శ్రీరామకర్ణామృతం -39 - అచ్చంగా తెలుగు

శ్రీరామకర్ణామృతం -39

Share This
శ్రీరామకర్ణామృతం - 39 
సిద్ధకవి
డా.బల్లూరి ఉమాదేవి.

తృతీయాశ్వాసం.

81శ్లో:యుద్ధే సన్నద్ధ శస్త్రం కపివరభయదం కుంభకర్ణం సురారిం
బాణేనైకేన సద్యః ప్రకటిత హుతభుగ్విశ్వరోషారుణాక్షమ్
హిత్వా కృత్వా ప్రమోదంసురకపి విత్తే ర్మౌనిబృందైక సేవ్యోవీర శ్రీబంధురాంగ స్త్రిదశపతినుతః పాతు మాం వీర రామః.

భావము:

యుద్ధమందు సన్నాహమొందిన ఆయుధము కలిగినట్టి వానరులకు భయమును చేయునట్టి తత్కాలమందు ప్రకటింపబడిన అగ్ని వంటి యెల్లవారి కోపము చేత ఎఱ్ఱనైన కన్నులు గల కుంభకర్ణుడను రాక్షసునొక బాణము చేత కొట్టి దేవతల యొక్కయు వానరుల యొక్కయు సమూహములకు సంతోషం చేసి ముని సమూహములకు ముఖ్యముగా సేవింపదగినట్టి రాముడు నన్ను రక్షించుగాక.

తెలుగు అనువాదపద్యము

చ: హరివరులెల్ల భీతిల లయాంతకురీతి ధృతాస్త్ర హస్తము
ష్కరుణాక్షుడైన ఘటకర్ణువధించి జయాభిరాముడై
సుర పతి వానరుల్ ముందుముందు సొంపు వహింప మునులంతా భజింపగా
సుర పతి సన్నుతింప రణశూరుడు రాముడు నన్ను బ్రోవుతన్.

82శ్లో: దైతేయోదగ్ర సేవ్యం  పటుతర విశిఖంభీషణం ఘోరనాదం
దేవేంద్ర స్తూయ‌మాన స్ఫురదరినికరా నంధకారాంశ్చ హత్వా
దిక్పాలాన్ ప్రాప్తభోగాన్ మణిరుచిసుభగాన్ దిక్షుతాన్ స్థాపయిత్వా
వీరశ్రీబంధురాంగస్త్రిదశపతినుతః పాతు మాం వీరరామః.

భావము:

రాక్షసులలో ఉన్నతుడై సేవించి దగినట్టి తీక్షణ బాణములు కలిగినట్టి భయంకరుడైనట్టి ఘోరధ్వనిగల రావణుని ప్రకాశించు శత్రు సమూహములను చీకట్లను గొట్టి ఇంద్రునిచే నుతింపబడిన వాడగుచు దిక్పతులకు భోగములు కలిగించి రత్న శోభలచే మనోహరులను గావించి దిక్కులయందు నిలిపిన రాముడు నన్ను రక్షించుగాక.

తెలుగు అనువాదపద్యము:

మ:భయదంబైన మహార్భటిన్ ధృతధనుర్బాణాస్త్రుడై గర్వ దు
ర్నయ దైత్యావళి వంచకాది చటులాస్త్ర ప్రక్రియన్ ద్రుంచి తా
జయలక్ష్మిన్ గొని జంభవైరినుతుడై స్థానంబులున్ భోగముల్
దయ దిక్పాలుర కిచ్చినట్టి రఘునాథస్వామి నన్ బ్రోవుతన్

83.శ్లో:కౌసల్యా వీరగర్భాంబుధి ఘనవిలసత్పూర్ణ చంద్రప్రకాశౌ
మౌనీంద్ర స్వాంతన పద్మ ప్రిలిమినరీ తరణి ర్ధర్మనైపుణ్యరూడః
మరీచం రాక్షసేంద్రం నిజశరదహనాయాహుతిం కల్పయిత్వా
వీరశ్రీబంధురాంగస్త్రిదశపతినుతః పాతు మాం వీరరామః.

భావము:

కౌసల్య యొక్క వీర గర్భ మనెడుసముద్రమునకు గొప్పగా ప్రకాశించుచున్న పూర్ణచంద్రుని వంటి కాంతి కలిగినట్టియు ముని శ్రేష్ఠుల చిత్త పద్మములకు నిర్మల సూర్యుడైనట్టియు ధర్మమందలి నేర్పునకు ప్రసిద్ధుడైనట్టియు రాక్షస శ్రేష్టుడైన మారీచుని తన బాణానికి ఆహుతియొనర్చిన రాముడు నన్ను రక్షించుగాక.

