ఊహించని అవకాశాలు - అచ్చంగా తెలుగు

ఊహించని అవకాశాలు

Share This
ఊహించని అవకాశాలు
ఆండ్ర లలిత 

ఇల్లో సినిమా హలో తెలియటంలేదు.   బాబ్జీని చిన్న పిల్లాడిలా  చూసి  targets  గుర్తు చేయాలా అని అనిపించింది అమ్మ మాధురికి. లేదూ బాబ్జీ వయసుకి గౌరవించి యువకుడని  అలా వెంటపడి చెప్పటం మానేయ్యాలా అని తల్లి స్థానంలో మధనపడింది మాధురి. తోముతున్న గిన్నె సింక్లో జారవిడిచింది. ఏవో మాటలు గుర్తొచ్చి. లోకులు కాకులని అనిపించింది మాధురికి. తన పిల్లాడికి నైతికవిలువలు, మనోబలం  ఆయుధాలగా ఇచ్చి తీర్చి దిద్దింది, ఈ లోకాన్ని ఎదురుకునేటందుకు.  బాబ్జీకి ఎప్పుడు చెప్పేది,నీ గుర్తింపు నీ మనసు, నీ జ్ఞానమని. ఒక్కసారి తనకి అనిపించింది, బాబ్జీ సమయం వృధా చేస్తున్నాడేమోనని. ఇలా సమయం పాడు చేసుకుంటే, తన తరువాత ఈ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లాడు  ఈ పోటి ప్రపంచంలో ఎక్కడో ఏకాకిలా మిగిలి పోతాడేమోనని బెంగ వచ్చింది. వంటింటిలో పని చేసుకుంటున్నంత సేపు  మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతోంది అమ్మ మాధురికి.  ఈ కాలము పిల్లలికి తన రోజులలోలాగ  గదమాయించి చెప్పడానికి లేదు. మరి ఏంచేస్తాము,  వెళ్ళిన బడులు, పెరిగిన వాతావరణం అటువంటివి.  పోనీ అలా పెంచకుండా ఉందామంటే కుదరదే!  పోటి ప్రపంచం కదా!  దానిలో నెగ్గుకుని వచ్చేటందుకు మనమే కొనిస్తాము వాటికి తగ్గట్టుగా  పరికరాలు, పుస్తకాలు... అసలు వాళ్ళు పాఠాలు నేర్చుకున్న పద్ధతులే వేరూ. అదీకాకుండా  తల్లి తండ్రులు  పిల్లలితో  స్నేహితులులాగా వ్యవహరించాల్సిన పరిస్థితులు.
“బాబ్జీ! ఇదిగో కాఫీ. ఏమి చేస్తున్నావు?  మళ్ళీ సినిమానా!” అంది అమ్మ మాధురి.
“అవును! ఏమంటావు, చూడకూడదా! అన్నీ నీకు చెప్పి చేయ్యాలా!” అన్నాడు బాబ్జీ కోపంతో ఊగిపోతూ.
“సరేలే! సరిగ్గా మాటలాడచ్చుగా! అమ్మని కదా ! మనసు ఏదో పరి పరి విధాల పోతుంది. ఎక్కడ నీ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమోనని, నువ్వు మరీ  విశ్రాంతిగా గడుపుతున్నావేమోనని మధనపడుతున్నాను” అంది అమ్మ మాధురి  తన కొంగుకి తడి చేతులు తుడుచుకుంటూ.
“ఏదో, మొన్ననే కదా పరీక్షలు అయ్యాయి, బుర్ర వెడెక్కిపోయింది. ఏదో రిలాక్స్ అవుతున్నాను. దానికి ఇంత అరిచేయ్యాలా! నేనేమన్నా చిన్న పిల్లాడినా.  అయినా నాకు అర్థమవ్వదూ,  నువ్వు నా స్నేహితురాలిని అంటావు. నాతో పాటు రిలాక్స్ అవుతూ సినిమా చూడచ్చుగా. అలా నా ముందు  pipe line of targets పెట్టే బదులు. Relax అమ్మా! ” అన్నాడు బాబ్జీ కాఫీ ఆశ్వాదిస్తూ చిరునవ్వుతో.
“అరిచానా! సర్లే రిలాక్స్ అవ్వు. నువ్వు నవ్వుతూనే ఉండు. నీ నవ్వే నీకు శ్రీరామరక్ష కావాలి. అదే నాకు కావాలి.  నాదే తప్పు. మనసు పాడిచేసుకోకు. ఒత్తిడి తెచ్చుకోకు. టిఫిన్ ఎప్పుడు  పెట్టమంటే అప్పుడు పెడతాను. సరేనా!” అంది అమ్మ మాధురి వాత్సల్యంతో  బాబ్జీ తలనిమురుతూ .
