కర్మ వీరులు
గజవెళ్ళి శ్రీనివాసాచారి
చూడు చూడు వీళ్ళ బ్రతుకులు
దుర్గంధాన్ని పన్నీరనుకొని
ఒళ్ళంతా పూసుకునే
కర్మవీరులు
స్వచ్ఛ భారత్ కు
బ్రాండ్ అంబాసిడర్లు
వాళ్ళు పరిశుభ్రం చేస్తేనే
మనకు ఆరోగ్యం
వాళ్ళు విష వాయువులు పిలిస్తే
మనకు లభించు స్వచ్ఛ గాలులు
మన ఆరోగ్యం కోసం
ప్రాణాలు కోల్పోయేవాళ్ళు
వాళ్ళ ప్రాణాలకు లేదు విలువ
సమాజానికి పట్టదు వీళ్ళ గోడు
వాళ్ళ మరణాలు మనల్ని కదిలించవు
వాళ్ళ కుటుంబాలకు అశనిపాతం
జై స్వచ్ఛ భారత్
..
No comments:
Post a Comment