శ్రీరామకర్ణామృతం - 28
సిద్ధకవి
డా.బల్లూరి ఉమాదేవి.
తృతీయాశ్వాసం.
61.శ్లో:వైదేహ్యా సమమేత్య రాజ్యమనిశం సౌవర్ణసింహాసనే
మందార ద్రుమ వాటికాంతర మహాశ్రీ చంద్ర కాంతాలయే
కైకేయీ తనయాంజనేయ తనయా సత్సౌమిత్రి సంసేవితం
మేఘశ్యామ ముదార హాస వదనం శ్రీరామ చంద్రం భజే.
భావము:సీతతో రాజ్యమును బొంది మందారవృక్షముల తోటలో గొప్పచంద్రకాంత గృహమందు బంగారు పీఠమందు భరతాంజనేయ లక్ష్మణ శత్రుఘ్నులచే సేవింపబడుచున్నట్టియు మేఘమువలె నల్లనైనట్టియు మంచిమందహాసముతో కూడిన మొగము కలిగిన శ్రీరామచంద్రుని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:స్థిరకల్పస్థల చంద్రకాంత వసతిన్ సింహాసనాసీనుడై
నిరతంబున్ ధరణీసుతా సహితుడై నీలోత్పలశ్యాముడై
దరహాసాననుడై మరుత్సుత సుమిత్రా పుత్ర కైకేయ స
ద్వరపుత్రార్చితుడైన రామజననాథస్వామి ప్రార్థించెదన్.
62.శ్లో:వైదేహ్యా పులకాంకురార్చిత తనువ్యాలంబ హస్తాంబుజో
హస్తే మోదిత రత్నకంకణ రవఃకల్పద్రుమాణంవనే
పాదాభ్యాం మణిపాదుకాద్యుతి కర ప్రేంఖాన్నఖాభ్యాం చర
న్నిష్టాలాప వసుధారసం దిశతు మే శ్రీరామచంద్రోహరిః
భావము: కల్పవృక్షముల తోట యందు సీతయొక్క పులకాంకురములచే నొప్పుచున్న దేహమందు వ్రేలు చున్న హస్తపద్మము గలిగినట్టియు చేతియందు సంతోషకరమైన రత్నకంకణములధ్వని గలిగినట్టియు
మాణిక్య ముల పావుకోళ్ళకు కాంతిని చేయు వ్యాపించు చున్నీ గోళ్ళు గల పాదములచే సంచరించుచున్న శ్రీరామ చంద్ర రూపు డైన విష్ణువు నాకు మంచిమాట లనెడు నమృతరసము నిచ్చు గాక.
తెలుగు అనువాదపద్యము:
మ: తాత మందార వనాంతరంబున లసద్రత్నావళీ పాదుకా
ద్రుంచి జెల్వొందు నఖోజ్జ్వలాంఘ్రియుతుడై యోషాసమాశ్లేష పేరు
జీవిత రోమాంచిత గాత్రుడై యిల్లు నా శ్రీరామ చంద్రుండు మా
కాంతి కారుణ్యతనిచ్చు సత్సరస సల్లాపామృతం బెప్పుడున్.
63.శ్లో:వామాంకస్థిత జానకీకుచయుగే విస్రస్త హస్తాంబుజం
ప్రోజ్జృంభానన పంకజో పరి లసద్విస్పష్ట బింబాధరమ్
సత్తారేణ విశిష్ట కంకణరవే చోంకార శబ్దాశ్రయే
భాంతం శారదచంద్రహాస మనిశం వందేసదా రాఘవమ్.
భావము: ఎడమతొడ యందున్న సీత యొక్క కుచద్వందమందు వ్యాపించిన హస్తపద్మము గలిగినట్టియు ఆవులించుచున్న ముఖపద్మముపై ప్రకాశించుచున్న స్పష్టమగు దొండ పండువంటి యధరము కలిగినట్టియు ఓంకారమునకాధారమైన తారక మంత్రము లతో కూడిన కంకణధ్వనియందు ప్రకాశించుచున్నట్టియు శరత్కాలంలో చంద్రునివంటి నవ్వులు రాము నెల్లప్పుడు నమస్కరించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
ఉ:దాపలి పార్శ్వమందలరు ధాత్రిసుతా కుచకుంభయుగ్మ సం
దీపిత హస్తినకు వినిర్మల శారద చంద్రహాసునిన్
శ్రీపతి విద్రుమాధరు హరిన్ బ్రణవోజ్జ్వల కంకణస్వనున్
క్ష్మాపతి విస్ఫుటాబ్జముఖు జానకి రాము భజింతు నెప్పుడున్.
64.శ్లో:వైదేహీసహితం చలక్ష్మణయుతం కైకేయిపుత్రాన్వితం
సుగ్రీవం చవిభీషణానిలసుతౌ నీలం నలం సాంగదం
విశ్వామిత్ర వసిష్ఠగౌతమ భరద్వాజాది కాన్ మానయన్
రామో మారుతిసేవితః స్మరతు మాం సామ్రాజ్యసింహాసనే.
