శివం -40
శివమ్మ కధ -15
రాజ కార్తీక్
(నేను మా అమ్మ కోరిక మేరకు బాలుని వలె మారి దివ్యమైన లీలను ప్రదర్శిస్తున్నా... )
శివమ్మ "ఏమైంది కన్నా తండ్రి ఎందుకు ఏడుస్తున్నావు " అనడిగింది కంగారుగా.
నేను మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉన్నా ...అందరికి ఒకటే కంగారు ..
విష్ణు దేవుడు "ఏ మాట కు ఆ మాటే! ఈ బాలుడు ఏడుస్తూ ఉంటె ఎంత ముద్దుగా ఉన్నాడు ..ఈ మనోహరమైన బాలుడు ఎంత ముద్దుగా ఉన్నాడు " అన్నాడు.
పార్వతి మాత, సరస్వతి లక్ష్మి మాతలు మాత్రం అయ్యో, 'ఎందుకు ఆ బిడ్డ అలా ఏడుస్తూ ఉన్నాడు', అని అంటున్నారు.
కానీ బిడ్డ ఎందుకు ఏడుస్తోందో తల్లికి తెలిదా ...
శివమ్మ కి అర్ధం అయ్యింది ...వెంటనే తను నన్ను పొత్తిళ్ళలోకి తీసుకొని,
"జో జో జో....."అంటున్నది.
తన వస్త్రం సరి చేసుకొని ...తన బిడ్డను ఐన నాకు స్తన్యం ఇవ్వబోయింది.
అవును, మా అమ్మకి నేను తప్ప, ఇంకేమి తెలిదు. అందుకే తనకి ఇదంతా తన కోరిక మేరకు నడుస్తున్న విషయం అని ఏమి తెలిదు, ఆమెకు మాత్రం తను తల్లి నేను బిడ్డని అంతే ..ఎందుకంటే నిజమే కదా ..
మా అమ్మ నాకోసం ఏమి చేసినా నాకు ఇష్టమే.
కొందరు ఏమిటి ఈ పండు ముసలి మహాదేవుడు కి ఎలా స్తన్యం ఇస్తుంది ..ఐనా మహాదేవుడు వరమిస్తే మనకు ఎందుకు సందేహం ..అనుకుంటున్నారు.
నా ఈ సృష్టిలో ఏ బిడ్డకైనా తన మజిలి తన తల్లి కదా అలాగే నాకు కూడా.
నేను నిజంగా ఆకలి వేసి ఏడ్చాను. అది మా అమ్మ కి అర్ధం అయ్యింది, నేను కూడా అందరి పసి బిడ్డల వలె నా తల్లి పాల కోసం ఆరాటపడ్డాను.
వచ్చి రాని చిన్ని మాటలతో పాలు కావాలి పాలు కావాలి అని అన్నట్టు ఏడ్చాను.
శివమ్మ "నాన్నా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను ..నీకోసం ఏమైనా చేస్తా "అంది.
అంతే శివమ్మ తల్లి తన స్తన్యం నాకు ఇచింది ..నేను ఏడుపు ఆపేసాను ...
అందరు ఈ సన్నివేసం చూసి ఆశ్చర్య పోయారు. వారి మనసులో కలిగిన భావోద్వేగం ఎలా చెప్పను?
ఎందుకో తెలిదు, నాకుకూడా మా అమ్మ దగ్గర ఉంటె చాలు అనిపించింది. లోకాలను సృజన చేసిన దగ్గర నుండి ఇంత ఆనందం నాకుఎప్పుడు కలగలేదు. తెలియకుండానే నా కనులు వెంట నీరు వస్తున్నది.
మా అమ్మ 'ఎందుకు చిన్నా ఏడుస్తున్నావు?' అని అంది .కానీ బాలుని వలె ఉన్న నేను ఏమి చెప్పను ..పాయసం తాగిన దానికన్నా మా అమ్మ దగ్గర పాలు తాగుతుంటే ఇంకా మధురానుభూతి .
నా కనులు వెంట వచ్చిన ఆనందబాష్పాలు చూసి ..
విష్ణు దేవుడు "మహాదేవా ...అసూయాగా ఉంది " అన్నారు.
బ్రహ్మ దేవుడు ఆయనుకు ఉన్న నాలుగు తలల ఎనిమిది కనుల నుoడి ఆనంద బాష్పాలు రాల్చారు.
పార్వతి దేవి "సోదరా ...ఎందుకు నాకు ఈ ఆనందోద్రేకం "అంది.
సరస్వతి మాత "మహాదేవా, శివమ్మది అదృష్టమా, ఆ ఆ ఆ లేక ఈ లీల చూస్తున్న మాయా" అనడిగింది.
అందరు ఇదే భావాన్ని వెలిబుచ్చారు ...
నంది ,భృంగి, నాగరాజు ప్రణమిల్లారు ..
మా అమ్మ కూడా తన బిడ్డ ఆకలి తీరింది ..నా బిడ్డ కడుపు నిండింది అని ఆనందపడింది ..మా అమ్మ ఆనందంగా ఉంటె నాకూ ఆనందమే.
నేను బోసి నవ్వులతో మా అమ్మను పలకరిస్తున్నా. అప్పుడు నేను చేస్తున్న వింత సైగలు, నా ఆటలు చూసి మురిసి పోతుంది ...అందరు అంతే .
విష్ణు దేవుడు "శివమ్మ శివునికి అమ్మ ..అంతే కాదు, మనకి కూడా అమ్మే. నేను మాత్రం శివమ్మ తల్లి కైలాసానికి వచ్చిన తర్వాత చేయించుకునే పాయసం మహాదేవుడికి కూడా పెట్టకుండా తింటాను. ఆయన ఒక్కడు చూడండి ఎంత ఆనందం అనుభవిస్తున్నాడో "అని చమత్కరిస్తున్నాడు.
శివమ్మ "ఇక నిద్రపో నాన్న "అంది.
నేను మాత్రం పోనుగా, అని నవ్వుతు సైగలు చేస్తున్న ..నన్ను పైకి ఎత్తి మా అమ్మ తన తల ను నా తలతో చిన్న ఢీ కొట్టి నవ్వుతోంది.నేను కూడా ఆపకుండా నవ్వుతునే ఉన్నా .
మా అమ్మ సరదాగా తన తలతో మరోసారి ఢి కొట్టబోతే ...నేను తప్పుకొని తనకి వచ్చీరాని ముద్దు ఇచ్చాను. అంతే, మా అమ్మ నా మీద ముద్దుల వర్షం కురిపించింది..
ఇలా మా ఆటలు చూసి ముచ్చట పడని వారు లేరు ..
(సశేషం)
No comments:
Post a Comment