అన్నమయ్య
సూక్తి చంద్రిక(61-90)
(అన్నమయ్య
కీర్తనలలోని సూక్తులకు ఆంగ్ల లిప్యంతరీకరణము, ఆంగ్లానువాదము, వివరణములు
)
-డా. తాడేపల్లి పతంజలి
61
గోడ
గడుగ నడుసే కురిసీ నో మనసా(3-196)
English transliteration
Gōḍa gaḍuga naḍusē kurisīnō manasā(3-196)
వివరణం
ఓ మనసా ! ఈ సంసార సముద్రాన్ని దాటించే ఓడ వేంకటేశుడు. అతనిని విడిచి వ్యర్థ
వచనాలతో కాలాన్ని ఎందుకు వృథా చేస్తావు. మట్టి గోడను కడిగితే బురదే వస్తుంది.
ఆంగ్లానువాదము
O my mind! There is a ship called venkateswara that crosses this
domestic life sea. Why do you waste time with the junk text? if you a plan to
cleanse the wall ,mud will fall
ఈ సూక్తిలోని కొన్ని పదాలతో అన్నమయ్య ఇతర ప్రయోగాలు
అడుసు చొరు కాళ్లు కడుగు =స్వయంగా ఆపదను తెచ్చుకొని దానికి ప్రతీకారం
చేసుకొను.(బురదతొక్కు- కాళ్లుకడుగు)
సముద్రము కడచి ఓడలో నినుము దెచ్చు =
కొండను తవ్వి ఎలుకను పట్టు వృధా ప్రయాసపడు
62
సిరులు
దనకుండినా జేయిచాచు బరులకు(3-290)
English transliteration
Sirulu danakuṇḍinā jēyicācu barulaku(3-290)
వివరణం
తనదగ్గర సంపద ఉన్నా మానవుడు ఇతరుల సంపద కోసం ఆశపడుతుంటాడు. ఇదే మాయ
ఆంగ్లానువాదము
Even though he possesses wealth, man hopes for the wealth of others.
This is Maya(delusion)
63
దిక్కులేనివారికెల్లా
దేవుడొక్కడే దిక్కు(3-291)
English transliteration
Dikkulēnivārikellā dēvuḍokkaḍē dikku(3-291)
వివరణం
దిక్కులేనివారికి
వేంకటేశ్వరదేవుడు ఒక్కడే దిక్కు
ఆంగ్లానువాదము
Venkateshvara is the only
refuge for unprotected persons.
64
బలిమి
లేనివారికి పరమాత్ముడే బలిమి(3-291)
English transliteration
Balimi lēnivāriki paramātmuḍē balimi(3-291)
వివరణం
బలము లేనివారికి పరమాత్మ అయిన వేంకటేశ్వరుడే బలము.
ఆంగ్లానువాదము
The power of Venkateshwara is the strength of the powerless.
65
కనకము దాటితేనే ఘన సుఖమున్నది(3-308)
English
transliteration
Kanakamu
dāṭitēnē
ghana sukhamunnadi(3-308)
వివరణం
బంగారముపై
ఆసక్తి తగ్గితేనే శాశ్వత సుఖము కలుగుతుంది.
ఆంగ్లానువాదము
If
you lose interest in gold, you will have eternal happiness.
66
ధనమెంత గలిగె నది దట్టమౌ లోభంబు(3-322)
English
transliteration
Dhanamenta
galige nadi daṭṭamau lōbhambu(3-322)
వివరణం
డబ్బు
పెరుగుతున్నకొద్దీ దానిపై లోభము కూడా పెరుగుతుంది.
ఆంగ్లానువాదము
As
the money grows, it also increases the Covetousness
67
ఘనవిద్య గలిగినను కప్పు బైపై మదము(3-322)
English
transliteration
Ghanavidya
galiginanu kappu baipai madamu(3-322)
వివరణం
గొప్ప
విద్య వచ్చినవాడి మనస్సును మదము ఆక్రమిస్తుంది.
