమని అన్నమాచార్యుల ప్రబోధం.
07
తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలు(1-114)
Tiṭṭulēni bradukokka dinamaina nade cālu
భావం
నిందలేని జీవితము ఒక్కరోజయినా అది చాలు.
It's a life that does not have a curse for single day.
08
వట్టి జాలిబడకుంటే వచ్చినంతే చాలు(1-114)
Vaṭṭi jālibaḍakuṇṭē vaccinantē cālu(1-114)
భావం
శక్తికి మించిన ప్రయత్నాలు చేసి నలుగురిలో నవ్వుల పాలైజాలి(దుఃఖం) పొందటం కంటె ప్రాప్తించిన దానితో హాయిఅనుభవించుట చాలు
Attempt to go beyond energy is a waste of grief.
get peace experience with the accessibility that which is obtained
09
కుప్ప నురుచుట కసవుకొరకా(01-115)
Kuppa nurucuṭa kasavukorakā(01-115)
ధాన్యాన్ని   కాళ్ళతో తొక్కి నలుపుట  గడ్డి కొరకా ? 
వివరణ
ధాన్యాన్ని   కాళ్ళతో తొక్కి నలుపుట  గడ్డి కొరకు కాదు. ధాన్యము కొరకని భావం)
అలాగే ఈ శరీరాన్ని శరణాగతి భావంతో   నలుపుట  (ఆర్తి చెందుట)  – తుచ్చమైన బాధ కొరకు కాదు.
మూలమైన పరమాత్మని పొందుట కొరకు. 
The grain is not tied to the straw.
10
పందివలె తనుదానె బ్రదికేటి సుఖము(1-115)
Pandivale tanudāne bradikēṭi sukhamu(1-115)
ఇతరులకు సాయపడకుండా తనపొట్టను తాను నింపుకొను సుఖాన్ని అనుభవించే  పంది జన్మ వ్యర్థం.
Pig's birth is a waste of time to enjoy the pleasure of hitting his mouth without helping others
11
గడ్డపార మింగితే ఆకలి తీరీనా -(1-177)
Gaḍḍapāra miṅgitē ākali tīrīnā -(1-177)
భావం
గడ్డపార మింగితే ఆకలి తీరదు.
వివరణ
గడ్డపార ద్వారా నేలను త్రవ్వి మొక్కలు నాటతాం.యొక్క ముఖ్య ఉపయోగం 
ఆ తరువాత మన ఆకలిని  ఆ మొక్కలకు కాసిన పండ్లు, కూరగాయలు  తీరుస్తాయి.
అంతేకాని ఆ గడ్డపారను  మింగితే మన ఆకలి తీరదు 
అలాగే మన సంసార బంధానికి కారణమైన మనస్సు, ఇంద్రియాల ఆంతర్యాన్ని తవ్వాలి. వాటిలో  పరమాత్మ భావనలు నాటాలి.క్రమంగా భగవంతుని వైపుకు మనస్సు, ఇంద్రియాలు  మరలుతాయి.మన సిసలయిన ఆకలి (మోక్షేచ్ఛ) తీరుతుంది
అంతేకాని ఒక్కసారిగా  మనస్సును మింగేస్తాను(వశపరచుకొంటాను)  అని  నువ్వు అనుకొంటే  వీలవదు.
నీ  మనస్సు నీ భగవదాలోచన కంటె  తీవ్రంగా నిన్ను లౌకిక ఆకర్షణల వైపులాగుతుంది.
కనుక నెమ్మదిగా సాధన చేసి మనస్సును భగవంతుని వైపు మనస్సును తిప్పాలి కాని, ఒక్కసారిగా సాధ్యం కాదని కవి ప్రబోధం.  
crowbar mingle does not end hunger
12
చలువలోపలివేడి సంసారము(1-199)
Caluvalōpalivēḍi sansāramu(1-199)
భావం
సంసారము పచ్చకర్పూరమువలె చలువలోపల వేడితో కూడినది.
A family is like a Green coloured camphor which shows hot up inside and cool down
వివరణ
సంసారము పైకి చల్లగా సుఖాలకు నిలయంగా కనిపించినప్పటికినిజంగా దుఃఖాలకు నిలయమని భావం.
13
ఎద్దు దన్నీనని గుఱ్ఱము -చాటు కేగినయట్టిచందమాయె (1-203)
Eddu dannīnani guṟṟamu -cāṭu kēginayaṭṭicandamāye (1-203)
భావం
ఎద్దు తంతుందని భయపడి గుర్రాన్ని ఆశ్రయించినట్లు
Fearing the bulls got up and went to the horse
14
చెప్పినట్ల దాము సేయరెవ్వరును(1-230)
Ceppinaṭla dāmu sēyarevvarunu(1-230)
భావము
ఈ లోకంలో చాలామంది చెప్పుడుమాటలే(వాళ్ళు వీళ్ళు చెప్పినమాటలు) చెప్పుకొంటారు కాని భగవంతుడుచెప్పినట్లుగా తాము
ఎవ్వరు చేయరు.
Many in this world say their words but they do not do as God says.
15