“ఇంకా పెడతావా! అప్పటినుంచి మొరపెట్టుకుంటున్నాను నేను. ఏదో పిండి రుబ్బుకుంటూనో.... అంట్లు కడుక్కుంటూనో ధోరణిలో ఉంటావు. అసలు నేను గుర్తుంటే కదా నీకు.   ఏవన్నా అడిగితే, అదా! అక్కడే వుంది తీసుకుని తిను అంటావు. ఖాళీలేదంటావు. నువ్వు మారిపోయావు. ఎంతసేపు బెత్తం పట్టుకుని అజమాయిషీ చేస్తావు. అసలు పట్టించుకోవటంలేదు నన్ను.  ఏది టిఫిను? పెట్టుమరీ!” అన్నాడు B.tech పరిక్షలు రాసిన బాబ్జీ అమ్మ మాధురి కేసి తిరిగి అమాయకంగా అమ్మ హృదయాన్ని తాకుతూ . అయ్యో అని తల కొట్టుకుంటూ “ నేను మారలేదు నాన్నా.  నువ్వంటే నాకు చాలా ఇష్టం కన్నా.  ఏదో బాధ్యతలు గుర్తొచ్చి ఒక్కొక్కసారి అలా వ్యవహరిస్తాను అంతే.  మార్చుకుంటాను నాన్నా. చూడు నా బంగారు తండ్రికి నేను, టిఫిను పెట్టటం  మర్చిపోయాను  ఏదో ధోరణిలో. sorry  నాన్నా”అంటూ  మాధురి వంటగదిలోకి వెళ్ళి దోశెలలోకి  పెరుగు ఆవకాయ కలిపి  పచ్చడిలాగ  చేసి, దోశెలు  పక్కన వేసి  తెచ్చి ప్రేమతో ఇదిగో అని అదించింది బాబ్జీకి.
ఆ పళ్ళెం అందుకుంటూ “బుంగమూతితో ఇప్పుడు బావున్నావు. That’s like my అమ్మ. నా మనస్సంతా ఎందుకు పాడిచేసావు  అమ్మా .. చదువూ,  targets అని గుర్తు చేస్తూ.  గుర్తు చేయకు నాకు. Enjoy  చేయనీయమ్మ” అన్నాడు బాబ్జీ అమ్మ మాధురి కేసి తిరిగి. 
“Enjoy చేయ్యి నాన్నా. కాని  ఒకవేళ గుర్తు చేసానే అనుకో, అంత టెషన్గా ఎందుకు  ఉంటావు. అయినా చదువు, లక్ష్యాలు మర్చిపోవాలనుకుంటే మర్చిపోగలమా చెప్పు. జీవితంలో   ఒత్తిడులు, లక్ష్యాల సాధనలలో సహజమని తెలుసుకుని నెమ్మదిగా మనము వ్యవహరించాలి. వాటిని యాధావిధముగా స్వీకరించి జీర్ణించుకోవాలి. పుట్టిన మొదలు పోయేవరకు  అవి మనతోనే ఉంటాయి నాన్నా. అది ఎంత తొందరగా మనము అర్థము చేసుకుంటే అంత తొందరగా మన మనసు కుదుటపడుతుంది” అంటుంటే అమ్మ మాధురి  మాటలు  నచ్చక బాబ్జీ ఒక్క నమస్కారము పెట్టి   మళ్ళీ మొదలు లెక్చరు రామచంద్రా!  నన్ను వదిలేసేయి తల్లీ.  నీ పని చూసుకో ! చాలు”  అన్నాడు.
అక్కడ నుంచి అమ్మ మాధురి బరువెక్కిన గుండెతొ పక్కబట్టలు మడతపెట్టడానికి వెళ్ళిపోయుంది, పడకగదిలోకి. 
అది గమనించిన బాబ్జీ ,అమ్మ అలా ఉండటం ఇష్టంలేక “sorry అమ్మా! ఇటురా ఒకసారి!”అని పిలిచాడు.
“ఏమిటి?” అంటు వచ్చింది పడకగదిలో నుంచి  అమ్మ మాధురి సావిట్లోకి బాబ్జీ దగ్గరకు ముభావంగా.
“నా మనసంతా  పాడిచేసావు. నేను సంతోషముగా ఉండటం నీకు ఇష్టం లేదా! చెప్పూ. విశ్రాంతి తీసుకోనీయవు. ఎంతసేపు పరుగెడుతూనే ఉండమంటావు. నువ్వు ఆనందముగా ఉండవూ, మిగతావాళ్ళని ఉండనీయవు. ఎంతసేపు targets, schedules అని పాకులాడతావు. ఎందుకు అలా చేస్తావమ్మా!” చిరాగ్గా అన్నాడు బాబ్జీ. 
“పోనీలేరా! నీకెలా కావాలో అలా ఉండు. అంత ఆవేశం ఎందుకు, వదిలేసేయి. అంత ఉద్రేకము మంచిది కాదు. చిన్న పిల్లాడివి కాదు. Plan your own things బాబ్జీ”అంది అమ్మ మాధురి.
“Ok. అయితే ఎమంటావు.  నాకు ఏమీ అర్థంకావటంలేదు. తిప్పి తిప్పి మాటలాడకు. నాకు నీ కాకమ్మ కథలు అర్థంకావు. సరిగ్గా చెప్పు. మళ్ళీ నువ్వు అలా ముభావంగా ఉంటే చూడలేను. నాకు తెలుసు plan  చేసుకోవాలని. చేస్తాను. కాస్త drift అయ్యానంతే. అయితే మటుకు, మళ్ళీ నేనే వస్తాను కదమ్మా!” అన్నాడు బాబ్జీ , అమ్మ మాధురీ కళ్ళల్లో సమాధానం వెతుకుతూ.