ఆంగ్లానువాదము
The
great educators mind is being occupied
by the arrogance
68
కలిమిలేములెల్లా కాలము స్వభావము(3-328)
English transliteration
Kalimilēmulellā kālamu svabhāvamu(3-328)
వివరణం
సంపన్నత మరియు దారిద్ర్యము కాలము యొక్క
స్వభావము.
ఆంగ్లానువాదము
The nature of the TIME is prosperity and poverty.
69
ధర గడపట నేజంతువుకైనా తన జన్మమే సుఖమై తోచు(3-372)
English
transliteration
Dhara
gaḍapaṭa nējantuvukainā
tana janmamē sukhamai tōcu(3-372)
వివరణం
ఈలోకంలో
జన్మించిన ప్రతి జీవి తన జన్మ చాలా సుఖంగా ఉన్నదని భావిస్తుంది
ఆంగ్లానువాదము
Every
creature who is born in this world thinks his birth is very comfortable
70
వెన్న చేతబట్టి నేయి వెదకగ నికనేల(3-413)
English transliteration
Venna cētabaṭṭi nēyi vedakaga nikanēla(3-413)
వివరణం
ఓ వేంకటేశ్వరా ! వెన్న చేతిలో ఉండగా నేతి కోసం వెతుకుట దండగ. నిన్ను
నాలో ఉంచుకొని వేరే ఎక్కడో వెతుకనక్కరలేదు.
ఆంగ్లానువాదము
When the butter is in the hands searching for the ghee is wasted programme.
71
చంచలము మానితేను సంసారమే సుఖము(3-414)
English transliteration
Can̄calamu mānitēnu sansāramē sukhamu(3-414)
వివరణం
చంచల గుణము విడిచిపెడితే ఈ సంసారము చాలా సుఖంగా ఉంటుంది.
ఆంగ్లానువాదము
This world is very comfortable if you leave the fickle mind.
72
వొరుల వేడకవుంటే వున్నచోనే సుఖము(3-414)
English transliteration
Vorula vēm̐ḍakavuṇṭē vunnacōnē sukhamu(3-414)
వివరణం
మన భోగాల కోసం ఇతరులను ప్రాథేయపడకుండా
ఉన్నచోటనే ఉన్నదానితో తృప్తిగా ఉండుట మేలు.
ఆంగ్లానువాదము
It is good to be satisfied with what is present. Dont ask
others for your enjoyments.
73
పరనింద విడిచితే భావమెల్లా సుఖము(3-414)
English transliteration
Paraninda viḍicitē bhāvamellā sukhamu(3-414)
వివరణం
ఇతరులను నిందించుట మానితే మనస్సు చాలా ప్రశాంతంగా, సుఖంగా
ఉంటుంది.
ఆంగ్లానువాదము
If you dont try to blame others, the mind is very comfortable .
74
కోపించకుంటే జన్మమెల్లా సుఖమే(3-414)
English transliteration
Kōpin̄cakuṇṭē janmamellā sukhamē(3-414)
వివరణం
కోపించకపోతే మానవునికి జన్మంతా సుఖంగా ఉంటుంది.
ఆంగ్లానువాదము
If you do not get angry,
you will feel always comfortable.
75
దీనత విడిచితేను దినములెల్లా సుఖము(3-414)
English transliteration
Dīnata viḍicitēnu dinamulellā sukhamu(3-414)
వివరణం
దైన్యము విడిచిపెడితే మానవునికి
రోజులన్నీ సుఖంగా ఉంటాయి.
ఆంగ్లానువాదము
If you leave Lowness, you will feel comfortable for all days.
76
పరమాత్ముడేలుకొంటే బంధములు గలవా(3-423)
English transliteration
Paramātmuḍēlukoṇṭē bandhamulu galavā(3-423)
వివరణం
పరమాత్ముడు కాపాడుతుంటే చిక్కులు
ఉండవు.