భావము: సీతతో గూడినవాడై లక్ష్మణునితో గూడినట్టి శత్రుఘ్నునితొ గూడినట్టి భరతుని సుగ్రీవాదులను విశ్వామిత్రాదులను గారవించుచు నాంజనేయునిచేత సేవించబడుచున్న రాముడు సామ్రాజ్యపీఠమందుండి నన్ను తలచుగాక.
తెలుగు అనువాదపద్యము:
మ:జనకాత్మోద్భవ లక్ష్మణాఖ్య యుతుడై సామ్రాజ్య పీఠస్తుడై
దనుజేశార్కజ వాయుజాంగద భరద్వాజాత్రి బ్రహ్మాత్మనం
దన గాంధేయ విరోధిఘాతి భరతుల్ నానాప్రకారంబులన్
దినమున్ గొల్వ జెలంగు రామవిభు నర్థిం గొల్తు నిష్టాప్తికిన్.
65.శ్లో:రామః ప్రాంజలి మగ్రతోనిలసుతం సౌహార్దమాదర్శయాన్
ప్రాంచచ్చామర యుగ్మభాసితకరాన్ పశ్చాత్ స్థలే పార్శ్వయోః
వామాంకేవనిజాం విభీషణముఖాన్ సంభావయన్ బోధయన్
ధీముద్రాకరతత్త్వ రూపమవతాత్ సామ్రాజ్యసింహాసనే.
భావము:ఎదుట దోసిలిగల అంజనేయుని గొడుగు చేతను ఉన్నతమైన వింజామరలు జోటిచేత ప్రకాశించుచున్న హస్తము లు కలవారై వెనుకకు పార్శ్వములయందున్న విభీషణాదులను ,ఎడమతొడపై సీతను గౌరవించు చుట్టూ స్నేహమును చూపుచు జ్నానముద్రగల పరత్త్వమును బోధించుచు సామ్రాజ్యపీఠమందున్న రాముడు రక్షిం చుగాక.
తెలుగు అనువాదపద్యము:
మ:వరభద్రాసనుడై సతీసహితుడై భ్రాతల్ సితచ్ఛత్ర చాలా
మీరు మున్ పశ్చిమ పార్శ్వ భాగమున బ్రేమన్ దాల్చిన సామీరి ముం
దర కేల్మోడ్ప విభీషణాదులకు బోధన్ దెల్పుచున్ భవ్య సు
స్థిర ముద్దాడారు రూపియగు నా శ్రీరాము సేవించెదన్.
66.శ్లో:పౌగండే హితబాలకైః పరివృతః పూర్ణేందు కాంతాననః
ప్రీత్యాబద్ధ విచిత్ర హేమవసనే సంసక్త కాంచీగుణః
అజాను ప్రవిలంబ బాహుయుగళః శ్యామాంబు భృద్విగ్రహో
భ్రాతృస్వాను చరశ్చరా చరగురుః పాదయాత్ర సదా రాఘవః
భావము: పౌగండ వయసు నందు ఇష్టులైన బాలురతో కూడినవాడై పూర్ణచంద్రుని వంటి మొగము గలిగి నట్టియు సంతోషము చే ధరింప బడిన బంగారు బట్టయందు తగులుకొన్న మొలత్రాడు గలిగి నట్టియు మోకాళ్ళ పర్యంతం వ్రేిలుచున్న బాహు ద్వంద్వము గలిగి నట్టియు నల్లని మేఘము వంటి దేహము కలిగినట్టియు తమ్ములే తన భృత్యులుగ కలిగినట్టియు జంగమ స్థావరములను గురువైన రాముడుఎల్లప్పుడు రక్షించుగాక.
తెలుగు అనువాదపద్యము
మ: పటుపౌగండ వయస్కుడర్భక నిజభ్రాతృవ్యయుక్తుండు సం
త్కటి బద్ధాంచిత హేమవస్త్ర విలసత్కాంచీగుణోల్లాసి వి
స్పుట నీలాంబుద వర్ణవిగ్రహుడు సంపూర్ణేందు వక్త్రుండు దు
ర్ఘట శౌర్యుండు విలాసం బాహుడగు శ్రీరాముండు నాన్ బ్రోవుతన్.
67.శ్లో: వైదేహి రమణీయ వక్తృ వనజ ప్రద్యోత ఖద్యోతనం
కేళి సద్మని రత్న దీప కళికా కాంతే వసంతం హరిమ్
సౌరభ్య ప్రసవ ప్రయుక్త విలసచ్ఛయ్యాంతరే శాయినమ్
శ్రీమంతం రఘువంశ దీపక మణిం శ్రీరామ చంద్రం చంద్రం భజే.
