శ్రీరామకర్ణామృతం -29 - అచ్చంగా తెలుగు

శ్రీరామకర్ణామృతం -29

Share This
శ్రీరామకర్ణామృతం - 28
 సిద్ధకవి
                                                                            డా.బల్లూరి ఉమాదేవి. 


తృతీయాశ్వాసం.

71.శ్లో: విద్యుత్ స్ఫుర మకరకుండల  దీప్తి చారు
        గండ స్థలం మణి కిరీట విరాజ మానం
        పీతాంబరం జలద నీల ముదార కాంతిం
        శ్రీ రామచంద్ర మనిశం కలయామి చిత్తే

భావము: మెరుపువలె ప్రకాశించుచున్న మకరా కృతి గల కుండలములచే ప్రకాశించుచున్న సుందర గండ స్థలములు కలిగినట్టియు రత్న కిరీటముచే ప్రకాశించునట్టియు పచ్చని బట్ట కల్గినట్టియు మేఘమువలె నల్లనైనట్టియు గొప్పకాంతి గల  రాముని ఎల్లప్పుడు చిత్తమందు తలచుచున్నాను..

తెలుగు అనువాదపద్యము:
మ:పర  విద్యుద్య్దుతి రత్న కుండల విభాస్వ ద్గండభాగున్ నాతో
      ధర  నీలాభ్రు మణీధగధ్ధగిత సత్కార్యాలు కోటీరు మా
      స్కర చామీకర విస్తృతాంబరు ముని స్తవ్యున్ ధరాపుత్రికా
      వారు శ్రీ రాము నిరంతరంబు మనసా వాంఛను విలోకింపుమా.

72.శ్లో: కరతల ధృతి చాపం  కాలమేఘస్వరూపం 
సరసిజదళ నేత్రం చారుహాసం సుగాత్రం
విచినుత వనవాసం విక్రమోదగ్ర వేషం
ప్రణమత రఘు నాదం జానకి ప్రాణనాథమ్.

భావము: హస్తమందు ధరించబడి ధనుస్సు కలిగినట్టియు నల్లని మేఘము వంటి రూపం కలిగినట్టియు పద్మ దళముల వంటి కన్నులు కలిగినట్టియు సుందరమగు నవ్వు కలిగినట్టియు మంచి దేహం కలిగినట్టియు వనమందు నివాసం కలిగినట్టియు పరాక్రమముచే నున్న తమగు వేషము గల సీతా ప్రాణనాథుడైన రాముని నమస్కరింపుడు..

తెలుగు అనువాదపద్యము:
మ: ఘన కాలాంబుద సన్నిభాంగునకు భూ కన్యామణీ ప్రాణ నా
థునకున్ సార‌సపత్ర నేత్రములకు సద్గోస్సారికిన్ జారు హా
సునకున్ గార్ముఖపాణికిన్ బ్రాకెట్ తేజోరాశికిన్ శౌర్యం  రా
మునకు నుంచి  వనేచరునకే నుత్కంఠతో మ్రొక్కెదన్.

73.శ్లో: యః పృథ్వీభర వారణాసి దివిజైస్సఃప్రార్థితశ్చిన్మయః
సం జాతికి పృథివీ తలే రవికులే మాయా మానుష్యొవ్యయః
నిశ్చితార్థం సీతా రాక్షసః పునరగాద్ బ్రహ్మత్వ మాద్యం స్థిరాం
కీర్తిం పాపహరాం విధాయ జగతాం తం జానకీశం భజే.

భావము: జ్నానరూపుడైన ఏ రాముడు భూభారము మాన్పుటకు దేవతలచే ప్రార్థింప బడిన వాడై భూప్రదేశమందు సూర్య వంశమందు మాయా మనుష్య రూపుడై పుట్టిన వాడగుచు నాశ రహితుడైన వాడగుచు రాష్ట్రము లేకుండా నట్టుగా సంహరించ బడిన రాక్షసులు గల వాడగుచు జగత్తులకు  పాపమును హరించునట్టి స్థిరమైన కీర్తిని చేసి మొదటిదైన బ్రహ్మ స్వరూపమును పొందెనో అట్టి సీతాపతి యగు రాముని సేవించు చున్నాను.

తెలుగు అనువాదపద్యము:
మ: అవనీ భార నివారణార్థము నమర్త్యశ్రేణి ప్రార్థింపగా
      రవి వంశంబున మర్త్య రూపం తనుడై రాక్షస్సులన్  ద్రుంచి త్రై
      భువన వ్యాపయశస్కుడై నిజపదంబున్ చేరి యవ్యక్తుడై
      శివుడై యక్షరుడై యచింత్యుడగు నా సీతేశు ప్రార్థించెదన్..

74.శ్లో: విశ్వోద్భవ స్థితి లయాదిషు హేతు  మేకం  
మాయాశ్రయం విగత మాయా మచింత్య మూర్తిమ్
ఆనంద సాంద్ర మమలం నిజ బోధ రూపం
సీతాపతిం విదిత తత్వ మహం నమామి.