ఆంగ్లానువాదము
There are no complications with the protection of
the Lord.
వివరణము
బంధాలకు మానవ సంబంధాలు అను ఇంకొక అర్థం కూడా గ్రహింపవచ్చు పరమాత్ముడు
కాపాడితే సంబంధాలు ఉండవు. అనగా సంబంధాలకు కారణమయిన జన్మలు ఉండవు. ముక్తి
లభిస్తుందని భావం.
77
దైవము కృపగలిగితే తన కర్మలడ్డమా(3-423)
English transliteration
Daivamu kr̥pagaligitē tana karmalaḍḍamā(3-423)
వివరణం
దేవుని దయ కలిగితే మనం చేసుకొన్న కర్మలు మనలను బాధించవు.
ఆంగ్లానువాదము
If God's grace comes to us, Karma does not hurt us.
78
విత్తొకటి
వెట్టితేను వేరొకటి మొలచునా(3-478)
English transliteration
Vittokaṭi veṭṭitēnu vērokaṭi molacunā(3-478)
వివరణం
ఏ రకమైన విత్తనం పెడితే ఆ రకమైన మొక్క మొలుస్తుంది.వేరొకటి మొలవదు.
ఆంగ్లానువాదము
If one (type of a) seed is sown, will a different one (type of plant)
sprout?"
O Srihari! protect me
79
పోదిబరస్తుతి
పుణ్యముకంటే
పాదుగ
హరి దిట్టే పాపము మేలు(3-529)
English transliteration
Pōdibarastuti puṇyamukaṇṭē
pāduga hari diṭṭē pāpamu mēlu(3-529)
వివరణం
ఇతర స్తుతుల వలన వచ్చు పుణ్యము కంటె , హరిని నిందిస్తే వచ్చు పాపము మేలు.
( హరి గొప్పవాడని భావం)
ఆంగ్లానువాదము
More than any other purity which
is coming from others praise,It is good
to get the sin that comes from the blaming of HARI .( The inner meaning : "The praise of Lord Hari is great")
80
పరగ
నూరేండ్ల బ్రతుకునకేకా
ధర
నన్నియును గూర్చి దాచుకొనేది(3-560)
English transliteration
Paraga nūrēṇḍla bratukunakēkā
dhara nanniyunu gūrci dācukonēdi(3-560)
వివరణం
నూరేండ్ల బతుకుకోసం ఈ భూమిలో
ప్రతిది దాచుకోవాలని ప్రయత్నిస్తాం. అనేక సుఖ భోగాల కోసం ప్రయత్నిస్తాం.
మోక్షమునకు ఈ పాటి కష్టము పడము.
ఆంగ్లానువాదము
We try to hide everything in this land for our cheerful life. We will
try for many pleasures. But Nirvana thinking
is difficult at this point.
81
యెంత
వెలుగునకు నంతే చీకటి(3-566)
English transliteration
Yenta velugunaku nantē cīkaṭi(3-566)
వివరణం
వెలుగునకు తగినట్లుగా చీకటి
ఆంగ్లానువాదము
Light is the equivalent of Darkness
82
యెంత సంపదకు నంతాపద(3-566)
English transliteration
Yenta sampadaku nantāpada(3-566)
వివరణం
సంపద ఎంత ఉన్నదో అంత కష్టాలు
ఆంగ్లానువాదము
The trouble is so much as to how much wealth is
83
కోపమే
కూడుగ గుడిచిన యీబుద్ధి
కోపము
విడువుమంటే గుణమేల మాను(4-18)
English transliteration
Kōpamē kūḍugaguḍicina yībud'dhi
kōpamu viḍuvumaṇṭē guṇamēla mānu(4-18)
వివరణం
ఓ వేంకటేశ్వరా ! ఈ బుద్ధి కోపాన్ని ఆహారంగా తీసుకొంది. మరి అలాంటప్పుడు కోప
గుణాన్ని ఎలా మానుకొంటుంది?
