ఙ్ఞానోదయము! - అచ్చంగా తెలుగు

ఙ్ఞానోదయము!

Share This
ఙ్ఞానోదయము!
-కుంతి

గేట్ శబ్దమైనది. ఇంకా నిదురపోకుండా కొడుకు కోసము  ఎదురు చూస్తున్న యశోదమ్మ బెడ్ రూమ్ కిటికీ నుండి తొంగి చూసింది. ప్రేమ్ వచ్చాడు. వెహికిల్ పార్క్ చేస్తున్నాడు. బెడ్ రూమ్  నుండి వచ్చి ,మెయిన్ డొర్ తలుపు తెరిచింది.
ప్రేమ్ లోపలికి వచ్చాడు. సరాసరి తన రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని,వాష్ రూమ్ కు వెళ్ళి ఫ్రెష్ అయి,నిశబ్దముగా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
“నాన్నా!భోజనము చేయవా?” గదిలోకి వెళ్లి అడిగింది.
“లేదమ్మా! ఆకలిగా లేదు. నన్ను పడుకోనీయ్. దయచేసి నీవు తిని పడుకో” అని సమాధానము 
చెప్పి ,మంచము పై వాలిపోయాడు.
అతని తత్వము తెలిసిన యశోదమ్మ రెట్టించలేదు.
డైనింగ్ హాల్లోకి వచ్చింది. ఆమెకు తిన బుద్ది కాలేదు. రెండు అరటి పళ్ళు తిని,అన్నీ సర్ది, తనగదిలోకి వచ్చి మంచము పైన వాలింది.
.............................
“నాన్నా! ప్రేమ్! మ్యారేజ్ బ్యూరో కల్యాణ్ రామ్ గారు రెండు మూడు మంచి సంబంధాలు పంపించారు.అన్నీ బాగానే ఉన్నాయి. అందులో ఒక సంబంధము మరీ బాగుంది.మనలాగే చాలా కింద నుండి పైకి వచ్చిన కుటుం బము. అమ్మాయి నీలాగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నీవు ఒకసారి చూసి ,సెలెక్ట్ చేస్తే ముందుకు వెళ్ళవచ్చు. “ 
సెలవు దినము కావడముతో,  ప్రేమ్  తాపీగా బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా అన్నది యశోదమ్మ.
ప్రేమ్ తినడము ముగించి, తల్లి  కూర్చున్న సోఫా లో వచ్చి కూర్చున్నాడు.
“అమ్మా!     నాన్న చిన్నప్పుడే పోయినా, అయిన వారు ఎవరూ సహాయము చేయకున్నా ,నీవు రెక్కలు ముక్కలు  చేసుకొని ,చాలా  కష్టపడి పెంచావు . ఇపుడు నిన్ను సుఖ పెట్టాల్సిన బాధ్యత నాది. అందుకే తెలిసీ తెలియక ,వాళ్ళూ,వీళ్ళూ చెప్పగా విని యేదో సంబంధాన్ని యెంచుకొని ,ఎవరినో పెల్ళి చెసుకోను. మన యింటికి వచ్చిన అమ్మాయి,నిన్ను సరిగా చూడకపోతే అంతకంటే నాకు ఇంకొక నరకము లేదు. 
అందుకే నేను ఒక పని చేయాలనుకున్నాను. నాకు  అన్ని విధాలా బాగా నచ్చిన అమ్మాయిని, నన్నూ,నిన్నూ బాగా చూసుకోగలదు అనుకున్నఅమ్మాయిని వెతికి,బాగా  అర్ధము చేసుకొని, ఆ పై  ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకున్నాను.
“హు! నీవు చూసేదెప్పుడు?ప్రేమించి,పెళ్ళి చేసుకునేదెప్పుడూ?”
“లేదమ్మా ! ఆ పని జరిగిపోయింది.నీకు ఇన్ని రోజులుగా చెప్పలేదు”
“యేమిటి పెళ్ళికూడానా? ” 
“లేదు!లేదు! విను చెబుతాను!”
యశోదమ్మ కాస్తా కుదుట పడి  ప్రేమ్ కేసిచూసింది.
