శ్రీధరమాధురి - 54
(మతం గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు)
చెప్పినవిధంగా నడుచుకోని అనేకమంది
విద్యార్హతలున్న పండితులను నా అనుభవంలో నేను చూసాను. వారు మాటల వరకే బాగా చెప్తారు,
పని విషయంలో మాత్రం కాదు.
ఇటువంటి వారు ఇతరుల తల్లిదండ్రులను
తమవారిగా చెప్పుకోవడంలో ఆనందాన్ని పొందవచ్చు, కాని ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రులకే
ఎక్కువ గౌరవాన్ని ఇవ్వాలి. ఇలా చెయ్యలేనప్పుడు ప్రత్యామ్నాయంగా వారు స్వీకరించిన
తల్లిదండ్రులతో వారికున్న అనుబంధాలన్నీ బూటకాలు, అప్రతిష్టను తెచ్చిపెట్టేవే.
ఆశని, నమ్మకాన్ని డబ్బుతో ముడి
పెట్టి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని మతాల వారు ఎల్లప్పుడూ ప్రజలను మభ్య పెట్టడం చాలా శోచనీయం. నమ్మకాన్ని ఆశతో ముడి పెడితే, మీ
ఆశలు ఫలిస్తాయనే మీరు నమ్మకాన్ని కలిగి ఉంటే, అది కేవలం దైవం పేరుతో చేసే
వ్యాపారమవుతుంది.
ఆశ అనేది ఏదైనా జరుగుతుందనో, లేక
జరగదనో పెట్టుకునే భవిష్యత్ పరమైన కోరికైతే, నమ్మకం అనేది భగవంతుడి పట్ల ప్రస్తుతంలో,
భవిష్యత్తులో ఏం జరిగినా కూడా పరిపూర్ణ శరణాగతి, ఆమోదం.
మీరు ఔత్సుకతతో, జిజ్ఞాసతో ఉంటూ, మతంలో
తర్కాన్ని ఆశిస్తూ ఉన్నట్లయితే, అది ‘నమ్మకం లేకపోవడాన్ని’ సూచిస్తుంది.
ఈ రోజున మతం అన్నది మత సంరక్షకులు
వడ్డించే ఆశల వల్లనే జీవిస్తోంది. మతం అంటే భక్తి, దీనికి ఆధారం దేవుడిపట్ల పరిపూర్ణమైన,
బేషరతైన నమ్మకం. మతం అనేది సమాజంలోని అన్ని వర్గాల మధ్య సమైక్యతను తీసుకుని
రావాలి, పేదల పట్ల, అవసరార్దుల పట్ల శ్రద్ధ వహించే, నిస్వార్ధమైన సమాజ స్థాపనకు
కృషి చెయ్యాలి. ఆశ అనేది స్వార్ధంతో కూడుకుని, అన్ని రకాల భవిష్యత్ పరమైన కోరికలకు
ఊతమిస్తుంది. అందుకే మత సంరక్షకులు నమ్మకంలో,ప్రార్ధనలలో నిబంధనలు లేకపోవడాన్ని, దైవం
పట్ల ప్రేమను ఆచరించే వారిలో పాదుకొల్పేందుకు కృషి చెయ్యాలి. ఆశించడం అనేది కోరికలకు
దారి తీస్తుంది, దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మీరు మతపరంగా ఉన్నారంటే, దానికి
అర్ధం...
మీకు అహంకారం, స్వార్ధం లేదని.
మీకు కోపం, ద్వేషం కలుగవని.
మీకు అసూయ, ఇతరులతో పోటీ అనేవి
లేవని.
మీకు భయం లేదని.
మీరు జీవితాన్ని ఎలా మళ్ళినా
ఆమోదిస్తారని.
మీరు బాగా పనిచేస్తూ, ఫలితాలను
గురించి ఎన్నడూ ఆలోచించరని.
మీరు ఎల్లప్పుడూ దైవాన్ని
ప్రేమిస్తారని.
మీ జీవితం పూర్తిగా సేవా దృక్పధంతో
ఉందని, పూర్తిగా ఇతరుల బాగుకే అంకితమై ఉందని.
మీకు స్వార్ధం లేదని.
మీరు సమాజంలో శాంతి సామరస్యాల
స్థాపనకు కృషి చేస్తారని.
మీరు ప్రశాంతంగా, నిశ్చలంగా
ఉంటారని.
తర్కం, కారణాలు వెతకడం అనేవి
మతాన్ని పాడుచేయడం అన్నది శోచనీయం.
తర్కం, కారణాలు వెతకడం అనేవి
బుద్ధి నుంచి జనిస్తాయి, అందుకే విజ్ఞాన శాస్త్రం వాటికి సమీపంగా ఉంటుంది.
ప్రేమ, స్వేచ్చ అనేవి హృదయం నుంచి
జనిస్తాయి, అందుకే మతం అనేది వాటికి సమీపంగా ఉంటుంది.
పంచుకోవడమే జీవనం. పంచిపెట్టడం
మీకు స్పూర్తి కావాలి. పంచిపెట్టడమే మీ ఆత్మ కావాలి. పంచిపెట్టడం ఉత్తమమైన భక్తి
చర్య, అదే మీ మతం కావాలి.
లౌకిక జీవనంలో విఫలమావ్వడం వలన
మతంలోకి పరుగులు తియ్యకండి. ఆధ్యాత్మికత అంత చవకబారు వస్తువు కాదు. లౌకికమైన
ప్రయోజనాలను ఆశించి, మతంలోకి పరుగు పెట్టకండి. భౌతిక జగతి అంతమైనప్పుడే ఆదిభౌతిక
(అలౌకిక) జగతి మొదలవుతుంది.
ఈ లోకంలో అనేక మతాలున్నాయి. అనేక
ఆలోచనల గురుకులాలు ఉన్నాయి. అన్ని దారులు ‘నిర్వాణ’ వైపే సాగుతాయి. అన్ని దారులు
దైవం వైపే వెళ్తాయి. ప్రతి గురువుకు, తాను చెందిన గురుకులం గురించి
ఉద్ఘాటించేందుకు తనదైన మార్గం ఉంటుంది. దానికి అర్ధం ఇతర గురుకులాలు తక్కువవనీ
కాదు, వాటిని ఆచరించేవారు అనాగారికులనీ కాదు. ఏ నిజమైన గురువూ, మానవాళిని
విభజించాలని కోరుకోరు, వారి మార్గం అత్యంత దైవత్వంతో కూడుకుని ఉంటుంది. ఒక
గురుకులానికి అంటి పెట్టుకుని ఉండండి. ప్రశ్నించనలవికానంత విశ్వాసాన్ని కలిగి
ఉండండి. గురువు బాటనే అనుసరించండి. దైవంతో ఐక్యమయ్యే ‘నిర్వికల్ప సమాధి’ అనే
స్థితిని సాధించండి.
***
No comments:
Post a Comment