విడిన మబ్బులు
వై.ఎస్.ఆర్.లక్ష్మి
ఉదయమే ఫోన్ మోగడం తో వంటింట్లో ఉన్న రమ "అక్కడే ఉన్నారుగా ఫోన్ తీయరేమిటి?"అని భర్త ఆనందరావుని కేక వేసింది.
"వస్తున్నాను లేవే"అంటూఉ ఫోన్ అందుకున్నారు ఆయన.
అవతల అమెరికా నుంచి కుందన చెబుతున్న విషయం వింటూనే ఒకింత ఆందోళనకు గురై "ఏమైందమ్మా ? కారణం చెప్పకుండా ఇలా షాకిస్తే నేనేమి మాట్లాడగలను?"అన్నాడు ఆనందరావు.
భర్త గొంతులోని కంగారు గమనించి న రమ " ఏమైందంటూ?"చెయ్యి తుడుచు కుంటూఉ వంటింట్లో నుంచి వచ్చింది.
ఫోన్ పెట్టేసిన ఆనందరావు "ఏముందీ?నీ కూతురికి అర్జంటుగా విడాకులు కావాలంట లాయరు ను కనుక్క్కోమని ఫోన్ చేసింది" అన్నారు.
అదిరిపడిన రమ "ఆదేంటండీ?పెళ్ళై నాలుగేళ్ళైంది.నిన్న మొన్న కాదు.మనం మనమ్మాయి డెలివిరీకి వెళ్ళొచ్చి కూడా 4,5 నెలలు అవుతోంది.మనం అక్కడున్న ఆరు నెలల్లో అల్లుడు దాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు.మనమన్నా ఎంతో అభిమానం గా గౌరవంగా ఉన్నాడు.ఇంతలో ఏమైంది?ఒక బిడ్డ కూడా పుట్టినాక ఇప్పుడే మిటి ఈ నిర్ణయంr?దీనికేమన్నా పిచ్చెక్కిందా?వాళ్ళ అత్త మామ అక్కడే ఉన్నారుగా వాళ్ళేమన్నా అన్నారంటారా?"ఆందోళనగా అడిగింది రమ.
"ఛ ఛ వాళ్ళు అలాంటి వారు కాదు.ఏమో?ఏమి జరిగిందో ఇదేమి చెప్పలేదు.ఆవేశం తో చెప్పిందో,ఆలోచించి చెప్పిందో తెలియదు.ఇప్పటికి ఊరుకుందాము.మ్ళ్ళి చేస్తే ఆలోచిద్దాము అన్నారు ఆనందరావు నిట్టూర్పు విడుస్తూ.
ఆనంద రావు,రమ ల ఏకైక కుమార్తె కుందన.ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరు అయ్యాడు.రమ గృహిణి.కుందన ఉన్న ఊళ్ళోనే ఇంజనీరింగ్ చదివింది.చదువు అవగానే స్నేహితులంతా ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళుతున్నారని తను కూడ వెళతానని గొడవ చేసింది.కాని రమ పెళ్ళి చేధ్ధామని తొందర పెట్టడం తో తను కూడా ఉద్యోగం లో ఉండగానే పెళ్ళి చేయాలనే ఉధ్ధేశం తో అటు భార్య మాట తోసిపుచ్చకుండా ఇటు కూతురి కోరిక కాదనకుండా అమెరికా సంబంధము చూసి నీ భర్త అంగీకరిస్తే పెళ్ళి అయ్యి వెళ్ళినాక ఎమ్మెస్ చేయమని పంపించాడు.వియ్యంకుడు వాళ్ళు తమ బంధువులకి స్నేహితులు అనిల్ బుధ్ధి మంతుడని తెలిసి వివాహం జరిపించాడు. పెళ్ళైన వెంటనే అమెరికా వెళ్ళారు.వియ్యంకుడు వాళ్ళు కూడా చక్కగా కలిపి పోయే మనుషులు.భార్య కోరిక ప్రకారం కుందనను ఎమ్మెస్ చదివించాడు. జాబ్ లో జాయిన్ అయినాక పిల్లల కోసం ప్లాన్ చేసుకొని తల్లిదండ్రులు ను పిలిపించుకుంది కుందన.పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.అటూ,ఇటూ అందరూ సంతోషం గా ఉన్నరు.వీళ్ళు ఉన్నంత చిన్నపాటి అలకలే కాని పెద్దగా గోడవపడిన సంఘటనలేమీ జరగలేదు.ఇంతలో ఈ ఉపద్రవమేమి టో అర్ధం గావటం లేదు అంకున్నారు ఆనందరావు గారు.ఆయన ఆలోచనలు పరిపరి విధాల పోయినాయి.