తెలుగు అనువాదపద్యము:

శా:కౌసల్యాజఠరాబ్ధిచంద్రు మునిహృత్కంజాత కంజాప్తు వి
ద్యాసంపన్నుని దాటకేయవనదా వాగ్న్యంబకున్ వీరల
క్ష్మీ సంప్రాప్తిస్తుంది శరీరు ధర్మయుత సంశీలున్ బలారిస్తుతున్
రాసూనున్ రఘువీరు దాశరథి శ్రీరామునితో బ్రశంసించెదన్.

84.శ్లో:యో దండకారణ్య నిశాచరేంద్రాన్ కోదండలీలా విషయాంశ్చకార
లేదండీ శుండాయిత బాహుదండః కోదండ పాణిః కులదైవతం సః.
భావము:

ఏ రాముడు దండకారణ్యమందలి రాక్షసులను ధనుర్విలాసమునకు గోచరులనుగా చేసెనో అట్టి  ఏనుగు తుండము వంటే భుజదండ ములుగల ధనుస్సు హస్తమందు గల రాముడు మాకు కులదైవము.

తెలుగు అనువాదపద్యము:

మ:తతజంభద్విషతుండితుండనిభదోర్దండాత్త కోదండ మం
డితుడై శూరత దండకాటవిని దాడిన్ జేయుచున్ ధూర్త సం
గతి వర్తించు నిశాటులన్ దునిమి వేడ్కన్ బాణబాణా సనాం
చితుడౌ రాముడు మాకు దైవమగుచున్ జెన్నొందు నశ్రాంతమున్.

85.శ్లో:తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ
ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ
రక్షఃకులవిహంతారౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ.

భావము:

పిన్న వయసు కలిగినట్టియు సౌందర్యముతో గూడినట్టియు మృదువైనట్టియు గొప్ప బలము కలిగినట్టియు పద్మములవలె విశాలమగు కన్నులు కలిగినట్టియు నారచీరలు కృష్ణాజినములు వస్త్రములు కలిగినట్టియు పండ్లు దుంపలు తినునట్టియు శాంతులు ధర్మమునందు సంచరించువారు రాక్షస వంశమును బ అన్నదమ్ములగు రామలక్ష్మణులు విజయులగుదురు గాక.

తెలుగు అనువాదపద్యము:

చ:అనుపమ రూపయౌవన బలాఢ్యుల సజ్జనమిత్రులన్ లస
ద్వనరుహ పత్రనేత్రులను దాంతుల దాపస ధర్మచర్యులన్
వనఫలమూలభోజనుల వల్కలధారుల దైత్యబృంద మ
ర్ధనులగు రామలక్ష్మణుల దాసజనావనులన్ భజించెదన్.

86.శ్లో:కల్యాణానాం నిదానం కలిమలదహనం పావనం పావనానాం
పాథేయం మోక్షసిద్ధి ప్రథిత సుపదవీ ప్రాప్తయే ప్రస్థితస్య
విశ్రామస్థానమేకం కవివర వచసాం జీవనం జీవితానాం
బీజం ధర్మద్రుమస్య ప్రభావతి భావిస్తాం భూతయే రామనామ.

భావము:

శుభముల కాదికారణమును పాప మాలిన్యమున కగ్నియు పవిత్రమైన వానిలో పవిత్రమైనది మోక్షసిద్ధికి ప్రసిద్ధమగు మంచి త్రోవను పొందుటకు బయల్వెడలిన వానికిబత్తెమైనదియు కవీశ్వరుల వాక్యములకు ముఖ్యమైన విశ్రాంతి స్థానమును జీవనములకు జీవనమును ధర్మమను వృక్షమునకు గింజయు నగు రామనామము మీ పవిత్రతకు సమర్థమగుచున్నది.

తెలుగు అనువాదపద్యము:

చ:పరమ పవిత్రమున్ గుశలపద్ధతి కాదిమకారణంబు పి
ద్వారా కలికల్మషాపహము ధర్మకుజంబున కాదిబీజమున్
పరమ పదాను వర్తియగు పాంథున కిమ్మగునట్టి విశ్వ
స్థిరతరమౌ నివేశమున జీవితజీవనమై తనర్చు శ్రీ
కరములు రామనామము జగంబు పవిత్రము జేయు గావుతన్.

87.శ్లో: కౌసల్యానయనేందుం దశరథ వదనారవింద మార్తాండమ్
సీతామానసహంసం రామం రాజీవలోచనం వందే.

శ్లో:దీర్ఘబాహు మరవిందలోచనం దీనవత్సల మనాథరక్షణమ్
దీక్షితం సకల లోక రక్షణే‌ దైవతం దశరథాత్మజం భజే.