“శ్రీలత నాలా గే  సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మా ఆఫీసులో నాతో పాటు పని చేస్తుంది. చాలా అందమైనది, చురుకైనది.కొంత కాలముగా ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది’
“ఓహ్! ఎంత మంచి మాట చెప్పావు. ఈ మాట ముందె చెబితే ఈ పేరయ్యల చుట్టూ,బ్యూరోల చుట్టూ తిరగకపోయే దానిని”
“కానీ అమ్మా! ఒకమాట. అమ్మాయిది మనకులము కాదు,మన మతము కూడా కాదు. నన్ను మాత్రము చచ్చేంత ఇష్టపడుతుంది”
“ప్రేమ్! భగవంతుడు నీకు చదువుతోపాటు సంస్కారము,విఙ్ఞతా,సహృదయము ఇచ్చాడు. మన బంధువులు నీ గురించి పొగుడుతుంటే నాకెంతో ఆనందముగా ఉంటుంది. నీ నిర్ణయము ఎప్పటికీ సరైనదనే భావిస్తాను”
“అమ్మా! ఈ రోజు శ్రీలతతో మాట్లాడి,యింటికి తీసుకొని వస్తాను. నీకు పరిచయము చేస్తాను. ఆమెతో మాట్లాడిన తరువాత నా నిర్ణయము సరైనదని ఒప్పుకుంటావు”
“నీవూ,అమ్మాయి మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. చదువూ,సంస్కారము ఉన్న వాళ్ళు. ప్రపంచాన్ని అర్ధము చేసుకున్నావాళ్ళు. కాబట్టి యే సమస్యా ఉండదు.ఇంక అమ్మాయిని చూడవలసిన అవసరము లేదు. మంచి రోజు చూసుకొని నన్నే వాళ్ళ యింటికి తీసుకొని వెళ్ళు.నేనే మాట్లాడతాను”
“ఈ రోజు మా స్నేహితుడు ఒక్ పెద్ద హోటల్ లో పార్టీ ఇస్తున్నాడు.శ్రీలత నేనూ కలిసి వెళుతున్నాము.పార్టీ అయిన తరువాత ఆమెను ఇంటిలో డ్రాప్ చేసే ముందు నీకు ఒకసారి చూపిస్తాను.ఆ తరువాత నీవు అన్నట్లుగా  వాళ్ళ ఇంటికి తీసుకొని వెళతాను”
“అలాగే తీసుకొనిరా.నీకు ఇష్టమైన పాయసము,గారెలు చేసి ఉంచుతాను.అలాగే వస్తూ,వస్తూ మంచి చీర,  పండ్లు తీసుకొనిరా”నవ్వుతూ అన్నది
.............................................................
ఫైవ్ స్టార్ హోటల్. పార్టీ ఆడంబరముగా,రిచ్ గా జరుగుతుంది. అక్కడ కరెన్సీ  భోజనాల రూపములో,మద్యము రూపములో,ఆటల పాటలరూపములో  రూపాంతరము సంతరించుకుంటున్నది.
శ్రీలత  ప్రేమ్  ప్రక్కప్రక్కనే కూర్చున్నారు.    శ్రీలత బ్యాక్ సైడ్ అంతా కనిపించే విధంగా ఉన్న జాకెట్ , ఉల్లిపొరలాంటి  టాన్స్ పెరెంట్  వైట్ సారీ  ధరించింది. 
నడుము అంచున కట్టిన చీర ,ఎపుడు జారిపోతుందో అన్నట్లుగా ఉన్నది. 
జుట్టు విరబోసుకుంది. ముఖానికి దట్టంగా మేకప్  దట్టించింది. 
ఆమె వంటికి కొట్టుకున్నఖరీదైన పర్ ఫ్యూమ్ చుట్టు పక్కలవాళ్ళను  మత్తెక్కిస్తుంది. 
పార్టీలో ఉన్న మగాళ్ళందరూ వయోభేదము లేకుండా ఆమెను తినేసేలా చూస్తున్నారు.ఒకరిద్దరు యువకులు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడాలని,రాసుకొని,పూసుకొని తిరగాలని ప్రయత్నిస్తునారు.
శ్రీలత ప్రేమ్ తో , “ ఈ గెటప్ లో యెలా ఉన్నాను ?” అన్నది
“శ్రీలత ! నిజము చెబుతున్నాను. ఇలా నాచెల్లి కానీ,అక్క కానీ ఉంటే చీదరిస్తూ,చెంప చెళ్లుమనిపించేవాడిని.మరెవరైనా ఉంటే అసహ్యించుకునే వాడిని.”