“వస్తావురా! రావనికాదు. కాని సమయం నీకోసం వేచియుంటుందా చెప్పు. ఆలోచించరా! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి బాబ్జీ!” అంది అమ్మ మాధురీ  బాబ్జీ తిన్న ప్లేటు సింక్లో పెట్టటానికి వంటగదిలోకి వెళ్తూ బాబ్జీ కేసి తిరిగి చూస్తూ.
“ఏదో మాటలాడతావమ్మా”అన్నాడు బాబ్జీ మళ్ళీ లేప్టాప్లో సినిమా వీక్షిస్తూ. దానికి సమాధానంగా బాబ్జీ కేసి చూస్తూ “ మరి  వదిలేయరా. నాకు తెలుసు నువ్వు వేసే ప్రతీ అడుగు ఆచితూచీ ఏకాగ్రతతో నీ లక్ష్యంకేసే వేస్తావని. ఏదో ఇంకా చిన్న పిల్లాడవేమోనని నాకు తెలిసినదంతా ఏదో చెప్పేయాలనుకుంటాను. నేను మర్చిపోతాను నాన్నా, నువ్వు యువకుడవని. కానీ నాన్నా, మనకి  జ్ఞానం చదివిన చదువులతో వస్తుంది. కానీ, ఆ  జ్ఞానానికి పరిపక్వత అది అచరణలో తీసుకొచ్చినప్పుడు వస్తుంది. మనము పడే శ్రమ ఆచరణలో తీసుకురావటానికి, ఆటుపోటులను తట్టుకుంటూ లక్ష్యం దిశలో వేసే ప్రతీ అడుగులో కనబడుతుంది. ఒకటి గుర్తు పెట్టుకో నాన్నా! సమయము అమూల్యం.  అది ఎవరికోసము ఆగదు.  అందుకే బామ్మ నీ చిన్నప్పుడు చెప్పేది నీకు కథలలో. ఆలస్యం అమృతం విషం అని. నీకు గుర్తుందా.”
“ఎందుకు లేదు, గుర్తుంది. నిదానమే ప్రధానము. దుడుకు పనికి రాదు అని చెప్పినట్లు కూడా  గుర్తు” అన్నాడు బాబ్జీ చిన్నపిల్లాడిలా.
“సరే plan చేసుకుంటాను లేమ్మా. నువ్వు చూస్తూ ఉండు I will achieve the goals and reach up to the stars. You just sit back and relax అమ్మా” అన్నాడు బాబ్జీ  అమ్మ మాధురి ముఖముపై చిరునవ్వు వెతుకుతూ. 
మళ్ళీ అందుకుంటూ “అసలు ఎందుకు బెంగపెట్టుకుంటావు అమ్మా. అంతగా అయితే ఇవాళ చేసేపని రేపు చేస్తా అంతే.కొంపలేం ములిగి పోవటం లేదు కదా!” అన్నాడు బాబ్జీ అమ్మ దగ్గర కూర్చొని అమ్మ మాధురి చేయి పట్టుకుని. 
“అవుననుకో సమయమూ, అవకాశాలు మనకోసం ఆగాలికదా!” అంది అమ్మ మాధురి.
“ఎందుకు ఆగవు, ఆగుతాయి. ఒకవేళ అవి తప్పిపోతే. సరే. అది కాకపోతే ఉంకొకటి వస్తుంది అమ్మా” అన్నాడు బాబ్జీ ధీమాగా.
“నాన్నా బంగారు తండ్రి అవకాశాలు అప్పనంగా వస్తాయా బాబూ. అవి నక్షత్రాలలా  కనిపించి మాయమోతాయి. అవి మన మన అదృష్ట తారలు. మనము అవి జారవిడుచుకోకుండా అందుకోవాలి. అవి అందుకుంటే మన లక్ష్యాన్ని సాధించగలము. నువ్వు నీ లక్ష్యాలు plan చేసుకో. గాలిలో మాటాడకు” అంది అమ్మ మాధురి వాత్సల్యం నిండిన కళ్ళతో బాబ్జీని చూస్తూ.
“సరే బాబు, ఒక గంటలో సినిమా అయిపోతుంది. అప్పుడు నా goals, targets, step by step plan చేస్తాను. కొంచం చూడనీ. నువ్వుకూడా చూడమ్మా” అన్నాడు బాబ్జీ. 
“లేదు నాన్నా పొద్దెక్కిపోతోంది.  తడి బట్టలు ఆరేసుకోవాలి” అని బాబ్జీతో అంటూ పెరటిలోకి వెళ్ళింది అమ్మ మాధురి.
