నేటి తెలుగు తనము - తెలుగు పండుగలు
తురగా శివరామవేంకటేశ్వర్లు
పుట్టినరోజు పండుగ
నాకు బాగా గుర్తుఒకనాడు పిల్లల పుట్టినరోజు పండుగ వేళ
ఆవునేతి దీపాల హారతిలో, వారి ముఖాలు వెలిగి,చిరునవ్వులు చిందేవి.
వారి శిరస్సున పడ్డ అక్షింతలు పచ్చని పసిడి ఛాయతో మెరిసేవి.
పెద్దల దీవెనల స్వరాలు నాదస్వరంలా వీనులవిందు చేసేవి.
ఇప్పుడేవీ ఆ వెలుగులు, మెరుపులు ?
ఆరిపోయిన కొవ్వొత్తులు మిగిల్చిన చీకటి తప్ప.
ఇప్పుడేవీ ఆ స్వరాలు? హ్యాపీ బర్త్ డే టు యూ లు తప్ప
ఉగాది పండుగ
వేప పువ్వు వెగటాయే - చెరుకు ముక్క చేదాయే
బెల్లం ముక్క అల్లమాయే - అరటిపండు అరగదాయే
మామిడి ముక్క మటుమాయమే - కేకు ముక్క కనకమాయే
కనబడని తెలుగు వేషం
పంచె కట్టు పారిపోయే - లాల్చీలు లాంచనమాయే
టీశాతులు, షర్టులు, పాంట్లు, ఫాషనాయే
పరికిణీలు, ఓణీలు ఓడిపోయే - స్కర్టులు బికినీలు బిగువాయే!
వినబడని తెలుగు భాష
అ,ఆ లు అరిగిపోయే - ఉ, ఊ లు ఊడిపోయే
క,ఖ లు కరిగిపోయే - గుణింతాలు గగనమెక్కె
తెలుగు ముక్క తెలియదాయే - ఇంగ్లీషు ముక్క ఇంపాయే
మరి ఏం చేద్దాం?
వెదుకుదాం తెలుగు గ్రంధాలను తెలుగు గంగలో
పట్టుకుందాం పారిపోతున్న తెల్లని తెలుగుతనమును
తెచ్చుకుందాం తిరిగి తెలుగు వెలుగులను
ఎగురవేద్దాం తెలుగు జండాను జనుల మధ్యన !
***
Telugudanam achamga ruchikaramaina cheruku thinnatluga undi !guruthukoche aa nati rojulu ugadi pachadi auroma malli guruthukostunnai !Telugu ruchini gurthu chesina mee kavithaki andukondi maa abhinandanalu !
ReplyDelete