వాయిదా మనస్తత్వం - అచ్చంగా తెలుగు

వాయిదా మనస్తత్వం
డా.బి.వి.సత్య నగేష్, మైండ్ ఫౌండేషన్ అధినేత 
ప్రముఖ మానసిక నిపుణులు. mob: 9849064614

(Postponement Nature) ఇదొక బలహీనత. ప్రగతిని దూరం చేస్తుంది. ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు ఏదో ఒక అనవసరమైన పనిని చేస్తూ అవసరమైన పనులను త్యాగం చేస్తుంటారు. పైగా సమయం చిక్కడం, "లేదంటారు. వాస్తవానికి ఇదొక సాకు మాత్రమే. మనిషి ప్రవర్తన ముఖ్యంగా Pain లేదా Pleasure అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి అతి ముఖ్యమైన పని అని తెలుసుకున్నప్పటికీ బాగా శ్రద్దగా, తీర్చిదిద్దేలా తర్వాత చేద్దామనే భ్రమతో ఏదో ఒక పనితో సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. ఈఅలవాటు బాల్యంలోనే మొదలవుతుంది. విద్యార్థి దశలో ఆటలు, టీవీ, స్నేహితుల ద్వారా Pleasure ను పొందుతూ చదువును వాయిదా వేస్తారు. 70% మంది విద్యార్థులు ఈ వాయిదాల అలవాటు బారిన పడతారని ఓ అంచనా. Pleasureకు అలవాటు పడిన విద్యార్థికి చదువు Painలా అనిపిస్తుంది. అందువల్ల చదువు అనే Painను వాయిదా వేసి . అనవసరమైన, తాత్కాలికంగా తృప్తినిచ్చే పనుల్ని చేస్తూ ముఖ్యమైన పనిని వాయిదా వేస్తారు. చివరికి ఇదొక అలవాటుగా, బలహీనతగా మారిపోతుంది.
వాయిదాల మనస్తత్వం నుంచి బయట పడే మార్గాల గురించి తెలుసుకుందాం.
మనసు అనేది ఒక థెర్మోస్టాట్ లా పనిచెయ్యాలి. ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే గుర్తించి ఉష్ణోగ్రత తగ్గేలా చూసేందుకు థెర్మోస్టాట్ ఉపకరిస్తుంది. అలాగే వాయిదా వెయ్యాలనే విధంగా ఆలోచనా విధానం సాగుతుంటే మనసు థెర్మోస్టాట్లా పనిచేసే వాయిదా వెయ్యకుండా ఉండేటట్లు చెయ్యాలి. అలా చేసేందుకు ఏం చెయ్యాలనే విషయాన్ని పరిశీలిద్దాం.
1.ఇప్పటివరకు మీరు వాయిదా వేసిపొగొట్టుకున్న అవకాశాలను ఒక లిస్టుగా తయారు చేసుకోండి. ఇకముందు ఎప్పుడైనా ఏ పనినైనా వాయిదావెయ్యాలనుకున్నప్పుడు, ఆ లిస్టును ఉద్వేగంతో చదవండి. 'ఇక నేనే వాయిదా వెయ్యకూడదు' అనే భావన కలిగేలా ఉద్వేగాన్ని పొంది, అనుకున్న పనిని వెంటనే చెయ్యండి. పోస్టుకార్డు సైజులో 'Do it now’అని రాసుకుని మీ వర్కింగ్ టేబుల్ దగ్గర కనబడే విధంగా అమర్చుకోండి. మీరు తయారు చేసుకున్న లిస్టును చదివి అసంతృప్తి
పొందకూడదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
          2.ప్రతి పనికి ఒక 'డెడ్ లైన్' అనబడే నిర్దిష్టమైనవ్యవధిని పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్దిష్టమైన వ్యవధి లోపుగా ఆ పనిని పూర్తిచెయ్యాలనే సంకల్పంతో ఉండండి. ఊహించని కొన్ని పనులు మీ షెడ్యూలనుభంగపరిచే అవకాశం ఉన్నప్పుడు కూడా మీ డెడ్ లైన్ లోపుగా పనిని పూర్తి చెయ్యడానికి మీ శక్తిని కూడగట్టండి. డెడ్ లైన్ మనిషిని ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది, కొద్దిపాటి ఒత్తిడిని కలుగజేస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలతోప్రయత్నిస్తే మీకే తెలుస్తుంది.
          3.మీరనుకున్న పనులు/ లక్ష్యాల గురించి, వాటికిఎప్పటిలోగా పూర్తి చెయ్యాలనుకుంటున్నారనే విషయాల్ని తెలుసున్న వారికి చెప్పండి. దీనివల్ల రెండు లాభాలున్నాయి. మొదటిది.. అందరూ అడుగుతారేమోననే భావనతో పూర్తి చేస్తారు. రెండవది.. మీరనుకున్నట్లు చెయ్య కుండా వాయిదా వేస్తే ఇతరులు మీ లక్ష్యాలను గుర్తు చేసి మీలో స్ఫూర్తినికలిగిస్తారు.
          4.Collage అంటే Book of Clippings. మీలో స్పూర్తిని కలిగించే ఫొటోలు, స్ఫూర్తిదాయకమైన మాటలు, కొటేషన్లను ఆ పుస్తకంలో పొందు పరచండి. అంతేకాదు.. మీకు ఎప్పుడైనా బాధ కలిగించే సంఘటనలు, బాధ కలిగించిన వ్యక్తుల పేర్లు, సందర్భాలు మీకు అర్థమయ్యే తీరులో ఆ పుస్తకంలో రాసుకుని వాయిదా వెయ్యాలనుకున్న సమయంలో ఆ పుస్తకాన్ని భావోద్వేగంతో చదవండి.
పై నాలుగు సూచనలను పాటించి వాయిదాలు వేసే బలహీనత నుంచి బయటపడవచ్చు.
భార్యభర్తలు గొడవపడుతూ..
భర్త: నువ్వంటే నాకేమన్న భయమనుకు న్నావా? (కోపంగా) | భార్య: అబద్దాలు చెప్పకండి. మీరు నన్ను చూడ్డానికి ఐదుగురితో వచ్చారు. తర్వాత తాంబూలానికి 50 మందితో వచ్చారు. పెళ్లికి 200 మందితే వచ్చారు. మరి నేను మీ ఇంటికి ఒక్కదాన్నే వచ్చాను.
 ***


No comments:

Post a Comment

Pages