వందనాలు - అచ్చంగా తెలుగు
బాల గేయం 
                                                                           తక్కె డశిల జానీ బాషా


వందనలమ్మా  వందనాలు
భారతమాతకు వందనాలు
బంగారు చరితకు వందనాలు
భవిష్యత్ కోటకు వందనాలు


వేవేల వెన్నెల వందనాలు
వెచ్చని ఒడికి వందనాలు
ప్రకృతి మాతకు వందనాలు
ఆయువు తల్లికి వందనాలు


రత్నాల గనికి వందనాలు
ఎగిరేటి జెండాకు వందనాలు
పచ్చని పల్లెకు వందనాలు
పుణ్య భూమికి వందనాలు


జయ జయ జేజేల వందనాలు
సకల కళా కల్పతరువుకు వందనాలు
బంగారు చరితకు వందనాలు
భవిష్యత్ కోటకు వందనాలు
***

No comments:

Post a Comment

Pages