నిత్యస్మరణీయం!
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
అసంకల్పిత ప్రతీకార చర్యగా
కొన్ని సంఘటనలకు
అనూహ్యంగా స్పందిస్తాం
ఆనక జరిగింది నెమరేసుకుని
పశ్చాతాపంతో దహించుకుపోతాం
కోపాన్నీ, నాలుకనూ అదుపులో పెట్టుకోవాలని
పెద్దలనేదందుకే
జీవితమంటే స్థూలంగా
మనుషులతో లావాదేవీలే
ఎంత జాగ్రత్తగా ఉంటే
అంత ఉన్నత వ్యక్తిత్వమని కొనియాడబడతాం
మనిషిగా పుట్టి
మనీషిగా మారే ప్రయత్నమెప్పుడూ
ముదావహమే
నాలుగు రాళ్లు వెనకేసుకోవడం కన్నా
నలుగురు మనుషుల్ని సంపాదించుకోవడమే
ముఖ్యం
ఇదే సత్యం..నిత్యస్మరణీయం!
***
No comments:
Post a Comment