భావకవిత్వ సార్వభౌమ శ్రీ దేవులపల్లి
- పోడూరి శ్రీనివాసరావు
భావకవిత్వానికి బ్రహ్మ...రారాజు...’ఆంధ్రా షెల్లీ’ అని కీర్తింపబడ్డ మహానుభావుడు...సాహిత్య సరస్వతికి అనుంగు ముద్దు బిడ్డ.... కవితామూర్తి...శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ...’మల్లీశ్వరి సినిమా అంత అఖండ విజయం సాధించిందంటే... శ్రీ దేవులపల్లి వారి కలం నుంచి జాలువారిన అక్షరమాల... దానికి తోడు మహామహులయిన శ్రీ నందమూరి తారకరామారావు, భానుమతి గార్ల అభినయ కౌశలం...శ్రీ దేవులపల్లి వారి గీతాలను అత్యుద్భుతంగా స్వరపరచిన ర’సాలూరు’ రాజేశ్వరరావు ...ఆ దర్శకత్వ ప్రతిభ అంటే అతిశయోక్తి కాదేమో!
ప్రసిద్ధ తెలుగు కవి,తెలుగు బావ కవితారంగంలో శ్రీ కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. మరచిపోలేని,మరపురాని ఒక మధురభావన. రేడియోలో లలితగీతాలు,నాటికలు,సినిమాల్లో పాటలు వ్రాయడం ద్వారా సాహితీవనంలో శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సుగంధాలు పూయించారు.
1929 లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ని కలిశాక,శ్రీ కృష్ణశాస్త్రిగారి కవిత్వంలో భావుకత తొంగి చూడడమే కాక,గుబాళించింది. 1945 లో ఆకాశవాణిలో చేరి శ్రీ కృష్ణశాస్త్రిగారు అనీక పాటలు,నాటికల్ రచించారు.
******
దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలోతనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడపట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.
ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.
తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు
పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశాడు.
1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి... బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించడం తో పాటు, సాహితీవిలువలు పెంచారు. తానమేమిటో తెలుగు ప్రేక్షకులకు,శ్రోతలకు,విమర్శకులకు తెలియచెప్పారు. బావ వ్యక్తీకరణ,సాహిత్య సంపద, పదలాలిత్యం,సారళ్యం,ప్రకృతి సౌదర్యం క్రుష్ణశాస్తి పాటల్లోని ప్రదానలక్షనాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చిన మహనీయుడు శ్రీ కృష్ణశాస్త్రి. ఆయన కలం నుంచి భావ గీతాలే కాదు సుకుమారంగా ప్రణయ విరహ గీతాలు, ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా జాలువారాయి. శ్రోతల్ని ఆనందపరవశుల్ని చేసాయి. తోలి చిత్రమైన మల్లీశ్వరి తోనే తెలుగు సినీ సాహిత్య గేయ రచనలో మకుటంలేని మహారాజుగా సాహితీసార్వభౌమ స్థానాన్ని అధిరోహించారు.
తెలుగు సైన్ గేయరచన అన్నది ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమయింది అనుకుంటే సుమారు 20 సంవత్సరాల నాటికి ఎనభై వసంతాల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్నిగణనకు తీసుకోలేదు ) రాశారు. ఇలా గీతరచయితలుగా పేరుమోసిన 400 మంది కవులను జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది కంటే ఎక్కువ ఉండరంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు.అందులో కూడా ప్రత్యెక స్థానం సంపాదించుకోగలిగిన,శ్రోతల గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుని, చెరగని ముద్ర వేసుకున్న తెలుగు సినీగేయ రచనా రారాజు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారంటే కాదనే తెలుగువాడు ఉండదని నా అభిప్రాయం. పైన తెలిపిన విధంగా తెలుగు సినిమా పాటకు పద నిర్దేశకుల్లోనూ అతి తక్కువ పాటలు కేవలం 170 పాటలు మాత్రమే రాసిన ఎవరయ్యా అంటే...శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే!! ఆ నూట డెబ్బయ్ పాటలు కూడా అజరామరాలే!!ప్రతీపాట ఆణిముత్యమే. మల్లీశ్వరి (1951) చిత్రం లోని పాటలు విన్త్న్తే నేటికి కూడా శ్రేతల గుండెలు సవ్వడులతో ఉరకలు వెస్థోఎ ఉంటాయి. ‘నల్లని మబ్బులు గుంపులు గుంపులు’,,,తెల్లని కొంగలు బారులు బారులు’ అని భానుమతి గళంతో,ఘంటసాల మేష్టారి స్వరంలో పాత వినపిస్తుంటే – మల్లీశ్వరి చిత్రంలో నాగరాజు, మల్లీశ్వరి ఎడ్లబండి మీద వెళుతున్న దృశ్యం మన కళ్ళ ముందు కదలాడక మానదు. ఎక్కడ 1951 – ఎక్కడ 2018. ఇప్పటికి 67 సంవత్సరాలయినా...ఆనాటిపాటలు ఇప్పటికీ జనరంజక మౌతున్నాయంటే ఆనాటి సాహిత్య విలువలు. తన తొలిచిత్రంలోనే అంతటి సుమధుర, సుమనోహర గీతాల్ని అందించిన శ్రీ దేవులపల్లి కారణజన్ముడు కాదంటారా?
