కిసుక్కున నవ్వండి!
(పాత్రలు మనవే( కావచ్చు), అందుకే పేర్లు పెట్టలేదోచ్)
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
మెకానిక్ కొడుకు:
"అమ్మా..నాన్న లివర్ బాగా డేమైజ్ అయిందట, రిపైర్ కష్టమంటున్నారు డాక్టర్"
*****
జీవితం చరమాంకంలో ఓ సినీ ఎడీటర్:
"దేవుడు నా జీవితంలోని సన్నివేశాల్ని సరిగా ఎడిట్ చేయలేదు. అంతా అస్తవ్యస్తమే!"
*****
పెళ్లి చూపుల్లో-
"అమ్మాయికేవన్నావచ్చా?"
"తనకు బయటకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు, అందుచేత మాకూ తెలియదు"
*****
"ఒళ్లెలా ఉంది"
"నలభై అయిదు కేజీల బరువుతో"
*****
"ఆ అమ్మాయి అంతగా బావుండదు కదా, ఎందుకు పెళ్లి చేసుకున్నావ్"
"వాళ్ల నాన్నకి వైన్ షాపు ఉంది"
*****
No comments:
Post a Comment