గురుదక్షిణ - గేయం - అచ్చంగా తెలుగు
గురుదక్షిణ - గేయం 
అటతాళం
రెడ్లం రాజగోపాలరావు, పలమనేరు
09482013801

పల్లవి:
సాయిరాముని భజనజేయండి
జనులారమీరు సేవజేసి శాంతినందండి
కరములెప్పుడు సేవజేయుచు
శిరములెప్పుడు హరికిమ్రొక్కుచు
విరివిగా కాలమును సార్ధక
మొనరజేయు కృపాసముద్రుడు
|| సాయిరాముని||
చరణం:1
మానవత్వము మదిని నిలపండి
ఓ మనుజులారా, దీనులను దరిజేరదియండి
సొంతలాభము కొంతమానిన
సంతసించును సాయిరాముడు
ఇంతకంటెను విలువగల 
గురు దక్షిణాదులు ఏల స్వామికి
|| సాయిరాముని||
చరణం: 2
నియమ నిష్టల నాచరించండి
సద్గురుని కృపతో దేహమును శుద్ధముగ నుంచండి
జంతువులలో శ్రేష్థజన్మ
మోక్షమునకు పట్టుగొమ్మ
అంత్యకాలము రాకముందే
హరినిపొంది ముదమునందే
|| సాయిరాముని||
చరణం: 3
ప్రేమయే ఉత్థాన పథమండి
శ్రీసాయి సన్నిధి దివ్యప్రేమకు పెన్నిధేనండి
కలియుగమ్మున మానవులకు
కల్పతరువౌ సుగుణకీర్తి
విలువలెరుగక వినని జనులకు 
మించిదొరకదు మంచితరుణము
|| సాయిరాముని||

No comments:

Post a Comment

Pages