వారనుకున్నట్లు అది అక్కడతో సధ్ధుమణగ లేదు.రెండు రోజులకొకసారి "ఏమైంది అంటూ?"ఫోన్ చేస్తూనే ఉన్నది కుందన.ఆమె పట్టిన పట్టు వదలడం లేదని అర్ధం అయ్యింది ఆనందరావు గారికి.
"అసలు ఏమైందో చెప్పమ్మా.నువ్వు తీసుకున్న నిర్ణయం సరి అయిందో కాదో నేను కూడా ఆలోచించాలికదా!అని అడిగారు.
"నేను చెప్పింది వింటే మీరే ఒప్పుకుంటారు డాడీ .నా నిర్ణయం కరక్టు అని."
"విషయం చెప్పు"
"అనిల్ చాలా మారిపోయాడు డాడీ! ఇదివరుకులా నాతో ఉండటం లేదు.ప్రతిదానికి విసుక్కుంటున్నాడు.ఏదన్నా గట్టిగా అంటే వాళ్ళ అమ్మానాన్న బాధపడతారు మాట్లాడ వద్దు అంటాడు.మాట్లాడకుండా ఎలా ?"
"అనిల్ మంచి వాడు.ఈ మధ్య ఏమన్నా చెడు అలవాట్లు నేర్చుకున్నాడా లేక ఇంకేమన్నా సమస్యా?"
"అబ్బ పో డాడీ .మీ పెద్ద వాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారు.చెడు అలవాట్లు ఉంటేనేనా?నేనంటే ఇష్టం లేదు.అదివరకులా నాతో కబుర్లు చెప్పడం లేదు.బయటకు తీసుకొని వెళ్ళడు.అదివరకులా నాకు హెల్ప్ చేయడం లేదు.నా చాయకే రాడు.వాళ్ళ అమ్మానాన్న లతో కబుర్లు చెప్పడమో ,బాబుతో ఆడుకోవడమో చేస్తాడు.ఏమీ షేర్ చేసుకోడు.మొన్నామధ్య ఏమైందో తెలుసా!"
"చెప్పు .వింటున్నాను."
"అనిల్ మాల్ కి వెళితే మా ఫ్రెండ్ శాంతి కలిసిందట .తను బాగా సిక్ అయితే వాళ్ళ అమ్మానాన్న వచ్చారట.కుందనను ఒకసారి ఇంటికి రమ్మనండి లేకపోతే ఫోన్ చెయ్యమందట.పది రోజులైతే ఆ విషయం నాకు చెప్పలేదు.నేను క్యాజువల్ గా చాలారోజు లైనదని కాల్ చేస్తే .అనిల్ నీకు చెప్పలేదా అని అడిగింది.నాకు తల కొట్టేసినట్లైంది.అదేమని అడిగితే మరచిపోయా నంటాడు.తనవేమీ మరచిపోడు.అన్నీ ఇలాగే హేస్తాడు.ఇలాంటివాడితో లైఫ్ లాంగ్ వేగడం కష్టం డాడీ."
ఆనంద రావుకి విషయం అర్ధం అయ్యింది.చిన్న అసంతృప్తి అనే బీజం మదిలో పడేటప్పటికి తనకి అనుకూలంగా లేని ప్రతిదీ దాన్ని పెంచి మహావృక్షం అవుతోంది అని గ్రహించాడు.అయినా పైకి "అలా అంటే ఎలాగమ్మా! నీకో బాబు కూడా ఉన్నాడు.ఇప్పుడు విడాకులు తీసుకొని ఏమి చేస్తావు."అన్నారు.
"అలా అంటారేమిటి?మీరు నన్ను సపోర్ట్ చేస్తారనుకున్నాను.అమ్మకు ఇవన్నీ అర్ధం కావు.నేను జాబ్ చేస్తున్నాను.బాబుని నేను పెంచుకోగలను. ఇండియా లో లాగా ఇక్కడ ఎవరూ పట్టించు కోరు .ఎవరి లైఫ్ వారిది.ప్రతి రోజూ ఘర్షణ పడుతూ నేనా ఇంట్లో ఉండలేను డాడీ."