“ప్రేమ్! నీది చాలా ఓల్డ్ థింకింగ్. చూడు ఈ మేకప్ లో, ఈ అట్టైర్ లో ఎంత గార్జియస్ గా ఉన్నానో?అందరూ నన్ను ఎంత ఇదిగా చూస్తున్నారో చూడు!”
“చూడు శ్రీలు! నీవు ఇలా కాకుండా సింపుల్ గా ,డిగ్నిఫైడ్ గా ఉంటే ఇంకా అందముగా ఉంటావు. దేవుడు నీకు సహజమైన సౌందర్యాన్ని ఇచ్చాడు. .చూసే వాళ్ళు నిన్ను ఆబగా,కాముకంగా చూస్తున్నారు తప్ప గౌరవభావముతో కాదు.ఒక్క మగాడిగా ఇతరమగాళ్ళ చూపుల్లో యేముంటుందో  నేను ఈజీగా చెప్పగలను.” 
“ఇట్ ఈజ్ దేయిర్ కల్చర్.దేయిర్ ప్రాబ్లమ్. ఒకరి కోసము నేను అన్నింటిని బిగించుకొని వంటింటికి పరిమితమయ్యే ఆడదానిలా ఉండలేను”
“శ్రీలూ! మనిషి ఉన్నతంగా ఆలోచించాలి.సాధారణంగా జీవించాలి. నాగరికతతో పాటూ సంస్కృతి విలువలకు ప్ర్రాధాన్యమివ్వాలి. స్త్రీలను చూస్తే తల వంచి నమస్కరించాలి అనుకోవాలి తప్ప  తలుపు చాటుకు లాక్కొని వెళ్ళి యేదైనా చేయాలి అనిపించకూదదు”
“మనము మన కోసము బ్రతకాలి. ఒకరికోసము కాదు. అయినా నేను ఇలా డ్రెస్ చేసుకున్నంత మాత్రాన చెడ్డ దాన్ని అయిపోతానా?”
“వెహికిల్ డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ మనము పాటించినా ,ఎదుటి వాడు పాటించకపోతే యాక్సిడెంట్ అవుతుంది.మనము తప్పు చేయకున్నా శిక్ష మాత్రము తప్పదు. నీ డ్రెస్సింగ్ ఎదుటి వాడిని  టెంప్ట్ చేసి వాడిని తప్పు చేసేలా ఉసికొలిపితే, తప్పు నీది అయినా కాకున్నా శిక్ష అనుభవించాల్సి రావచ్చు”
“చిన్న దానికి చాలా దూరము ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకొని,నా బుర్రను పాడు చేస్తున్నావు”
“అరె! మీరు ఇక్కడ ఉన్నారా! అక్కడ డిన్నర్ స్టార్ట్ అయింది .రండి వేళదాము” అంటూ  అక్కడికి వచ్చిన రమ్య,  పిలవడముతో వాళ్లు అక్కడ నుండి  కదిలారు.
............
శ్రీలత, ప్రేమ్ డిన్నర్  సెక్షన్ వైపు నడిచారు.  ఇద్దరు తమ ప్లేట్లలో ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేసుకొని వచ్చి కూర్చున్నారు. తినడము ప్రారంభించారు. ఇంతలో రమ్య వచ్చింది. 
“ శ్రీలు,అక్కడ నాన్ వెజ్ ఉంది చూసావా?” అన్నది రమ్య .
 శ్రీలత తన ప్లేట్ ను డస్ట్ బిన్ లో వేసి, నాన్ వేజ్ సెక్షన్ కి వెళ్ళి,చికన్,మటన్,సీ ఫుడ్స్ వడ్డించుకొని   , అక్కడే నాన్  వెజ్ తింటున్న  మిత్రుల దగ్గర కూర్చొని బోజనము చేసింది.
ప్రేమ్ పప్పన్నముతో భోజనము పూర్తిచేసి,మిత్రులతో మాట్లాడుతూ ఒక పక్కన కూర్చున్నాడు.
శ్రీలత అక్కడికి రావడముతో,ఇద్దరూ ఒక పక్కకు వెళ్ళి కూర్చున్నారు. 