ఇక్కడ సినిమా చూస్తున్న  బాబ్జీకి goals, targets, projects ఏవో గుర్తొచ్చి లాప్టాప్లో చూసుకుని గుండె గుభేలుమని, “అమ్మో నేను చేద్దామనుకున్న   హాబీ ప్రోజక్ట్కి  అఖరి తారీఖు ఒక వారమే ఉంది. ఇప్పుడే చూసుకున్నాను. ఇంకా 50%  పూర్తిచేసానంతే.  అది పూర్తి చేయగలనో లేదో. పూర్తిగా మర్చిపోయాను. Completely lost track of it. ” అన్నాడు అమ్మతో దిగాలుగా బాబ్జీ పెరట్లో కొచ్చి
 “చేయగలవు. అవుతే అవుతుంది లేకపోతే లేదు. మొదలు పెట్టు, చూద్దాం. ఏపుట్టలో ఏపాముందో” అంది మాధురి పెరటిలోకి వచ్చిన బాబ్జీతో చిరునవ్వుతో. 
ఒరే బాబ్జీ ఎలాగూ ఇలా వచ్చావు కదా, ఈ అమ్మ చేప్పే రెండు మాటలు నీ రుద్రరూపం దాల్చకుండా వింటావా అని,  బాబ్జీ సరేన్నట్టుగా తలవూపడం గమనించి మాధురి చిన్నగా చెప్పడం మొదలుపెట్టింది.
“అవకాశాలు మన తలుపులు తట్తాయా? బాబ్జీ, మనకి చాలా తక్కువ అవకాశాలు కనిపిస్తాయి.  కానీ అందులోనే మన జీవన ప్రయాణంలో కొన్ని అవకాశాలు చవిచూసేటందుకు కూడా అసలు అనుసరించము. బాబోయ్  దానివెనుక ఏముందోనని  భయపడతాము. దానితో కొన్ని అవకాశపు తలుపులు బిగుసుకుపోతాయి. ఒకొక్కసారి  అవకాశాలు మన తలుపుల వరకు వచ్చినా మన ధోరణిలో వాటిని గుర్తించము కూడా, దానితో అవి ఎప్పటికీ మనకు కాకుండా పోతాయి.
మనము క్రొత్త అవకాశాలు కల్పించుకోవాలంటే మనం క్రొత్త విద్యలైనా నేర్చుకోవాలి లేదా మనము చాలా విశాల హృదయంతో వేరొకరు అవకాశాలను మనకు ఇవ్వగలిగే అర్హత కలిగి వుండాలి, మనము అవకాశాలు కోసం ఎదురు చూసేబదులు మనమే వెళ్దాము వాటిదగ్గరికి. దక్కించుకుందాము అవకాశాలని. అవకాశాలు ప్రతీది చాల పెద్దదే అవ్వాలని లేదు. అదొక అవకాశం మన జ్ఞానం పెంచేటందుకు అయి ఉండచ్చు లేక మన సుఖ సంతోషాలను అనుభవించేందుకు అయి ఉండచ్చు, వేరొకరిని ఇబ్బంది పెట్టకుండా. 
అంతే, నీ అవకాశాలను నువ్వే సృష్టించుకోవాలి. దానికి కావలసింది పట్టుదల దృడనిశ్చయం మంచి మనసంతే. అవకాశాలు వినుయోగించుకుంటూ నీ లక్ష్యంకేసి వెళ్ళుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి నువ్వే సంతోషపడతావు. నా అవకాశాలకు నేనే సృష్టి కర్తననీ. అప్పుడు కలిగే ఆ సంతృప్తే  వేరు, అనూహ్యము, జీవితాంతము నిలిచేది. నీ సంతృప్తి నీకు విశాల హృదయాన్నిస్తుంది. ఈ రకంగా నీ జీవితంలో అవకాశాలు, ఆప్యాయతలు ద్విగుణీకృతమవుతాయి.”
బాబ్జీ అమ్మ మాటలకి దీర్ఘాలోచనలో పడి సావిట్లోకి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు, మాధురి తన పనిలో తను పడుతూ, భగవంతుడా మా అబ్బాయిని చల్లగా కాపాడు తండ్రీయని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తికి నమస్కరిస్తూ వేడుకుంది. 
****
బాబ్జీ రాత్రింపగలు కష్టపడి క్లాసులో నేర్చుకున్న చదువు పునాదితోనూ, తన ఊహలతో తనంతటతాను ఒక రూపమిచ్చి సమయానికి పంపిన ప్రాజక్ట్కులో వినూత్న ప్రతిభకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ వార్తవిన్న బాబ్జీ తన తల్లీతండ్రులతో  పంచుకొంటూ “అమ్మా నువ్వు నాకు ఆ రోజు నాకు అవకాశలు మన తలుపులు తట్టవు. మనమే ఆవకాశాలను దక్కించుకోవాలని గుర్తు చేయకపోతే నేను ఈ ప్రోజక్ట్ గురించి మర్చిపోయేవాడినేమో! Thank you అమ్మా!” అంటు బాబ్జీ సంతోషముగా ముందుకు సాగిపోయాడు.
*** 

