ఎదుర్కొన్నప్పుడే - అచ్చంగా తెలుగు
ఎదుర్కొన్నప్పుడే........
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

ఏ సమస్యనైనా ఎదురేగి ఎదుర్కొన్నప్పుడే,
ఆ సమయంలో నీలోసాహసం ఉట్టిపడి,
నీ ఆశయం గట్టి పడుతుంది,
పరిమితిలేని పట్టుదలతో పిడికిళ్ళు బిగించి,
నీ సంకల్పం కదం తొక్కినప్పుడే,
వీరత్వం నీవెన్ను చరిచినప్పుడే, 
విజయపధం నీముందు నిలుస్తుంది.
గాలికి కొట్టుకొని పోవటానికి, 
గాలి తిరుగుళ్ళుతిరగటానికి కాదు 
నీ ఈ జీవితం.
సుడిగాలిలా చెలరేగి నప్పుడే,
నీ సంకల్పం సాకారమౌతుంది. 
జడివానలా చుట్టేసినప్పుడే
విజయం నీకు ప్రాకారమౌతుంది  
ఒకే నిర్ణయంతో నీ మది నిండినప్పుడే
ఏ వికల్పమైనా నిన్ను చూసి భయపడుతుంది.
వైఫల్యాలను మరచి,వైషమ్యాలవెన్నువిరిచి, 
నీ మనసు కర్తవ్యంలో లీనమైనప్పుడే 
జీవితం నవ్యమౌతుంది, 
దివ్యమౌతుంది, ధన్యమౌతుంది. 
***  
                                                     

No comments:

Post a Comment

Pages