“సారీ ప్రేమ్! ఐ లవ్ సీ ఫుడ్స్ అంద్ నాన్ వెజ్. అది చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను. బీరకాయ,తోటకూర అంటేబోర్”
“నో ప్రాబ్లమ్! స్వీ ట్ తెస్తాను కలిసి తిందాము. “
“నో  ప్రేమ్! నాకు స్వీట్ అంటే ఇష్టము లేదు. నీకు ఇష్టము ఉంటే తెచ్చుకొని తిను. నీకు ఇంకొక విషయము చెప్పాలి. నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో,నేను అంతగానే ప్రేమిస్తున్నాను. కాని అంత మాత్రాన నీ అభిరుచులు నాకోసము ,నా అభిరుచులు నీ కోసము మార్చుకోవలసిన అవసరము లేదు. నీవు స్వీట్ తిను.నేను లాబ్ స్టర్ తింటాను. అంతే కాని నీ కోసము నేను స్వీట్ తిన లేను. నా కోసము నీవు లాబ్ స్టర్ తినవద్దు. నాకు అలాంటి సెంటిమెంటల్ సాక్రిఫైసెస్ అంటే నచ్చదు”
“ఎవరి వ్యక్తిత్వాన్ని  వారు కాపాడుకుంటూ ,ఇతరుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలని నేను కూడా భావిస్తాను.దానితో పాటు మనతో పాటు వంద సంవత్సరాలు కలిసి కాపురము చేసే వారు పాటకు తగిన రాగములా ఉండాలనుకుంటాను”
“ఓహ్! మనము మాటల్లో పడిపోయాము.మనము నాలుగు గంటల కల్లా  ఒకచోటికి వెళ్ళాలి.నీవు కూడా నాతో తోడుగా రావాలి” అంటూ శ్రీలత అనడముతో , వారిద్దరు  మిత్రులకు వీడుకోలు చెప్పి అక్కడి నుండి బయలుదేరారు.
.............................
శ్రీలత ,ప్రేమ్లు సరాసరి కొద్ది సేపట్లో  “హెల్ప్ లైన్ ”వృద్ధాశ్రమానికి వెళ్ళారు. 
శ్రీలత అక్కడికి వచ్చిందని తెలియగానే అక్కడికి ఒక వృద్ధ జంట వచ్చింది.  
“ ప్రేమ్ !  వీరు మా తాతాయ్య ,నానమ్మలు” అంటూ శ్రీలత పరిచయము చేసింది.
వారిరువురికి తాను తెచ్చిన బటలు,పండ్లు,మందులు ఇచ్చింది, ఆ తరువాత  ఆశ్రమ సెక్రెటరి దగ్గరికి వెళ్ళి, నెలనెలా వారికై చెల్లించాల్సిన డబ్బులు చెల్లించింది.
ఈ సమయములో ప్రేమ్  వారి దగ్గర కూర్చొని మాట్లాడసాగాడు.
 శ్రీలత అక్కడికి వచ్చి, “తాతయ్య,నానమ్మ! మీకు కావలసినవి తెచ్చాను. ఆశ్రమము వారికి డబ్బులు కట్టాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను”అన్నది. 
వాళ్ళు కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ,ఆమెను దగ్గరికి తీసుకొని యేదో మాట్లాడబోయారు.
"తాతయ్య,నానమ్మ!నాకు చాలా పనులున్నాయి.మళ్ళీ వచ్చినపుడు తీరికగా మాట్లాడతాను,పద వెళదాము ప్రేమ్” అంటూ ప్రేమ్ ను తీసుకొని అశ్రమము బయటికి నడువబోయింది.
వాళ్ళు దిగులుగా,దుఃఖ వదనముతో చూస్తుంటే , ప్రేమ్ కు ఒక్కసారిగా గుండె    ద్రవించింది.
“పోనీ కాసేపు ఇక్కడే ఉందాము.కాసేపు వాళ్ళతో గడుపుదాము”అన్నాడు.
“వాళ్ళతో ఎంత సేపు ఉన్నా,వాళ్ళకు తృప్తి ఉండదు.నాకు అక్కడ చాలా పనులున్నాయి.పద వెళదాము అన్నది’ 
ఇద్దరూ నిశ్శబ్దముగా బయటికి నడిచారు. అక్కడి నుండి  బయలుదేరారు. 
