కిసుక్కున నవ్వండి! - అచ్చంగా తెలుగు
కిసుక్కున నవ్వండి!
(పాత్రలు మనవే( కావచ్చు), అందుకే పేర్లు పెట్టలేదోచ్)
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
 

‘ప్రేమించుకునేటప్పుడు నువ్వు నా హృదయరాణివి అనడం పొరబాటైంది. పెళ్లై పాతికేళ్లయినా ఇంకా తన అడుగులకి మడుగులొత్తుతూనే ఉన్నాను’
*****
ప్రేమికురాళ్ల సదస్సులో-
‘ఏదో మన సెల్ ఛార్జింగ్లకు, సినిమాలకు షికార్లకు తిప్పడానికి, గిఫ్ట్ లు ఇవ్వడానికి, హోటల్లలో తినిపించడానికీ కార్డులు తెగ గీకేశామని అబ్బాయిలు గగ్గోలు పెడతారుగాని, ప్రేయసి కోసం తాజ్ మహల్ కట్టిన షాజహాన్ ముందు వీళ్లెంత? వీళ్ల ప్రేమెంత? ఉత్త కంజూసుగాళ్లు’
*****
’నిన్నటి వెలంటైన్ డే నాడు నీకు ఆ కపూర్గాడు ప్రపోజ్ చేయొచ్చేమోనన్నావుగా, చేశాడా? ఏమిచ్చాడు?
’ఆఁ..మోకాళ్ల మీద నుంచుని, ఇదిగో ఈ పువ్వు’ తన తల్లోంచి ఎండిన గులాబీని తీసి చూపించింది.
*****
‘నీ పేరు లవ్ కుమారా? మీ అమ్మానాన్నల ప్రేమ ఫలించి పెళ్లిచేసుకున్నాక పుట్టిన నీకు, ఆ పేరు పెట్టి ఉంటారు, అవునా?
’కాదు ఇద్దరి ప్రేమలు ఫెయిలై’
*****
‘నాన్నా,ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు నా ప్రేమకు అడ్డుచెప్పడం నాకు మింగుడు పడ్డం లేదు’
’అనుభవంతో నీ సుఖం కోరి చెబుతున్నా..నా మాట విను’
*****
భగ్నప్రేమికుడైన కవి డైరీలోని ఓ పుట!

‘వసంత కాలంలోని
ప్రకృతి రమణీయత అన్నికాలాల్లోనూ ఉండదు
ఈ వాస్తవం తెలుసుకోగలిగితే,
ప్రేమ అజరామరంలాంటి
పైత్యపు వాగుడుండదు’
***** 

No comments:

Post a Comment

Pages