కిసుక్కున
నవ్వండి!
(పాత్రలు
మనవే( కావచ్చు), అందుకే పేర్లు పెట్టలేదోచ్)
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
"
పెళ్లికి ముందు మీ వాళ్లు నీకు వంటరాదంటే ఫర్వాలేదనుకున్నా, కాని మరీ ఉగాది పచ్చడి చేయడం రాదంటే ఎలా సుజీ"
*****
"ఉగాది
నాడు తెలిసినవాళ్ల ఇళ్ళకి వెళ్లకూడదంటే విన్నారు కాదు. ఇప్పుడు చూడండి, పొద్దుట్నుంచి అందరిళ్లలో ఉగాది పచ్చడి తిని కడుపు కదిలిందని ఎలా బాధ పడుతున్నారో"
*****
"నా
రాశి ఫలాల్లో రాజయోగం పూజ్యం, అవమానం అధికం అని ఉంది. అంటే ఈ
సంవత్సరం కూడా నా మీద మా ఆవిడ దాష్టికం ఏ మాత్రం తగ్గే సూచన లేదన్నమాట!"
*****
స్పేష్
షిప్ దగ్గర వ్యోమగామి అయిన భార్యకు, భర్త సెండాఫ్ చెబుతూ-
"నీ
పిచ్చిగాని చంద్రమండలం మీద ఎవరుంటారని ఉగాది పచ్చడి తీసుకెళుతున్నావు"
*****
"శాస్త్రార్థం
చెంచాతో తీసుకోవలసిన దాన్ని, ఆబగా చెంబుతో తాగితే అలాగే ఇబ్బందిగా
ఉంటుంది మరి"
*****
"రాజీ, తొందరగా ఇంటికి తాళం వేయి, అలా బయటకు వెళ్లొద్దాం. మీ
కవితమ్ముడు భుజాన కవితల సంచీతో మనింటికొస్తున్మట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది"
*****
No comments:
Post a Comment