దక్కునా పేదకును తరముగానిధనంబు
చిక్కి యెవ్వరికై నఁ జేరుఁగాక(1-242)
Dakkunā pēdakunu taramugānidhanambucikki yevvarikai nam̐ jērum̐gāka (1-242)
వివరణ
అంతులేని ధనం ఒక పేద వానికి లభిస్తే అది వానికి దక్కదు. ఎవరో పరాయివారికి ఆ ధనము చేరిపోతుంది.
Is it possible for a poor person to get an endless amount of money? Somebody else will get that money.
16
సొగియునా మఱియు ముచ్చుకు బండువెన్నెలలు(1-242)
Sogiyunā maṟiyu muccuku baṇḍuvennelalu(1-242)
భావము
దొంగకు వెన్నెల ఇష్టమవుతుందా?
would thief like moonlight?
17
మోహము విడుచుటే మోక్షమది
దేహ మెఱుగుటే తెలివీనదే(1-263)
Mōhamu viḍucuṭē mōkṣamadidēha meṟuguṭē telivīnadē(1-263)
భావము 
అజ్ఞానమును విడుచుటే మోక్షముదేహము అశాశ్వతమని, తెలుసుకొనుటే జ్ఞానము.
The Salvation is the leaving of ignorance knowing the the body is knowledge.
18
భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదే కాక తియ్యనుండీనా (1-287)
Bhāramaina vēpamānu pāluvōsi pen̄cinānutīrani cēdē kāka tiyyanuṇḍīnā (1-287)

భావం 
తియ్యటి పాలు పోసి పెంచినా వేప తియ్యగా ఉండదు.
Pouring sweet milk ,Neem is not sweet
19
ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేఁడు మెత్తనయ్యీనా(01-287)
Bhāramaina vēpamānu pāluvōsi pen̄cinānutīrani cēdē kāka tiyyanuṇḍīnā (1-287)
ఎవ్వరికి అందుబాటు లేని  స్థలంలో   నీటిలో లోతైన చోట  ముంచి ముంచి నానపెట్టినా గొడ్డలి మెత్తబడదు.అలాగే ఈమనస్సు మంచి తోవకు రావటం లేదు.
The ax is not soft enough to drown in the deepest place where the water is not available to anyone.
20
విత్తుమీదటి పొల్లు విధము దేహంబు(1-328)
Vittumīdaṭi pollu vidhamu dēhambu(1-328)
భావం
ఈ మానవ శరీరము విత్తనము మీద ఉన్న పొల్లు వంటిది.అనగా ఈ మానవ   దే హం అస్థిరమైనదని , సారము లేనిదని భావం
This human body is like the fields on the seed.
అన్నమయ్య సూక్తి చంద్రిక-25-11-2017
21
వత్తిలోపలి నూనె వంటిది జీవనము(1-328)
English transliteration
Vattilōpali nūne vaṇṭidi jīvanamu 
వివరణ 
వెలుగుచున్న దీపపు వత్తి దీపపు కుందిలో నూనె ఉన్నంతవరకు వెలుగుతుంది.ఈ జీవనము కూడా భగవానుడు ఇచ్చిన ప్రాణము ఉన్నంత వరకు వెలుగుతుంది. తర్వాత కొండెక్కుతుంది. (ఆరిపోతుంది)

ఆంగ్లానువాదము
Life is like inward oil of wick.
అన్నమయ్య సూక్తి చంద్రిక-26-11-2017
22