"సంసారం అన్నాక సర్దుకోవాలమ్మా.చిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం పధ్ధతి కాదు.అనిల్ తో నేనొకసారి మాట్లాడతాను."
"అనిల్ తో నువ్వేమీ మాట్లాడ వద్దు.అయినా సర్దుకుపోవాలని పాత చింతకాయ కబుర్లు చెబుతావేంటి.వాళ్ళతో పాటు మేమూ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నాము.మాకు కోరికలు ఉంటాయి.స్వేచ్చా స్వాతంత్ర్యాలు మాకొద్దా?వాళ్ళు కూడా సర్దుకుపోవాలిగా.మీరేంటి పాత తరం వాళ్ళ లాగా ఆలోచిస్తున్నారు.ఈ రోజుల్లో ఎంతమంది దైవోర్స్ తీసుకోవడం లేదూ.అదంతా కామన్.మీ కాలంలో లాగా ఇప్పుడు ఎవరూ భయపడటం లేదు.అంతెందుకు మా ఫ్రెండ్ గీత నీకు తెలుసుగా.వాళ్ళాయనకు పెళ్ళికి ముందు లవ్ ఎఫైర్ ఉందని తెలిసి దైవోర్స్ తీసేసుకుంది.ఇప్పుడేమీ లేదని వాళ్ళాయన కాళ్ళావేళ్ళా పడ్డా. విన లేదు.నీకు కుదరక పోతే చెప్పు నేను ఇక్కడే ప్రయత్నిస్తాను"అంది.
ఆనందరావు కి ఏమి మాట్లాడాలో తెలియక "సరేలేమ్మా.నువ్వు తొందరపడకు.నేను ఆలోచిస్తాను "అన్నాడు.
కుందన ఫోన్ చేసి విడాకుల కోసం ఊదరకొట్టడం ఆనందరావు ఏదో ఒక మిషతో వాయిదా వేయడం అలా రెండు నెలలు గడిచాయి.ఈ. లోపున ఆయన అనిల్ తో మాట్లాడాడు."మా మధ్య గొడవలేమీ లేవు అంకుల్.అటు జాబ్ ఇటు బాబు పనితో కుందన సతమతమై పోతోంది.అమ్మ హెల్ప్ చెస్తానన్నా చేయనీదు. నాకు ఈ మధ్య వర్క్ ఎక్కువై ఇంట్లో తనకు టైం కేటాయించలేకపోవడం తో మరీ అసహనం పెరిగి చీటికీ మాటికీ కోపగించుకుంటోంది.మీరేమీ కంగారు పడకండి.నిదానంగా తనే అర్ధం చేసుకుంటుంది."అన్నడు.
కుందన ఆలోచనా ధోరణిలోనే మార్పు వచ్చింది అని జీవితమంటే తమ కోసం మాత్రమే తాము జీవించడమని అక్కడ ఏమి చేసినా తప్పు లేదని తనకు తెలిసిన ఒకటి రెండు సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడుతోందని దీన్ని మొగ్గ లోనే తుంచకపోతే విష వృక్షమై కుటుంబాన్ని బీటలు వారేలా చేస్తుందని గ్రహించి ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చారు.ఆ రోజు కుందన ఫోన్ చేయగానే"మీ అమ్మా నేను బయలుదేరి వస్తున్న్నాము తల్లీ.వచ్చినాక అన్నీ వివరంగా మాట్లాడదాము".అన్నారు ఆనందరావు.
"సరే డాడీ "అంటూ ఫోన్ పెట్టేసింది కుందన.
వీళ్ళు వస్తున్నారన్న విషయం తెలిసి అనిల్ ఫోన్ చేసి "అంకుల్ అమ్మా వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియవు.కుందన తనే సర్దుకుంటుందని నేనేమీ చెప్పలేదు.మీరు కూడా వాళ్ళ ముందు ఏమీ మాట్లాడకండి"అని చెప్పాడు.
"అలాగేనయ్యా!మేము మా అమ్మాయి తో మాట్లాడటానికే వస్తున్న్నాము. నీవేమీ కంగారుపడకు.అన్నీ అవే సర్దుకుంటాయి."అన్నారు ఆనందరావు.