కొద్ది దూరము వెళ్ళిన తరువాత, ప్రేమ్ బండిని ఆపాడు. 
రోడ్ ప్రక్కన నీడనిచ్చే చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు.శ్రీలత కూడ అక్కడికి వచ్చింది.
“ప్రేమ్ ! ఏమిటి ఇక్కడ ఆపావు? ఇంటికి వెళ్ళాలని లేదా? రోడ్డు నిర్మానుష్యముగా ఉన్నదని యేదైనా రోమాంటిక్ థాట్ వచ్చిందా?”
“మీ నానమ్మా,తాతయ్యల గురించి చెప్పు” సూటిగా అడిగాడు.
“మా తాతయ్య,నానమ్మలు కాస్తా బోరింగ్.వాళ్ళ ఆలోచనలు, పద్ధతులు ఆంతా ఓల్ద్. 
ఇలా ఉండాలి,అలా ఉండాలి,అది చేయ వద్దు,ఇది చేయ వద్దు,ఇది తప్పు,అది తప్పు అనేవారు.
అన్నీ రూల్స్,రెగ్యులేషన్స్. కస్టమ్స్ గురించి కల్చర్ గురించి లెక్చర్స్. ఇవన్నీ మా అమ్మకు నచ్చదు.   ఆమె   స్వేచ్చా జీవి.ఫ్రీ  స్టైల్ ఇష్ట పడుతుంది.దానితో ఇంటిలో చాలా రోజులు గొడవలు. యుద్ధాలు. 
ఇదంతా భరించ లేక మా అమ్మ, “ ఇంటిలో వాళ్లైనా ఉండాలి లేదా  నేనైనా ఉండాలి” అని పట్టు పట్టింది.
దానితో మా  నాన్న వీళ్ళను ఆశ్రమములో చేర్చాడు.  
నెలనెలా  నేను కానీ, మా నాన్న కానీ  వచ్చి ఆశ్రమములో దబ్బులు కట్టి ,కావలసినవి ఇచ్చి పోతుంటాము”
“శ్రీలూ! సేచ్చ మంచిదే.కానీ కుటుంబములో ఉన్న అనుబంధాలను,ఆత్మీయతలను,బాధ్యతలను అది మింగి వేయవద్దు. స్వేచ్చ ప్రొగ్రేసీవ్ వైపు,హ్యుమానిటీ వైపు తీసుకు వెళ్ళాలి.కాని డిస్ట్రక్షన్ వైపు కాదనుకుంటా”
“ఇదిగో,  వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడే వారు. అందుకే మా అమ్మకు తిక్కరేగి వాళ్ళను ఇంటి నుండి తరిమి కొట్టింది. మా నాన్న కొంచెము మంచి వాడు కాబట్టి ఆశ్రమములో చేర్పించాడు. వాళ్ళ మంచీ చెడు చూస్తున్నాడు”
“వాళ్లు అలా దీనంగా నీ చేతులు పట్టుకొని ,”కాసేపు ఉండమ్మా” అంటుంటే నీకేమి అనిపించలేదా?”
”అనిపించలేదు.అనిపించదు కూడా.ఎందుకంటె హాయిగా ఆడుతూ,పాడూతూ గడపాల్సిన జీవితమంతా ఇలాంటి వాటీతో  ముడి పెట్టుకుంటే మనకు దక్కేది చింతలూ,చికాకులు,రోగాలు,మందులు,హాస్పిటళ్ళు,చాకిర్లు”
“మనము పెద్ద వాళ్లమవుతాము, వయసుడిగిన తరువాత మనకు ఆ గతి పట్టవచ్చు కదా”
“రేపు రాబోయే కష్టాలను తలుచుకొని ఈ రోజు ఉన్న సుఖ శాంతులను పోగొట్టుకుంటామా?  నాకు తెలిసినది ఒకటే. వయసును,యౌవనాన్ని వృధా చేయరాదు.మనకు యేది సంతోషమనిపిస్తే అది చేయాలి. దానికి అడ్డుగా ఉన్న దేనిని లెక్క చేయరాదు.జీవితములో ఉన్న దిగుళ్లను, సవాళ్లను,సమస్యలను గురించి ఆలోచిస్తూ కూర్చేంటే వీటన్నింటిని అధిగమించినా ,అనుభవించడానికి.జీవితము మిగలదు”అంటూ ప్రేమ్  వైపు చూసింది. 