కందులేని సుఖము కలనైన లేదు(1-340)
English transliteration
Kandulēni sukhamu kalanaina lēdu
వివరణము
బాధ లేని సుఖము కలలో కూడా లభించదు. సుఖమును దుఃఖమును జోడుకోడెలు(1-505) అను భావన అన్నమయ్యది. అందుకే బాధ లేని సుఖము కలలో కూడా ఉండదని అతని భావన.
ఆంగ్లానువాదము
without pain there is no happiness in the dream too.
23
తనువు వేసరినాను తలపు వేసరదు(1-376)
English transliteration
Tanuvu vēsarinānu talapu vēsaradu
వివరణము
శరీరము విశ్రాంతి పొందినప్పటికి , ఆలోచన విశ్రాంతి పొందదు.
ఆంగ్లానువాదము
Even though the body is resting, the idea does not rest.
24
పాయము ముదిసిననాను భావము ముదియదు(1-376)
English transliteration
Pāyamu mudisinanānu bhāvamu mudiyadu
వివరణము
ముసలితనము వచ్చినప్పటికి ఆశ చావదు
ఆంగ్లానువాదము
Even though the old age is resting, Hope does not go away
అన్నమయ్య సూక్తి చంద్రిక-29-11-2017
25
మేటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు(1-443)
English transliteration
Mēṭivairāgyamukaṇṭē mikkili lābhamu lēdu
వివరణము
లౌకిక సుఖములందు కోరిక లేకపోవుటకంటె(వైరాగ్యము) ఇంకొక లాభము లేదు
ఆంగ్లానువాదము
It is not much better than dispassion
26
చదివియు ఫలమేది శాంతముగలుగుదాకా(1-437)
English transliteration
Cadiviyu phalamēdi śāntamugalugudākā
వివరణము
శాంతము    లేకుండా చదివినా ఫలితము రాదు.
ఆంగ్లానువాదము
Does not result in reading without peace
27
పరపీడ సేయుకంటే పాపము మరెందు లేదు
పరోపకారముకంటే బహుపుణ్యము లేదు(1-443)
English transliteration
Parapīḍa sēyukaṇṭē pāpamu marendu lēdu
parōpakāramukaṇṭē bahupuṇyamu lēdu
వివరణము
ఇతరులను బాధ పెట్టుట కంటె పాపము మరొకటి లేదు 
ఇతరులకు ఉపకారము చేయుటకంటె పుణ్యము మరొకటి లేదు
ఆంగ్లానువాదము
There is no more sin than to hurt others
There is no other good thing to do to others
28
మీటైనగురువుకంటే మీద రక్షకుడు లేడు(1-443)
English transliteration
Mīṭainaguruvukaṇṭē mīda rakṣakuḍu lēḍu
వివరణము
  గురువును మించిన రక్షకుడు ఇంకొకడు లేడు అని వాక్యార్థం .
సాధకులకు మూడు విధాలైన గురువులు. చోదకులు, బోధకులు, మోచకులు అని మూడు విధాలవారు. ‘‘చోదకో బోధకశ్చైవ మోచకశ్చ పరస్మృతః’’ అని బ్రహ్మవిద్యోపనిషత్ వాక్యం. చోదకులు అంటే కర్మోపాసన ఎలా చేయాలో చెప్పే ఉపదేష్టలు. బోధకులు జీవబ్రహ్మైక సిద్ధాంతాన్ని ప్రత్యక్షంగా బోధిస్తారు. ఇక మోచకులు ‘తాను వేరు, బ్రహ్మ వేరు కాదు’ అనే సత్యా’న్ని బోధించి, అవిద్య నుంచి, సంసార బంధాల నుంచి విమోచనం కలిగిస్తారు. చోదక బోధక గురువులు పరోక్ష జ్ఞాన సంపన్నులైనా కావచ్చు, అపరోక్ష జ్ఞానం కలిగిన వారైనా కావచ్చు. కాని, మోచక గురువులు మాత్రం అపరోక్ష జ్ఞానులై ఉంటారు.అన్నమయ్య చెప్పిన ఈ గురువు మోచక గురువు కావచ్చు.
ఆంగ్లానువాదము
There is no protector above GURU (MASTER)
29
అక్కర కొదగనియట్టి యర్థము
లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే(1-456)
English transliteration
Akkara kodaganiyaṭṭi yarthamu
lekka lenniyainā nēmi lēkunna nēmirē
.

వివరణం
అవసరానికి ఉపయోగపడని ధనం లెక్కలేనంత ఉన్నా , లేకున్నా ప్రయోజనం లేదు.
ఆంగ్లానువాదము
Numberless money is useless When not in real use
30
భువి సంసారికి పుత్రులె బ్రహ్మము(1-457)
English transliteration
Bhuvi sansāriki putrule brahmamu
వివరణం
ఈ భూమిలో సంసారికి(సంసారముగల గృహస్థుకు) కుమారులే బ్రహ్మము వంటివారు. 
ఆంగ్లానువాదము
In this land, A householder's sons are like the Supreme being.
బ్రహ్మము = 
the Supreme Being, regarded as impersonal or in the abstract and divested of all quality and action, the highest object of religious knowledge, the supreme all-pervading spirit and soul of the universe, the divine essence and source of all being, from which all created things emanate and to which they return, the self-existent, the absolute, the eternal;
***

No comments:

Post a Comment

Pages