చర్మ సౌందర్యం కోసం - అచ్చంగా తెలుగు
చర్మ సౌందర్యం కోసం
అంబడిపూడి శ్యామసుందర రావు.    

మనము చర్మ సౌందర్యము కోసము రకరకాల ఉత్పత్తులను వాడుతుంటాము కొన్ని మంచి ఫలితాలను ఇవ్వక పోగా చర్మానికి హాని కలిగిస్తాయి.  చర్మము మన శరీరాన్ని కప్పివుంచే రక్షణ పొర కాబట్టి దీనిని సక్రమముగా ఉంచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ముఖ్యముగా చర్మ రక్షణకు బాహ్యముగా మనము వాడే రకరకాల క్రీములు మొదలైన వాటికన్నా మనము తీసుకొనే ఆహారము ముఖ్యము ఈ ఆహారమే చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది కాబట్టి మనము తీసుకొనే ఆహారము లో ఏ  పదార్ధాలు చర్మాన్నిఏవిధముగా  కాపాడుతాయో  తెలుసుకుందాము  
1. నీరు:- చర్మానికి నీరు చాలా అవసరము నీరు చర్మము ఎల్లప్పుడూ హైడ్రేటెడ్(తడి) గా ఉంచటానికి అవసరము అందుకనే మనము సమృద్ధిగా పరిశుభ్రమైన నీరు త్రాగాలి శరీరములో అన్ని రకాల కణాజాలాలకు నీరు చాలా అవసరము కణములో నీటి శాతము తగ్గినప్పుడు ఆ కణము నిర్జీవ కణము అవుతుంది.నీరు సమృద్ధిగా త్రాగటం వల్ల చర్మము ముడతలు లేకుండా బలిష్ఠముగా ఉంటుంది. 
2. కేరట్ :-కేరట్ లో గల కెరోటినాయిడ్ అనే పదార్ధము చర్మానికి సహజ సిద్దమైన నిగారింపును ఇస్తుంది. ఈ కెరోటినాయిడ్లు చర్మము ఆరోగ్య వంతముగా ఉండేటట్లు చూస్తాయి. 
3.దానిమ్మ:-దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్ ఇంఫలమేషన్ తో పోరాడి వయోవృద్ధిని అంటే చర్మము ముడతలు పడకుండా చూస్తుంది. 
4.ప్రొద్దు తిరుగుడు పూల విత్తనాలు:-వీటిలో విటమిన్ ఈ అధికముగా ఉంటుంది విటమిన్ ఈ చర్మాన్ని సూర్య రశ్మి నుండి కాపాడుతుంది 
5.బీట్ రూట్:-బీట్ రూట్ లో విటమిన్ ఏ ,పొటాషియం,సోడియం,మెగ్నీషియం,క్యాల్షియం వంటి పోషకాలు అధికముగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యవంతమైన చర్మానికి అవసరమైనవి అంతేకాకుండా చర్మానికి తగిలిన గాయాలు మానటానికి ఉపయోగ పడతాయి. బీట్ రూట్ శరీరము మొత్తానికి ఒక క్లినింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. శరీరములోని హానికరమైన పదార్ధాలు తొలగించి కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది
6. గ్రీన్ టీ :-. గ్రీన్ టీ లోని EGCG అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తప్రసరణను వృధ్ది చేసి శరీరములో ఆక్సిజన్ ప్రసరణ బాగా ఉండేటట్లు చూస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన పోషకాలను చర్మానికి అందేటట్లు చేస్తుంది. గ్రీన్ టీ చర్మము  మృదువుగాను స్థితిస్థాపక గుణము కలిగేటట్లు ఉంచుతుంది. ఎండవేడి వాళ్ళ చర్మానికి జరిగే హానిని గ్రీన్ టీ తగ్గిస్తుంది. 
7. టమోటాలు :- కొన్ని వారాలపాటు టమోటాలను ఆలివ్ నూనెతో తీసుకుంటే టమోటాలుసూర్య రశ్మి వల్ల కలిగే సన్ బరన్( ఎండ వేడి వల్ల చర్మము కమిలిపోవటము) నుండి 33% వరకు రక్షణ కలుగజేస్తాయి. టమోటాల లోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మములోని సహజమైన SPF ను వృద్ధి చేస్తుంది. 
8.ఆలివ్ ఆయిల్ :-ఆలివ్ ఆయిల్ మనకు దొరికే ఆరోగ్యకరమైన ఆయిల్ మనము ఈ ఆయిల్ ను వాడటం చాలా శ్రేయస్కరము. దీనిలో ఉండే క్రొవ్వు 75% మొనో సాచ్యురేటెడ్ ఫ్యాటి ఆమ్లాలకు చెందినవి అంతే కాకుండా  దీనిలో చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉంచటానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ పాలిఫెనాల్స్ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ చర్మము ముడతలు పడకుండా ఆపుతుంది అందువల్ల వృద్దాప్యపు లక్షణాలు కనిపించటం ఆలస్యము అవుతాయి. ఆలివ్ ఆయిల్ క్రమము తప్పకుండా వాడితే 31% చర్మము ముడతలు పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. 
9. కాఫీ.:-రెగ్యులర్ గా కాఫీ త్రాగేవారిలో" నాన్-మెలనోమా స్కిన్ క్యాన్సర్ " వచ్చే అవకాశాలు 11% దాకా తగ్గుతాయి. రోజుకు 6 కప్పుల కాఫీ త్రాగేవారిలో 30% దాకా తగ్గుతాయి కానీ ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు అందువల్ల ఎక్కువ కాఫీ త్రాగటము అంత శ్రేయస్కరము కాదు 
10. డార్క్ చాకొలేట్ :-సాధారణముగా డార్క్ చాకొలేట్ బరువు పెంచుతుందని ఒక నమ్మకము,కానీ ఈ డార్క్ చాకొలేట్ చర్మానికి మంచి బాగా ఉపయోగిస్తుంది. దీనిలోని కోకో ఫ్లవనాయిడ్స్ చర్మానికి తేమను అందిస్తాయి,శరీరానికి రక్త ప్రసరణను అభివృద్ధి చేస్తాయి. అందువల్ల డార్క్ చాకొలేట్ చర్మానికి మంచి చేస్తుంది. 
***

No comments:

Post a Comment

Pages