భావము:సీతయొక్క సొగసైన ముఖపద్మమునకు ప్రకాశించుచున్న సూర్యుడైనట్టియు విష్ణురూపుడైనట్టియు పరిమళము గల పుష్పములతో కూడిన పూర్తయ్యేందుకు శయనించినట్టియు శోభ గలిగినట్టియు రఘువంశ మును ప్రకాశింప జేయు రత్నమైన రామచంద్రుని సేవించుచు న్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:స్థిరకేళీ భవనాంతరాంతర వితర్ది ప్రావృతంబైన మా
సుర సౌలభ్యం ప్రసూన తీర్పును నాక్షోణీసుతా వక్త్రతా
మర సాహస్కరుడై రహించు హరి శ్రీమంతున్ గకుత్ స్థాన్వయ
స్ఫురణ రత్నంబగు రామచంద్రు దలతున్ బూర్ణాను కంపానిధిన్.
68.శ్లో: రామో బుద్ధి పయోనిధిర్గుణనిధిర్గత్వా సమం వానరైః
లంకాం ప్రాప్యసకుంభకర్ణదనుజం హిత్వా రణేరావణమ్
తత్రస్థాప్య విభీషణుడు పునరగాత్ సీతాపతిఃపుష్పకం
చారూఢఃపునరాగత స్సభృతవాన్ ధాత్రీమజః పాతు నః.
భావము:రాముడు కట్టబడిన సముద్రము గలవాడై గుణములు సతథానమగుచు వానరులతో గూడి లంకానగరం ము చేరి కుంభకర్ణుని తో రాక్షసులతో గూడిన రావణుని యుద్ధమునందు కొట్టి యా లింక్ యందు విభీషణుని నిలిపి సీతతో గూడినవాడగుచు బుష్పకము నెెక్కితిరిగి వచ్చెను.అట్లు తిరిగి వచ్చినవాడు గుచ్చు భూమిని భరించినట్టి పుట్టుకే నుంచి రాముడు మమ్ము రక్షించుగాక.
తెలుగు అనువాదపద్యము:
మ:బాలముల్ గొల్వగ వార్ధి గట్టి రిపుప్రోల్ స్థాపించి పౌలస్త్య ము
ఖ్యుల మర్ధించి కృపన్ విభీషణునకాయూరేలగా నిచ్చి చె
న్నలరన్ మైథిలి తోడ పుష్పక విమానారూఢుడై వచ్చి ని
ర్మల సాకేతపురాభిషిక్తుడగు రామస్వామి నాన్ బ్రోవుతన్.
69.శ్లో:రత్నోలసజ్జ్వలిత కుండలగండభాగం
కస్తూరికా తిలక శోభిత లోభాగము
కర్ణాటక దీర్ఘనయనం కరుణాకటాక్షం
శ్రీరామచంద్రుడు మహాత్ముని సన్నిధత్తామ్.
భావము:మణులచే ప్రకాశించుచున్న ప్రజ్జ్వలించుచున్న కుండలములు గల గండస్థలములు గలిగినట్టియు గస్తూరి బొట్టు చే ప్రకాశింప చేయబడు నుదురు గలిగినట్టియు చెవులు సమీపమున వరకు పొడవైన నేత్రములు గలిగినట్టియు దయతో గూడిన క్రేగంటి చూపు గలిగినట్టియు రాముని మొగము నాహృదయమందు నెలకొని యుండు గాక.
తెలుగు అనువాదపద్యము:
శా:కస్తూరీ తిలకాననుండు మహితాకర్ణాంత నేత్రుండు దే
వ స్తోత్రాన్ని సరోరుహుండు కరుణాపాంగేక్షణుండంచితా
భ్యస్తోదస్త కళాకలాపుడు మణిప్రస్ఫీత సత్కుండలుం
డస్తోకోజ్జ్వల కీర్తి రాముడు మదీయాత్మన్ ప్రసన్నుండగున్.
70.శ్లో:హేలాభగ్న శశాంక శేఖర ధనుర్భూమండలాఖండల
శ్రేణీమౌళిలసద్వినూత్నమణిభిర్దీప్తాంఘ్రి పంకేరుహః
కల్యాణం జూనయత్వ ఖండవిభవః కల్యాణం లీలోత్సవే
మార్తాండాన్వయ మండనశ్చ భవతాం రామ స్సరామ స్సదా.
భావము: విలాసముచే కొట్టబడిన ఈశ్వర ధనుస్సు కలిగినట్టియు రాజుల పంక్తుల యొక్క కిరీటముతో ప్రకాశించుచున్న కొత్త పనులచే ప్రకాశించుచున్న పాదపద్మములు కలిగినట్టియు గొప్ప వైభవము గలిగినట్టియు సూర్యవంశమున కలంకారమైనట్టియు, సీతతో కూడిన రాముడె ల్లప్పుడును కల్యాణ విలాసోత్సవమందున్నవాడై మీకు శుభమును కలిగించు గాక.
తెలుగు అనువాదపద్యము:
మ: ధరణీపాల కిరీటం రత్న విలసత్పాదాంబుజాతుండు శం
కర కాండాసనఖండనుండు ధరణీకన్యా సమేతుండు భా
స్కర వంశోద్భవ మండనుండు నిజసత్కల్యాణ లీలోత్సవా
కరుడౌ రాముడొసంగు మాకతి దయన్ గల్యాణ మెల్లప్పుడున్.
(సశేషం)
No comments:
Post a Comment