గోప్పవక్తగా, భావకవుల ప్రతినిధిగా,ఆంధ్రాషేల్లీగా పేరు పొందిన శ్రీ కృష్ణశాస్రి గారి గొంతు 1963 లో అనారోగ్య కారణంగా మూగబోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రితన కవిత సౌరభాన్ని సురలోక వాసులకు అందజేయాలన్న తలంపుతో స్వర్గానికేగారు.
వారు బౌతికంగా లేకపోయినా,వారి గేయరచనా కౌశలం మనందరి చెవుల్లో,గుండెల్లో మారు మ్రోగుతూనే ఉంటుంది.
వారందుకున్న పురస్కారాలు - 1975 - ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ, 1976 లో పద్మ భూషణ్,1978లో సాహిత్య అకాడమీ అవార్డు.
శ్రీ కృష్ణశాస్తిగారి రచనలలో ముఖ్యమైనవి: కృష్ణ పక్షము, ఊర్వశి కావ్యము,అమృతవీణ (గేయమాలిక), అమూల్యాభిప్రాయాలు (వ్యాసావళి), బహుకాల దర్శనం – (నాటికలు,కథలు), ధనుర్దాసు (నాలుగు భక్తీ నాటికలు),కృష్ణశాస్త్రి (వ్యాసావళి) ,మంగళకాహళి (దేశభక్తి గీతాలు), శర్మిష్ఠ ( 6 శ్రవ్య (రేడియో) నాటికలు), శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, మేఘమాల - సినిమా పాటల సంకలనం; శ్రీ విద్యావతి (శృంగార నాటికలు), యక్షగానాలు - అతిథిశాల (సంగీత రూపకాలు); వెండితెర పాటలు, మహాతి మొదలైనవి.
వారు రచించిన మనోహరమైన,మనసుకు హత్తుకునే పాటలు గల కొన్ని సినిమాలు:మల్లీశ్వర, రాజ మకుటం , ఏకవీర ,మాయని మమత,శ్రీరామ పట్టాభిషేకం ,మేఘ సందేశం, వాడే వీడు , కార్తీక దీపం ,గోరింటాకు,బంగారు పంజరం , కళ్యాణ మండపం ,బంగారు పంజరం,కలసిన మనసులు, బలిపీఠం,ఉండమ్మా బొట్టు పెడతా,జగత్ కిలాడీలు ,ఈనాటి బంధం ఏనాటిదో, అమాయకుడు,శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ , చీకటి వెలుగులు, అమెరికా అమ్మాయి, సుఖదుఃఖాలు , సీతామాలక్ష్మి ,నామాల తాతయ్య, మా బంగారక్క ,అమ్మ మాట, ఆనంద భైరవి , భక్త తుకారాం, రాముడే దేముడు
శ్రీ కృష్ణశాస్త్రి గారి గురించి ప్రముఖకవులు వెలిబుచ్చిన అభిప్రాయాలు:
విశ్వనాథ సత్యనారాయణ - మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.
మహాకవి శ్రీశ్రీ - నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.
ఫిబ్రవరి 24 వతేదీన దివికేగిన శ్రీ కృష్ణశాస్త్రిగారిపై, ఫిబ్రవరి సంచికలో ఈ వ్యాసం వ్రాయడం ఆయనకు నేను అందించే నివాళిగా భావిస్తున్నాను. నిజంగా ఇది నా అదృష్టమే కాదు...యాదృచ్చికం కూడా...
***
No comments:
Post a Comment