చైత్ర మాసమాదిగా యుగాది యేతెంచె
ఆనందమీయగా
అవనిపై అఖిల జీవులు
చైతన్య భరిత మవ్వగా
చిగురు తొడిగిన తరుల తనువులు
కళకళ లాడగా
లేత మామిడి పిందెలు తెలుగు ఉగాది ఏటికేడాది వచ్చునని
హొయలు పోవగా
కుహు కుహూ రవములతో కోకిలలు
మంగళవాద్యములూదగా
ఆరురుచులతో ఆరుఋతువుల
పరమార్థము తెలుప
షడ్రుచుల వేప పచ్చడి నోటికి
విందుచేయ
మోదఖేదములు లేని జీవనం లేదని
తెలియజేయ
సకల వేదాంత సారమిదెయెనని
ఎరుకగలగ
వసంత కన్యక నవాభ్యుదయానికి
నాంది పలుకగా
మాన్యులకు,సామాన్యులకు,వాదులకు, ఉగ్రవాదులకు
మహిలోన కాలధర్మమొకటేనన్న
సత్యమెరిగి
గతము తలచుకొనెడి చేదు సంగతులు మరచి
నేటి తలపులకు నవ్య చిగురు లద్ది
రేపటి ఆశలకు మోసులు వోసి
ఓ విళంబా!సకల శుభములు మెండుగ దోడ్కొని
సాగిరమ్ము!
జయము జయము నీకిదే మా స్వాగతమ్ము!
*****. *****. *****. *****.
No comments:
Post a Comment