ప్రేమ్ వింటున్నాడు. శ్రీ లత మళ్ళీ చెప్పడము ప్రారంభించినది.
“అయినా ప్రేమించుకున్న వాళ్ళు హాయిగా  స్వర్గ లోకాలు యేలాలి. 
ఇల్లు,కుటుంబము, అతిధులు,రాకపోకలు,అచ్చట్లు,ముచ్చట్లు,పెట్టుపోతలు,బంధువులు,ముసలివాళ్ల అనారోగ్యాలు.... ఇవన్నీ  క్వైట్ బోర్. 
అందుకే మా అమ్మ మా నాన్నమ్మను,తాతయ్యను,ఇంటి నుండి పంపించమని మా నాన్న కు చెప్పినపుడు నేను మా అమ్మకు సపోర్ట్ చేసాను. మా అమ్మ కానీ ,నేను కానీ చెడ్డ వాళ్ళము కాదు. వాళ్ళకి నెలనెలా అన్నీ అందేలా చూస్తున్నాము. నీవు కూడా వర్రీ కావద్దు.
 మన పెళ్ళి కాగానే  మీ అమ్మను కూడా ఇక్కడే చేర్చుదాము. ఆశ్రమ సెక్రెటరీ మా నాన్న కు మిత్రుడు. చీపర్ రేట్ లో అన్నీ యేర్పాట్లు చేస్తాడు”
అంతా శ్రద్ధగా విన్న ప్రేమ్ ఆమె వంక చూస్తూ,చెప్పడము ప్రారంబించాడు
“శ్రీలత! ఈ రెండు నెలల కాలములో, నేను నిన్ను గాఢంగా ప్రేమించాను.నీవు లేని జీవితాన్ని ఊహించుకోలేని పరిస్థితికి వచ్చాను. నీ వలపు మాయలో పడీ , లోతుగా యేనాడు నిన్ను అధ్యయనము చేయలేకపోయాను.నచ్చిన అమ్మాయిని అర్ధము చేసుకున్నాక ప్రేమించాలనుకున్నాను. కాని ప్రేమించిన  తరువాత అర్ధము చేసుకుంటున్నాను. ఇది బహుశా నేను చేసిన పెద్ద తప్పు.
ఈ రోజు నీమాటలు,   ఆలోచనలు నాలో ఙ్ఞానోదయాన్ని కలిగించాయి. 
నా మనసుకు పట్టిన అఙ్ఞానపు మబ్బులు తిగిపోయాయి. మత్తు వదిలింది. నాకు చాలా అనందంగా ఉంది” అంటూ శ్రీలత వైపు చూసాడు.
శ్రీలత క్యాషువల్ గా ఉంది. మళ్ళీ మాట్లడటము మొదలు పెట్టాడు.
“ప్రేమించుకున్నంత కాలము ఎదుటి వారి మాటలు,చేష్టలు ఆహ్లాదకరంగా ఉంటాయి .
పెళ్ళి అయిన తరువాత ప్రేమ మత్తు వదిలి జీవితము తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటీ బయట 
పడుతుంటే ,తాము గడిపిన ప్రేమజీవితానికి,ప్రస్తుతము గడుపుతున్న వైవాహిక జీవితానికి తేడాలు వస్తుంటే అక్కడే చిక్కులు వస్తాయి. అపుడు ప్రేమ మత్తు దిగిపోయి అంతకు ముందు కనిపించిన ప్రతి అందమైన అంశము ఇపుడు  వికారంగా,భరించరానిదిగా కనిపిస్తుంది.
శ్రీలూ! నేను నైతిక విలువలను,సభ్యతా సంస్కారాలను గౌరవిస్తాను. నాది ఓల్డ్ ధింకింగ్,నేను బీసీ మనిషిని.

అలాగే నీవు ఒక విషయము  తెలుసుకోవాలి. ప్రేమ మన యిద్దరికీ సంబంధించినది. కాని వివాహము రెండు కుటుంబాలను కలిపేది,గృహస్థాశ్రమానికి పట్టుకొమ్మ. సామాజిక అవసరము. 