ఆంగ్లానువాదము
O Venkateswara! My Intelligence
took anger as food. Then how can It
lose angers nature.!?
84
పచ్చిగరికెకాలము
ప్రపంచములో బ్రదుకు(4-24)
English transliteration
Paccigarikekālamu prapan̄camulō braduku(4-24)
వివరణం
ఓ వేంకటేశ్వరా ! ఈ ప్రపంచములో జీవితం పచ్చిగరికె వలె అశాశ్వతం, కొంతసేపు మాత్రమే ఉండేది.
ఆంగ్లానువాదము
O Venkateswara! The life in this world was temporary only a point of time, as a a blade of straw or grass.
85
మరిగినతెరువల
మనసుయిది(04-03)
(4-24)
English transliteration
Mariginateruvala manasuyidi
వివరణం
వ్యసనాల దారులను మరిగిన మనస్సు ఈ జీవునిది.
ఆంగ్లానువాదము
O Venkateswara! Man is very fond of addictions.
86
కలయ
జీకటియైతేగాని దీపమిడుకోడు(04-037)
English transliteration
Kalaya jīkaṭiyaitēgāni dīpamiḍukōḍu(04-037)
వివరణం
బాగా చీకటి పడితేనే దీపం
కావాలనిపిస్తుంది.
అజ్ఞానము తనలొ పెరిగినట్లు గుర్తిస్తేనే జ్ఞానము కొరకు వెతుకుతాడు.
ఆంగ్లానువాదము
we want the lamp when it was too
dark.
The man searches for wisdom if he
finds ignorance grown up.
87
పుట్టుట
సంశయము పోవుట నిశ్చయము(04-064)
English transliteration
Puṭṭuṭa sanśayamu pōvuṭa niścayamu(04-064)
వివరణం
మరణము ప్రతి వారికి నిశ్చితము. పుట్టుక సంశయముతో కూడుకొన్నది.
ఆంగ్లానువాదము
Death is for everyone.It is
compulsory. The birth is not for everyone .It is with suspicious.
88
ఓర్పుకంటె
సుఖమొకటికగద్దా(04-68 అనుబంధం)
English transliteration
Ōrpukaṇṭe sukhamokaṭikagaddā(04-68 anubandhaṁ)
వివరణం
ఓర్పుకంటె మించిన సుఖము ఇంకొకటి ఉందా?(ఓర్పు గొప్ప సుఖమని భావం)
ఆంగ్లానువాదము
Is there more happiness than the patience?
89
యీ నాలుకే కాదా యిందరిని బొగడేది
తానకపు వేదములు తడవీగాక(04-44)
English transliteration
Yī nālukē kādā yindarini bogaḍēdi
tānakapu vēdamulu taḍavīgāka
వివరణం
ఎంతోమందిని లౌకిక అవసరాల కోసం
పొగిడేది ఈ నాలుకే కదా !
స్థిరమైన వేదాలను ఇది తడిమితే (చదివితే) ఎంత బాగుండును!( వేదాలు చదువుకోవాలని
భావం)
ఆంగ్లానువాదము
This is the tongue that is
praising for secular purposes!
How much better it is to read the constant Vedas!(The Vedas
should be read)
90
యిహములో తృణములుయెండినా యోగ్యములాయ
బహి నిర్జీవపు మేను పనికిరాదాయ(04-82)
English transliteration
Yihamulō tr̥ṇamuluyeṇḍinā yōgyamulāya
bahi nirjīvapu mēnu panikirādāya
వివరణం
ఈలోకంలో గడ్డి పరకలు ఎండినా పనికి వస్తాయి. కాని ఈ జీవములేని శరీరము
పనికిరాదు.
ఆంగ్లానువాదము
In this world, grass trifles are dried to work. But this
lifeless body is not worth it.
______
No comments:
Post a Comment