కవితా కోకిల - అచ్చంగా తెలుగు

కవితా కోకిల - పుస్తక సమీక్ష 
 తక్కె డశిల జానీ బాషా 

అవును తన మనసు చిన్న పిల్లల నవ్వు లాంటింది నేను కలిసింది రెండే సార్లు కాని పలకరించిన తీరు అచ్చు కోయిలలాగానే ఉండి అజాన్మంతం గుర్తు ఉండేలా చేసింది.ఎంతో ఆప్యాయంగా తన పుస్తకాన్ని నాకు అందించారు వారి అభిమానానికి అఖిలాశ ఏమివ్వగలదు అందుకే వెంటనే పుస్తకాన్ని మనసుతో తినేసి నాలుగు వాఖ్యలు సమీక్షలాగ మీ ముందు ఉంచుతున్నది.
పుస్తకంలో మొత్తం 78కవితలు ఉన్నాయి..అసలు శైలజా గారి కవితలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి.తనూ ఎంచుకున్న కవితా వస్తువును వివరంగా చెప్పడమే వారి ప్రత్యేకత. మొదటి కవిత రెక్కలు విరిగిన స్వేఛ్చ సమాజంలో ప్రజాస్వామ్యం లేదని సమాజంలో జరిగే అన్ని వ్యతిరేక కార్యలపై తన కవితా తూట సంధించారు.
చిన్ని ఆశ కవిత చదువుతున్నంత సేపు పాఠకులు వారి బాల్యంలోకి వెళ్ళిపోయి ఆనాటి మధుర జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. ఒక కవి రాసిన కవిత చదవగానే మన జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు వచ్చాయి అంటే అది ఆ కవి గొప్పదనమే కదా అలాంటి కవితలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి.ద్రవీభావం కవితా చదవగానే కన్నుల సరస్సు నుండి వేదనల నీరు ఉప్పొంగుతాయి.
గ్రామీణ వైద్యుడు ఒక యోధుడని పల్లె ప్రజలకి పగలు రేయి లెక్క చేయక పిలిచినా వెంటనే పలికి చిన్నపాటి రోగాలను నయం చేసే ధీరుడని చెప్పిన తీరు బాగుంది.రేడియేషన్ భూతం కవితలో రేడియేషన్ వల్ల పక్షులు మరణాలు జరుగుతున్నాయని పక్షులపై తనకున్న ప్రేమను చాటిన కవిత ఆలోచింప చేస్తుంది.తలుపులు కవితలో గుండెలో నిండిన భావాలు బయటికి రావడానికి పడే సందర్భాన్ని కవయిత్రి వివరించిన విధానం తనకున్న అనుభవాన్ని తేటతెల్లం చేస్తుంది.
మరుజన్ముంటే కవితలో మొదటి నాలుగు వాఖ్యలు అమోఘం పాఠకుడి ఒళ్ళు గగ్గురపుడుస్తుంది.ఒక శవం తనను తానూ ప్రశ్నించుకున్న తీరు కవయిత్రి నిక్కచిగా రాసిన విధానం చాలా బాగుంది.ఆమె ఒక పకృతి బొమ్మ కవితలో ఈ రెండు వాఖ్యలు చదవగానే మనసు మెలి పట్టేస్తుంది “ఆమె కడుపును నిలువుగానో,అడ్డంగానో కోత కోయించుకోనైనా జన్మనిస్తుంది కాని నేడు ఆ తల్లి/మహిళా పడే కష్టాన్ని తన కవనంతో మన హృది తలుపులు తట్టేలా చేస్తుంది.నిండుదనం కవితలో బ్రెస్ట్ కాన్సర్ పై రాసిన కవితను చదువుతుంటే మెదడు ఊగిపోతుంది.
అసలు కవయిత్రికి అందని కవితా వస్తువే లేదు ప్రతి విషయంపై తన కవితలలో ప్రశ్నించారు,బాధపడ్డారు,ఆక్రోశించారు,మదనపడ్డారు,జ్ఞపకాలు నెమరేసుకున్నారు,అనుభవాలను తిరగేసారు ప్రతి కవితా ఆణిముత్యమై మెరుస్తున్నది.కవయిత్రి యడవల్లి శైలజ గారు తెలుగు సాహిత్య జగత్తుకు మరిన్ని పుస్తకాలు అందించాలని మనస్పూర్తిగా కోరుతూ..!!
***

No comments:

Post a Comment

Pages