సమాజము కోసము,కుటుంబము కోసము,పుట్టబోయే బిడ్దలకోసము పెళ్ళి చేసుకున్న వాళ్ళు చాలా త్యాగాలు చేయాలి. అది చేయలేని వాళ్ళు సుఖంగా ఉండవచ్చు. కాని వాళ్ళ వల్ల కుటుంబ వ్యవస్థకు  ఒరిగేది మాత్రము యేదీలేదు.” 
విషయము కాస్తా గంభీరముగా అనిపించడముతో శ్రీలత సీరియస్ గా ,గంభీరముగా మారింది. 
ముఖములో మార్పులు రాసాగాయి.
అది గమనించిన ప్రేమ్,మళ్ళీ మాట్లాదుతూ, “ శీలత! నేను నీ కోసము,నీ ప్రేమ కోసము నా ఆహారపుటలవాట్లను ,ఆచారవ్యవహారాలను మార్చుకుంటాను.నీ కట్టు బొట్టును, నీ విచ్చలవిడితనాన్ని ,అదే నీ భాషలో చెప్పాలంటే నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను.  
 నీకోసము యే ధర్మాన్నైనా స్వీకరిస్తాను. అభ్యుదయము వైపు నడిపించేంత   వరకు  నీ స్వేచ్చను స్వాగతిస్తాను.
 కానీ రెండు మూడు నెలల ప్రేమ కోసము జీవిత కాలము ప్రేమించి పూజించాల్సిన ప్రేమ మూర్తి అయిన మా అమ్మను మాత్రము  వదులుకోలేను,
కుటుంబాలను విచ్చిన్నము చేసేది,కుటుంబ శ్రేయస్సును కోరనిది అది యెంత గొప్ప ప్రేమైనా , ప్రేమించే అమ్మాయి ఎంత అందగత్తె అయినా ,సంపదా ,చదువు కలిగినదైనా  నాకు వద్దు. 
దేవుని దయ వల్ల  ఈ రెండు నెలలు , నీవు ఎంత అడ్వాన్స్ అయినా నేను హద్దుల్లోనే ఉన్నాను.  ఈ దశలో నీ ప్రేమను  వదిలి వేస్తున్నందుకు నేను బాధ కాని సిగ్గు కాని పడటము లేదు. అయినా మర్యాదా మన్నన కలిగిన వాడిని కాబట్టి నన్ను క్షమించుమని అడుగుతున్నాను. ఈ అఫైర్ ను ఇంతటితో ముగిద్దాము.
నీ అభిప్రాయాలకు విలువనిస్తూ,నిన్ను నిన్నుగా ప్రేమించే వారు దొరికితే వాళ్ళను పెళ్లి చేసుకో .చీకటి పడుతుంది. పద మీ ఇంటి దగ్గర దిగబెడతాను”అన్నాడు బండిని స్టార్ట్ చేస్తూ.
శ్రీలత యేదో చెప్పబోయింది.  ప్రేమ్ సమాధానమీయ లేదు.
*** 
యశోదమ్మ ఉదయమే లేచి ,పూజాదికాలు ముగించుకొని ,హాలులో కూర్చున్నది. ప్రేమ్ వంటింటి లోకి వెళ్ళి  కాఫీ కలిపి ,రెండుకప్పుల్లో పోసుకొని తల్లికి ఒకటి తెచ్చి ఇచ్చి,తాను ఒకటి తెచ్చుకున్నాడు.
“యేరా ప్రేమ్! నిన్న  నాకు యేమిటేమిటో  చెప్పావు. రాత్రి వచ్చి నిశ్శబ్దముగా పడుకున్నావు.మీరు వస్తారని పాయసము ,గారెలు చేసాను.ప్రొద్దున  చెత్త బుట్టలో వేసాను.
“ప్రేమ గట్టిగా నవ్వుతూ, “ అంతా నిజమనుకున్నావా? అంతా తమాషాగా కల్పించి చెప్పాను. లేకుంటే నేనేమిటి? ప్రేమించడమేమిటి? నీవు నీకు బాగా నచ్చిన  యే సంబంధమైనా ఖాయము చేయి. నేను తాళికడతాను” అంటూ తనగొంతులో వస్తున్న జీరను ఆపుకుంటూ.కళ్ళల్లో రాబోతున్న కన్నీటి బిందువులను ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
***

No comments:

Post a Comment

Pages