భావము:

కౌసల్య యొక్క నేత్రములకు చంద్రుడును దశరథుని ముఖద్మమునకు సూర్యుడును సీత యొక్క చిత్తమనేడి మానస సరస్సునకు హంసయు పద్మములవంటి నేత్రములు గలవాడునగు రాముని నమస్కరించుచున్నాను. పొడవైన చేతులు కలవాడును పద్మముల వంటి కన్నులు గలవాడును దీనులయందు ప్రేమగలవాడును దిక్కులేనివారికి రక్షకుడును నెల్లలోకముల సంరక్షణమందు దీక్ష గలవాడును దశరథ పుత్రుడునగు దైవమును సేవించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:

శా:కౌసల్యా నయనేందునాజిముఖ సత్కంజాప్తు సీ
తాను సాధ్వీమణి మానసాంబురుహ కాదంబంబు యోగీంద్రహృ
ద్వాసున్ దీర్ఘకరున్ జగద్గురు లసత్పంకేజ పత్రాక్షునిన్
వాస్తవ్యులు ననాథరక్షణు బరంధామున్ మదిన్ గొల్చెదన్.

88.శ్లో:సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః
గురూన్ శుశ్రూషయా వీరో ధనుషా యుధి శాత్రవాన్.

2.శ్లో:భర్జనం భవబీజ నామర్జనం సుఖసంపదామ్
తర్జనం యమదూతానాం రామరామేతి కీర్తనం.

భావము: వీరుడగు రాముడు సత్యము చేత లోకములను దానముచేత దీనులను సేవ చేత గురువులను  ధనుస్సు చేత యుద్ధమందలి శత్రువులను జయించుచున్నాడు రామ రామ యని కీర్తించటం సంసారమను గింజలకు వేపుడు సౌఖ్యసంపదలను పరిశుద్ధిచేయునది .యమ దూతలను బెదిరించునది.

తెలుగు అనువాదపద్యము:

చ:అరయగ సత్యవాక్యమున నన్ని జగంబుల దానవైఖరిన్
గురువులు బాణకోటి రిపుకోటుల దీనుల సేవ చేతనున్
సరవిజయించినట్టి రఘుసత్తము నిర్మల రామనామమున్
వరసుఖదంబు యామ్యభట వర్జితమున్ కలుషాపహంబగున్.

89..శ్లో:సకృత్ప్రణత రక్షాయాం సాక్షీ యస్య విభీషణః
సాపరాధ ప్రతీకారః స శ్రీరామో గతిర్మమ
నజానే జానకీ జానే రామ త్వన్నామ వైభవమ్
సర్వేశో భగవాన్ శంభుర్వాల్మీకిర్వేత్తి వా న వా.

భావము: రాముడుఒక్క పర్యాయము తనకు నమస్కరించినవారిని  రక్షించుననుటకు విభీషణుడు సాక్షి ఎట్టి అపరాధం తో కూడిన వారికి ప్రతిక్రియ చేయు రాముడు నాకు వ్యక్తి రామమూర్తి మీ పేరు యొక్క సామర్థ్యమును నేనెరుగను సర్వేశ్వరుడిను భగవంతుడు నగు శివుడును వాల్మీకియు నెరుగుదురో లేదో.

తెలుగు అనువాదపద్యము:

మ:అపరాధంబొనరించి యైన శరణం బన్నన్ గృపన్ బ్రోతు వీ
కృపకున్ సాక్షి విభీషణుండగుట రిత్తే నీను నీ నామమె
ల్లపుడున్ భర్గుడు వామలూరు భవుడుల్లంబందు జింతించి త
ద్విపులార్థంబు నెరింగిరో యెరుగరో వేద్యంబె మాబోటికిన్.

90.శ్లో:   కృత్యా కృత్యం వివేకహీన మనసాం హత్యాదిభిర్జీవినా
మొత్తం బహుతారకం తనుభృతా మంత్రంతో శోకాపహమ్
సత్యానందమయం సమస్త నిగమస్తుత్యాస్పదం సంపదాం
స్థానం శ్రీ రఘు రామ నామా విమలం నిత్యం స్మరన్ ముచ్యతే.

భావము: ఇది చేయదగినది ఇది చేయదగనిదియను వివేకము లేని మనసు కలిగినట్టి బ్రహ్మహత్యా మహా పాపముల చేత జీవించుచున్న మనుష్యులను  మిక్కిలి తరింప చేయునదియు అత్యంత దుఃఖముల నణచునదియు సత్యానంద రూపమైనదియు సర్వవేేదములచే స్తోత్రము చేయదగినదియు సంపదలకు స్థానమైనదియు నిర్మలమైనదియు నగు రామనామమును నిత్యమును తలచువాడు మోక్షము పొందుచున్నాడు.

తెలుగు అనువాదపద్యము:

శా: కృత్యా కృత్య వివేకవర్జితులకున్ కిం చిదగ్నులైనట్టి గో
హత్యా ప్రాప్తులకున్ సమస్తులకు మోక్షార్హంబు వేదాంతసం
స్తుత్యంబీప్సిత సంపదాస్పదము నిశ్శోకంబు నైర్మల్యమున్
సత్యానందము రామసంస్కృతి మహాసౌఖ్యంబు మోక్షంబగున్.
(వచ్చే నెల మరికొన్ని పద్యాలు)

No comments:

Post a Comment

Pages