బాల్యం---నేను
వై.ఎస్.ఆర్.లక్ష్మి
వయసు నీది
ఆలోచనాసాగరం లో మునిగి తేలుతున్న
మనసు నాది
పాపం, పుణ్యమేమీ అంటని
స్వచ్చత నీది
ఏర్ష్య,అసూయ అహంకార పూరిత
మకిలి నాది
మురిపాల ముద్దులొలుకు
తేనె ఊటలు నీవి
తేనె పూసుకొని విషం దాచుకున్న
పలుకులు నావి
ఎచటెచటికో ఎగిరే సీతాకోకచిలుక
స్వేచ్చా పయనం నీది
యాంత్రికమై బంధాల సంకెళ్ళు పడిన
బానిస బ్రతుకు నాదిe
మధుర స్వప్నాల ఓలలాడే
మనసు నీది
అణగారిన కోరికలతో అలమటించు
నిస్సహాయిత నాది
తప్పటడుగుల తో తడబడు
నడక నీది
తప్పు టడుగుల తో తడబాటు
నడత నాది
రంగులరాట్నం లా అందర్నీ చుట్టూ
తిప్పుతావు నువ్వు
గానుగెద్దులా జీవిత రాటన
తిరుగుతాను నేను
ఎదగాలనే తొందరతో
అనుకరిస్తావు మమ్ము
ఏళ్ళు గడిచిపోతున్నాయనే వేదనతో
అనుక్షణం నేను
శైశవ మాధుర్యం ఆస్వాదించే
బాల్య చేష్టలతో నువ్వు
తిరిగిరాని బాల్యం కోసం నిట్టూర్పులు విడుస్తూ
అధోన్ముఖుడునై నేను
***
No comments:
Post a Comment