"అంతకంటే కావలసింది ఏముందండి .అలా జరిగితే మీకు కృతజ్ఞుడనై ఉంటాను."
"భలేవాడివయ్యా .మా అమ్మాయి కాపురం.మీరు సంతోషం గా ఉంటేనే కదా మేము సంతోషం గా ఉండేది.ఇందులో మా స్వార్ధం కూడా ఉంది"
ఎయిర్ పోర్టుకి భార్య భర్త లిద్దరూ వెళ్ళారు.ఇంటికి వెళ్ళగానే వియ్యంకుడు, వియ్యపురాలు సదరంగా ఆహ్వానించారు."నప్పుడే మనవడి మీద బెంగపడ్డారా?అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు అందుకే"అని వియ్యపురాలు పరిహాసమాడింది.అనిల్ వాళ్ళ కి అలా చెప్పినట్లు ఉన్నాడు.వీళ్ళ ప్రయాణపు బడలికతో ఒక వారం గడిచిపోయింది.ఆ వారం లాంగ్ వీకెండ్ కావడం తో అనిల్ ఆనందరావు గారితో"అంకుల్ ఇక్కడకు టు అవర్స్ దూరంలో మా కజిన్ ఉంటాడు. ఖుందన కు తోడు మీరు ఉన్నారుగా అమ్మా వాళ్ళను అక్కడ కు తీసుకొని వెళతాను
రెండు రోజులు ఉండి వస్తాము ".
"అలాగే వెళ్ళిరండి"అన్నారు.
ఆ రోజు ఉదయం టిఫ్ఫిన్ చేసి అనిల్ వాళ్ళు వెళ్ళారు.రమ కిచెన్ సర్దుతోంది. బాబుని పడుకోబెట్టి వచ్చి కుందన "చెప్పండి డాడీ."అంది.
"ఇలా వచ్చి కూర్చో.బాబు లేస్తే మీ అమ్మ చూసుకుంటుందిలే.నేను చెప్పేది సావధానం గా విను.అసలు నీ సమస్య ఏమిటో పూర్తి గా చెప్పు."అన్నారు.
"అన్నీ మీతో చెప్పానుగా.మళ్ళీ అడుగతారేంటి"అంది విసుగ్గా.
"సరే.అనిల్ పట్టించుకోవడం లేదన్నావు.అలాటివాడైతే మేము వస్తున్నారన్న తెలిసి నీతో పాటు ఎయిర్పోర్టుకి ఎందుకు వస్తాడు.నీ తల్లిదండ్రులు ని గౌరవించాల్సిన అవసరం అతనికి లేదుగా?మేము వచ్చిన దగ్గర నుంచీ నువ్వు ఇండియా కబుర్లు అడుగుతూ మాతోనే ఎక్కువ సమయం గడుపుతున్నావు.అనిల్ కాని అతని తల్లిదండ్రులు కాని ఏమన్నా అన్నారా?అదంతా సహజం అన్నట్లుగా ఉన్నారు.అనిల్ పని ఒత్తిడితో నీకు హెల్ప్ చేయక పోవచ్చు.విజయ పిన్ని బాబాయి ఎలా ఉంటారు .అతను ఏమీ ప్ట్టించుకోకపోయినా మీ పిన్ని ఒంటి చేత్తో కుటుంబాన్ని వదిలేయకుండా లాక్కురాలేదా?అంతెందుకు నాకు కోపం ఎక్కువ అనీ మీ అమ్మ మీద అయినదానికి కానిదానికి కేకలేస్తూ ఉంటానని నీకు తెలుసు కదా!అలా అని మీ అమ్మ్ నన్ను వదిలేస్తే ఈ రోజు నీకు ఇద్దరిలో ఒకరిమే ఉండెవాళ్ళం.పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమా కావాలి.నీ కొడుక్కి తండ్రి ప్రేమ లేకుండా చేస్తావా?తరం వేరైనా భార్యాభర్తల బంధం ఒకటేనమ్మా.ఒకరి మీద మరొకరికి ప్రేమ,విశ్వాసము ఉండాలి.
