తల్లీ భారతి వందనం.. తల్లీ భారతి వందనం
బాల గేయాలు
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
పిల్లలకు చిన్న తనం నుండి దేశంపట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవ భావం పెంపొందించాలి. భావి భారత పౌరులు మన జాతిపట్ల కులమత బేధం లేక అందరినీ సోదర భావంతో చూడాలి. ఆవిషయాలను ప్రబోధించే మంచి పాట "తల్లీ భారతి వందనం" చూడండి.
“ తల్లీ భారతి వందనం.. తల్లీ భారతి వందనంనీ ఇల్లే మా నందనం.. మేమంతా నీ పిల్లలంనీ చల్లని ఒడిలో మల్లెలం..!
తల్లిదండ్రులను, గురువులను...ఎళ్లవేళలా కొలిచెదమమ్మా.. చదువులు బాగా చదివెదమమ్మజాతి గౌరవం పెంచెదమమ్మా.. కులమత భేదం మరిచెదమమ్మకలతలు మాని మెలగెదము.. మానవులంతా సమానులంటూసమతను మమతను పెంచెదము.. తెలుగు జాతికీ అభ్యుదయంనవభారతికే నవోదయం.. తెలుగు జాతి అభ్యుదయంనవభారతికే నవోదయం.. భావి పౌరులం మనం మనంభారత జనులకు జయం జయం.. భావి పౌరులం మనం మనం.”
పిల్లలకు చిన్నతనం నుండీ మంచి విషయాలపట్ల అవగాహన కలిగించాలి. నిద్రలేవగనే మరలా పడుకునే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాలని, దైవ ప్రార్ధన చెయ్యాలనే భావనలు నాటితే జీవితాంతం వారు మంచి దోవలో నడిచే అవకాశం ఉంది.
-o0o-
No comments:
Post a Comment