భావము: ప్రపంచం యొక్క పుట్టువు ఉనికి సంహరించుట మొదలగు వాని యందు కారణమైనట్టియు నద్వితీయుడైనట్టియు మాకు నాధారమైనట్టియు పోయిన మాయ కలిగినట్టియు నూహించ శక్యము గాని స్వరూపము కలిగినట్టియు ఆనందముచే  దట్టమైనట్టియు  నిర్మలుడైనట్టియు స్వకీయ జ్ఞాన స్వరూపుడైనట్టియు తెలియబడిన తత్త్వము గల రాముని నేను నమస్కరించు ఉన్నాను..

తెలుగు అనువాదపద్యము:
మ:భువనోత్పత్తి సమృద్ధి నాశనకరున్ బోధస్వరుపున్ బ్రధా
నవిహీనున్ విభాగాలున్నాయి బ్రధానయుతు నానందున్ ధరా పుత్రికా
ధవునద్వంద్వు నచింత్యు దత్త్వవిదు భక్తత్రాణ పారీణు మా
నవనాథార్చితు రామచంద్రుని జగన్నాథుని బ్రశంసించెదన్.

75.శ్లో: శ్రీ రామం నవరత్న కుండల ధరం శ్రీరామ రక్షామణిం
శ్రీ రామం చ సహస్ర భాను సదృశం శ్రీరామ చంద్రోదయం
శ్రీ రామం శ్రుతకీర్తి మాకరమహం శ్రీరామ ముక్తి ప్రదం
శ్రీ రామం రఘునందనం భయ హరం శ్రీరామ చంద్రం భజే.

భావము: నూతన రత్నకుండలములు కలిగినట్టియు వేయి సూర్యుల తో తుల్యుడైనట్టియు ప్రసిద్ధ కీర్తి లక్ష్మికి స్థాన మైనట్టియు ముక్తి నిచ్చునట్టియు రఘువంశస్థులను సంతోషింప చేయునట్టియు  శ్రీరామచంద్రుని సేవించుచున్నాను..

తెలుగు అనువాదపద్యము:
శా: శ్రీ రామం నవరత్న కుండల ధరం శ్రీరామ రక్షామణీ 
శ్రీరాముని శతకోటి భాను సదృశున్  శ్రీరామ చంద్రాననున్ 
శ్రీరామున్ శ్రుతకీర్తి మాటలు బరువున్న  శ్రీరామ ముక్తి ప్రదున్
శ్రీరామున్ రఘునందనున్ భయహరున్ శ్రీ రాము సేవించెదన్.

76.శ్లో: రామచంద్ర చరణారవిందయో రంతరంగచర భృంగ  లీలయా
తంత్ర బంతి రసాశ్చతుర్విధా మాకరంద రసం యేవో పంకజే.

భావము: ఓ మనసా శ్రీరామ పాద పద్మముల యందు తుమ్మెదరీతి సంచరించుమా.ఆపాద పద్మముల యందు చతుర్విధ పురుషార్థ రూపములైన రసములు కలవు పద్మ మందు మకరందరసమొక్కటియే కలదు..

తెలుగు అనువాదపద్యము:
ఉ: శ్రీ రఘురామ పాదసరసీజములందలి మాడ్కి కాంక్ష ఫేం
      పారగ భక్తి యుక్తి ధన్యుడు జరింపుచునుండు చిత్తమా
     యారయగ చతుర్విధ ఫలాప్తి  కరంబులు సంతతము పం
     కేరుహ పాళీ యందు పరికింప  రసం బొకటై  ప్రవర్తిలున్.

77.శ్లో: రామం పాతు సదైవ మామరి భయాద్ సదా బావయే
రామేణైవ హృతం మహత్తర తమో రామాయ నిత్యం నమః
రామాన్నాస్తి పరం పదం సులలిత రామస్య పాదౌ భజే
రామే ప్రీతి రచంచలాస్తు మమ హేశ్రీరామ మాం పాలయ

భావము: రాముడే నన్నెల్లప్పుడు  శత్రు భయము వలన రక్షించుగాక .రామునెల్లపుడు  ధ్యానించుచున్నాను. రాముని చేత గొప్ప యజ్ఞానం హరింపబడి నది . రాముని కొరకెల్లప్పుడు నమస్కారం .రామునికంటే వేరు గమ్యస్థానం లేదు. సుందరములైన రాముని పాదములను సేవించుచున్నాను రామునియందు నాకు నిశ్చలమైన భక్తి యగుగాక . ఓ రామా నన్నేలుము.ఈ శ్లోకమునందు రామ శబ్దమునకు 8 విభక్తులు చెప్పబడినది

తెలుగు అనువాదపద్యము:
ఉ: రాముడు ప్రోగు శత్రు నికరంబు లచే భయమందకుండ శ్రీ
రాముని సన్నుతింతు రఘురాముని చేలయమందు పాపముల్  
రామున కేను మ్రొక్కెదను  రామునికంటే పరంబు లేదు శ్రీ 
రామున కేను దాసుడను రామునిపై గురి నిల్పి యుండెదన్

78.శ్లో: రామ మిందీవర శ్యామం రాజీవాయత లోచనం j
           జ్యాఘోష నిర్జితా రాతిం  జానకీ రమణం భజే.