"కాలేనావరణాత్య యాత్ పరిణతేయత్ స్నేహసారేస్థితం
భద్రం తస్య సు మానుషస్య కధమప్యేకం హితత్ ప్రార్ధ్యతే--"
పెళ్ళి మొదలు మరణం వరకు చెరిగిపోనిది,మోహరహితమైనిది,సుఖదుఖాలలో సమానంగా ఉండేది ,ఒకరి నొకరికి హృదయ శాంతి నివ్వగలిగేది,వయసు మళ్ళినా తరగని అభిమానం కలది,శుభకరమైనది,బాహ్యం కన్నా అంతర్గత ప్రాధాన్యం కలిగి ఉన్నది ఉత్తమ దాంపత్యం.
నూటికి నూరు పాళ్ళు ఉత్తమ దాంపత్యాలు ఉంటాయని కాదు ఉత్తినే ఊడిపోయే కాపురాలు కాకూడదు.ఇద్దరూ వేరు వేరు కుటుంబ నేపధ్యాల నుంచి వచ్చి నప్పుడు తప్పక అభిప్రాయ భేదాలు ఉంటాయి.ఒకే కుటుంబం లో పుట్టిన పిల్లల లో ఏ ఇరువురి స్వభావాలు ఒకలా ఉండవు. అలాంటిది వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చిన వారి మధ్య వైరుధ్యా లుండటం సహజం.మనం అర్ధం చేసుకోవాలి.అనిల్ ని తప్పు పడుతున్నావు.నీ తప్పులు ఏమీ లేవా నువ్వు మీ అత్తగారితో ఎలా వ్యవహరిస్తున్నావు.ఎంతసేపు అతను నీకు చెయ్యలేదు అనుకుంటున్నావే గాని అతనికి నువ్వు ప్రత్యేకించి ఏమి చేస్తున్నావు?ఇతరుల నుంచి మనం ఆశించేటప్పుడు మనం కూడా వారికి ఇవ్వాలి కదా! భర్త ప్రేమంతా నీకే దక్కాలని కోరుకోవడం తప్పు కాదు.తల్లిదండ్రులకు పుత్ర పేమ,కొడుక్కి తండ్రి ప్రేమ ,బంధువులు కి,స్నేహితులకి ప్రేమను పంచాలి.ఎవరి పై ప్రేమ వారిదే.ఇందులో ఎవరి కి ఎవరూ పోటీ కాదు.నిదానంగా ఆలోచించు.నీకే తెలుస్తుంది."
"నువ్వేదో చేస్తావనుకున్నా!ఇది చెప్పడానికి ఇంత దూరం రాయాలనే"అంది కుందన.
"నిజమే ఇవన్నీ నీకు ఫోన్ లోనే చెప్పవచ్చు.కాని అవి పెడచెవిన పెడతావు. ఇలా ప్రత్యక్షం గా చెప్పాను కాబట్టి నేను ఉన్నన్ని రోజులు నేను చెప్పిన విషయాలు గురించి ఆలోచిస్తావు.అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం బలం గా ఉంటుంది.అందుకనే శ్రమ అనుకోకుండా మేము వచ్చింది.కాదు కూడదంటే అప్పుడు నేనే విడాకులు ఇప్పిస్తాను.నీ తప్పుడు నిర్ణయ పాప ఫలం మేమూ భరించాలి కదా!"అని సంభాషణ ముగించి లేచారు ఆనందరావు గారు.కుందన సాలోచనగా తన బెడ్రూము లోకి వెళ్ళింది.
మర్నాడు అనిల్ వాళ్ళు వచ్చారు.కుందన ముభావంగా తన పనులు తను చేసుకుపోతోంది.ఆమెలో అంతర్మధనం జరుగుతోందని గ్రహించిన ఆనందరావు గారు ఇప్పుడు ఏమీ కదిలించకూడదని మౌనంగానే ఉండిపోయారు.అలా ఒక వారం గడిచింది.ఆ రోజు శనివారం ఉదయమే కుందన తాను లేవడమే కాక అందర్నీ లేపి గుడికి బయలుదేరదీసింది. కుందన వైపు చూసారు ఆనందరావు గారు.ఆమె మోము మబ్బులు విడిన ఆకాశం లా ప్రకాశం గా ఉన్నది.ఆమెలో ఉత్సాహం చూసి అనిల్ మామ గారి వంక కృతజ్ఞ్తా పూర్వకంగా చూసాడు.అందరి ఆనందాన్ని చూసి బాబు బోసి నవ్వులు కురిపించాడు.
*******
No comments:
Post a Comment