నీరాజనం - అచ్చంగా తెలుగు
నీరాజనం
దినవహి సత్యవతి

అందాలొలికే  అచ్చులు, సొగసులు చిలికే హల్లులు
సున్నితమైన ఒత్తులు, రాగాలుపలికే  దీర్ఘాలు,
సర్గ విసర్గలు..ఆభరణాలుగా అలంకృతయై 
దేశభాషలందు లెస్సయై వెలుగుతున్న ‘తెలుగు భాష’

చదువరులకు  కనులకు ఇంపై, శ్రోతలకు శ్రవణానందకరమై
ఉఛ్ఛారణలో  ముత్యాల సరమై, నేర్చుటకు బహు సరళమై
నేర్వదగిన భాషయనే భావన ఎల్లరి మదిలో  నింపే సొంపైన 
తీపి తీపి తెలుగు భాష మన తేట తేనెల  ‘తెలుగు భాష’

తెలుగు భాషను నేర్చి, నేర్పించి తెలుగు భాషా ప్రాసశ్త్యాన్ని
 తెలుగు భాష కీర్తిని నలు దిశలా వ్యాపింప చేద్దము !
గళం కలుపుదాము తెలుగులో కలం కదిలించుదాము
తెలుగు తల్లికిద్దాము తెలుగు వెలుగుల  ‘నీరాజనం’

No comments:

Post a Comment

Pages