హైకూ - అచ్చంగా తెలుగు
హైకూ
తోలేటి రాజేష్ 


హైకూ జపనీస్ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన  కవిత్వ ప్రక్రియ. ఇది 15వ శతాబ్దం నుండి వెలుగులోకి వచ్చింది.
ఇంత పురాతన చరిత్ర కలిగా ఉన్నా, సంక్షిప్తంగా ఉండటం వలన ఆధునిక పాఠకులకు కూడా చేరువ అయ్యింది.
మనం ఇప్పుడు ఒకసారి  హైకు నిర్మాణం గురించి, కొన్ని ఉదాహరణలు చూద్దాము.

హైకు నిర్మాణం చాలా తేలికగా ఉంటుంది.
1. హైకూ మూడు పాదాలలో పదిహేడు 'మాత్రలు'( సిలబుల్స్) కలిగిన త్రిపద.
2. మొదటిపాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు చొప్పున మాత్రలుఉంటాయి.
3. రెండు వేరువేరువిషయాలు విశ్లేషించబడతాయి.
4. ఒక ఋతువుకి  సంబంధించిన పదం  ఉంటుంది

అదృష్టవశాత్తు ఇస్మాయిల్  గారు ఈ ప్రక్రియ ని తెలుగుకి పరిచయం చేశారు.
ప్రముఖ సాహితీ కారులు  వాడ్రేవుచినవీరభద్రుడు మాటలలో చెప్పాలంటే  "మానవాత్మనీ, భూమ్యాకాశాల్ని, వెలుగునీడలను ఒకే స్నాప్ షాట్ లో పట్టే ప్రక్రియ".

మొదట్లో  పైన చెప్పబడిన  నియమాలు అనుసరించెను,  రానురాను తెలుగులో ఆ కూర్పు పాటించట లేదు.

ఉదాహరణ (సంప్రదాయ హైకు ):

సమీక్షకుడు
పచ్చి పాల మీగడ
వెతికే అత్త
- పెన్నా శివరామకృష్ణ

ఉదాహరణ (ఆధునిక హైకు ):

వాగుప్రవాహానికి
అన్నీ కొట్టుకుపోతున్నాయి
చంద్రుడు తప్పించి
-తలతోటి పృథ్విరాజ్

ఈ తరహాలో  లండన్ (UK)  నేపథ్యంలో కొన్ని స్వీయ హైకులు.

 నల్ల మబ్బులు
 లండన్ మూల మూలాల్లో  
 పొమ్మంటున్నాయి .

రంగు రంగుల్లో
మధ్య జేగురు రంగు
కలల వర్షం.

 వీపింగ్ విల్లో
ప్రొద్దు అందాలరాశి
రాత్రి  దెయ్యాల మర్రి .

హంతకులకి
స్వర్గం ఎవడుఇస్తాడో!
చెప్పింది ఎవరో?

1 comment:

  1. ఈ స్వీయకూర్పు.. లండన్ వారి 'రాజ'సం... వెల్లడిస్తుంది....

    ReplyDelete

Pages