7 comments:

  1. లలిత గారు ఊహించని అవకాశాలు కధ చదివాను.కన్న కొడుకును సక్రమార్గంలో పెట్టడానికి కన్నతల్లి పడిన మానసికవ్యధను చక్కగా వివరించారు.

    ReplyDelete
  2. చాలా బావుంది అమ్మలు

    ReplyDelete
  3. పిల్లలు చాలా మంది ఇలాగే ఉంటారు . మనం అనవసరంగా వాళ్ళను షంటుతున్నామనుకుంటారు . పెద్దవాళ్ళు వాళ్ళమంచికోసమే చెబుతున్నారని గ్రహించరు, ఇంకా ఈ పిల్లవాడు అమ్మచెప్పబట్టే చేయగలిగానని తెలుసుకున్నాడు . మళ్ళీ వాళ్ళకు పిల్లలు కలిగినప్పుడుగానీ పెద్దల తాపత్రయం తెలియదు . కథ నిజజీవితానికి అద్దం పడుతున్నది , లలితగగారికి అభినందనలు !

    ReplyDelete
  4. ఊహించని అవకాశాలు కథ వాస్తవానికి చాల దగ్గరగా ఉంది , పిల్లలకు తల్లిదండ్రులు ఊరికే వెంటబడుతున్నట్లుగా ఉంటుంది . వారి మంచికోసమే చెబుతున్నారని తెలియదు . సమయం వృధాచేసుకుంటే , వచ్చిన అవకాశాలు సకాలంలో వినియోగించుకోకపోతే ఎంత నష్టమో అర్థంకాదు, కథలోయువకుడు దాన్ని చాలా త్వరగా గ్రహించి తల్లికి థాంక్స్ చెప్పడం ఆతల్లి అదృష్టం . మానూలుగా అయితే వాళ్ళకు పిల్లలు కలిగేదాకా తల్లిదండ్రుల తాపత్రయం తెలిసిరాదు . మంచికథ వ్రాసిన లలిత గారికి అభినందనలు

    ReplyDelete
  5. ధన్యవాదాలమ్మ

    ReplyDelete
  6. వాస్తవమైనకథ.నాకూ మా అబ్బాయికీ మధ్య మాటలు ఇలానే ఉండేవి.మంచికధ చదివించినందుకు ధన్యవాదాలు

    ReplyDelete

Pages