శివం -38
శివమ్మ కధ -14
రాజ కార్తీక్
(శివమ్మ కోరిక మేరకు ..నెలల బాలుని వలె మారిన శివుడు ...)
శివమ్మ ఆ విస్పోటనం ఐపోగానే నన్ను చూసి మురిసిపోయింది.
వెనుక నుండి ఆకాశవాణి "అమ్మా, నువ్వు కోరింది ఇదే కదా ! అదిగో అక్కడ నేను పసిబిడ్డ లా మారి ఉన్నాను. నేను నీ బిడ్డను అమ్మా . నీ బిడ్డను ఎలా చూస్తావో నీ ఇష్టం " అని వినిపించింది.
శివమ్మ కనుల వెంట నీరు ధారగా వచ్చాయి.
అది చూసి నంది, భృంగి, నాగరాజు తీవ్రమైన తన్మయత్వంతో ఏమీ మాటలు రాక చూస్తున్నారు.
విష్ణు ,బ్రహ్మ దేవులు మిగతా వారందరు నా బాల్య రూపాన్ని చూసి నమస్కారం చేసుకుంటున్నారు.
పార్వతి మత మాత్రం మహాదేవుడ్ని చిన్న పిల్లాడివలె చూసి, ఎంతో సంబరపడుతోంది.
విష్ణు దేవుడితో పార్వతి మాత
"సోదరా! చూడండి, మహాదేవుడు ఎంత ముద్దుగా ఉన్నాడో " అంది.
"అవును నేను ఇప్పుడు ఉన్న రూపంలోనే మహాదేవుడిగా మారాను..."అన్నాను.
విష్ణు దేవుడు "ఆ పసిబాల మహాదేవుడు చూడు, ఆ త్రినేత్రాలతో, జటలతో ,అ కొద్దిపాటి జింక చర్మంతో ..ఆ చందమామ కొనతో , ఎంత ముద్దుగా ఉన్నాడో," అన్నాడు పరవశంగా.
బ్రహ్మ దేవుడు - సరస్వతి మాత లు "తల మీద కొప్పులు, ఆ శంఖం ,ఆయన పక్కగా ఉన్న ఉన్న ఆ చిన్న త్రిశూలం ... ఎంతబాగున్నాయో," అన్నాడు ఆనందంగా చూస్తూ.
విష్ణు దేవుడు "ఏమి ఈ మధుర దృశ్యం ! శివుడు చేసిన పని ఇదన్న మాట. అందుకే మనకి ఏమీ అర్ధం కాకుండా చేసాడు. మును ముందు ఇంకా ఏమి చూడబోతున్నమో అని ఆతృతగా ఉంది." అన్నాడు.
అందరూ, అన్ని లోకాల వారు "బాల శివుడు కి జై ! ఈ శిశు మహాదేవుడు కి జై " అన్నారు.
ఇక, మా అమ్మ నన్ను వచ్చి చూసి, నా బుజ్జి శివయ్య. నాకోసం న బిడ్డలా మారావా?" అని అంటుంది మురిపెంగా.
నంది ,భృంగి ,నాగరాజు వచ్చి నాకు నమస్కారం చేసుకున్నారు.
వారు "మహాదేవా ....పుట్టుకే లేని నీవు, ఈ రూపం ధరించడమంతా శివమ్మ తల్లి వల్లనే సాధ్యమయ్యింది." అని ఉద్విగ్నులు అవుతున్నారు.
మా అమ్మ నన్ను ఒక్కసారిగా ఎత్తుకొని ముద్దులు కురిపించింది.
ఒక తల్లికి నిజంగా దైవాన్ని చూసిన దాని కన్నా, తొలిసారి తన బిడ్డను చూస్తే వచ్చే ఆనందమే వేరు. అవును నిజంగా మా అమ్మ నన్ను మహా దేవుడిగా చూసిన దాని కన్నా, తన పొత్తిళ్ళలో పసి బిడ్డలా చూసి ఆనందపడిందే ఎక్కువ.
నంది "ఏమి సృష్టి. ఏమి ఆప్యాయత? ఏమి ప్రేమ? ఏమి లాలన? ఏమి ఆనందం? ఏమి తన్మయత్వం? ఏమి భక్తి? ఏమి భావం? ఏమి ఈ ఆనందం?" అని తన్మయుడవుతున్నాడు.
(సశేషం)
No comments:
Post a Comment