ఎంత మధురం - అచ్చంగా తెలుగు
ఎంత మధురం ..
సుజాత తిమ్మన..

కృష్ణా ..
అక్కున చేర్చుకున్నావు 
నా ఆత్మ బంధువువై..

ఉట్టిపైన వెన్నని కాజేసి 
తలాకాస్త పంచుకు తిన్న 
ఆ రోజుల సావాసం కదూ మనది..

కర్రా బిళ్ళా ఆట ఆడుతూ..
నీళ్ళు మోసుకేలుతున్న అమ్మలలక్కల 
కడవలకి గురిచూసి రాయి విసిరి 
చెట్టు చాటుకు దాక్కుని తమాషా చూసిన  నాటి వైనం కదూ మనది..

ఏటిలోదిగి జలకాలాడుతున్న గోపికల 
చీరలు కాజేసి ఎమెరుగక..
పొన్న చెట్టు ఎక్కి ఎక్కిరించిన చిలిపి చెలిమే కదూ మనది..

కాళింది పై నాట్యం ఆడి 
విషము కక్కించి పొగరణచినా..
గోవర్ధనగిరిని ఒక్క వేలితో ఎత్తి 
ఆర్తులకాశ్రయమిచ్చినా...
నీవు మహిమలు కలవాడనవి మరచి 
మిత్రులందరికీ ప్రియమైన వాడవైనావే మాధవా..
నీ వేణు గానమున తేలిపోయిన అనూహ్య సంబంధమే కదూ మనది..

కుచేలుడనై కడుపెదరికంతో కటకటలాడుతున్న నా హీన స్థితిని 
ఇసుమంతైనా లెక్కచేయక  ఆనాటి ప్రియబాంధవుడవై ..
పిడికెడు అటుకులను ఆరగించి ..అలింగనములో..
నా కాయువునిచ్చినావా ...ఆప్తమిత్రుడు అన్న పదానికి నిర్వచనమై.....
ఎంత మధురం స్నేహ బంధం ..ఆత్మల కలయికల అనురాగబంధం కదూ మాధవా.. !!
************  

1 comment:

  1. ధన్యవాదాలు పద్మిని గారు..

    ReplyDelete

Pages