భావము: నల్ల కలువల వలె నల్ల నైనట్టి యు పద్మము వలె విస్తారమైన నేత్రములు కలిగినట్టి యు నారి యొక్క ధ్వని చేత జయించ బడిన శత్రువులు గలిగి నట్టియు సీతకు భర్త యైనట్టి శ్రీరాముని సేవించు చున్నాను.

తెలుగు అనువాదపద్యము:
మ: ఘననీలోత్పల పత్రగాత్రు విలసత్కంజాతనేత్రున్ ధరా
     తనయా ముఖ్య కళత్రు  గార్ముక మహాధ్వానాప హృద్వైరి గాం
     చన చేలున్ గరుణాలవాలు వినుతక్ష్మాపాలు సద్భక్త పా
     వనసంశీలు యశోవిశాలుని రఘుస్వామిన్ బ్రశంసించెదన్.

79.శ్లో:నానా దివ్యాస్త్ర తేజస్స్ఫురదమితభుజః శత్రుసంహారధీరః
కౌటిల్యోద్యోతమాన భ్రుకుటియుత ముఖం ధారయన్నంబుదాభః
తూణీర ప్రోత్థవేగోల్లసిత శరవరం తాడయిత్వా దశాస్యం
వీరశ్రీబంధురాంగస్త్రిదశపతినుతః పాతుమాం వీరరామః.

భావము: బహువిధములైన దివ్యాస్త్రముల తేజస్సుచేత ప్రకాశించుచున్న గొప్ప భుజములు కలిగినట్టియు శత్రువులను సంహరించుట యందు ధైర్యవంతుడైనట్టియు  వంపు చేత ప్రకాశించుచున్న భ్రూభంగముతో  కూడిన ముఖమును ధరించినట్టియు మేఘ శోభ కల్గినట్టియు నంబుల పొది నుండి లేచిన వేగము చేత ప్రకాశించుచున్న బాణ శ్రేష్ఠములు గల రావణుని గొట్టి వీరలక్ష్మి చే మనోహరమైన శరీరము కలిగినట్టియు ఇంద్రునిచే స్తోత్రం చేయబడిన వీరుడైన రాముడు నన్ను రక్షించుగాక.

తెలుగు అనువాదపద్యము:
మ: కుటిల భ్రూకుటితాస్యుడై కరలసత్కోదండ దివ్యాస్త్రుడై
చటులారిందముడై బిడౌజు నుతుఢడై శ్యామాంగుడై ధీరుడై
పాటు తూణీర విముక్తి కాండ పవినిర్భగ్నా సురేంద్రాదియై
కటువృత్తింజయలక్ష్మి గొన్న ధరణీకాంతుండు నాన్ బ్రోవుతన్.

80.శ్లో:హత్వా యుద్ధే దాస్యం త్రిభువన విషమం వామహస్తేన చాపం
భూమావారోప్య తిష్ఠన్నితర కరధృతం భ్రామయన్ బాణమేకం
అరక్తో శాంతి నేత్రం శారద శితవపుః కోటి సూర్య ప్రకాశో
వీరశ్రీబంధురాంగ స్త్రిదశపతినుతః పాతు మాం వీరి రామః..

భావము: ముల్లోకములకు విరోధియగు  రావణుని యుద్ధమందు కొట్టిఎడమచేతిచే ధనుస్సు భూమియందు నిలిపి తాను నిలబడి కుడిచేత పూనిన యొక బాణమును త్రిిప్పుచున్నట్టియు  నించుక యెఱ్ఱనైన ప్రాంతములు కల కన్నులు కలిగినట్టియు బాణములతో గాయపడ్డ దేహము కలిగినట్టియు కోటి సూర్యుల వంటి కాంతి కలిగినట్టి యు వీరలక్ష్మిచే సొగసైన శరీరము కలిగినట్టియు ఇంద్రునిచే  స్తోత్రము చేయబడిన రాముడు నన్ను రక్షించుగాక.

తెలుగు అనువాదపద్యము:
మ: అరుణాంభోరుహ నేత్రుడై శతసహస్రాదిత్య సంకాశుడై
     సూర్య యోగీంద్ర మునీంద్ర కంటకు దశాస్యున్ ద్రుంచి ఛిద్రాంగుడై
     ధరణిన్ గార్ముక మూని బాణమొక చేత త్రిప్పుచున్ సన్నుతా
     మర నాథుండు జయాభిరాముడగు రామస్వామి నన్ బ్రోవుతన్.

No comments:

Post a Comment

Pages