శ్రీరామకర్ణామృతం - సిద్ధకవి
డా.బల్లూరి ఉమాదేవి
11.శ్లో: రక్తం భోరుహలోచనం కువలయ శ్యామం కపోలం ధనుః
కోటి న్యస్త కరాంబుజం తను
త్రాణం జటామండితమ్
జేతారం ఖరదూషణ త్రి శిరసా మాబద్ధ గోదాంగుళీ
త్రాణం మార్గణ పూర్ణ తూణ యుగళం కోదండ రామం భజే
భావము: ఎర్ర తామర ల వంటి కన్నులు కలిగినట్టియు నల్ల కలువలు వలె
నల్లనై నట్టియు బ్రహ్మను పరిపాలించు నట్టియు ధనస్సు యొక్క గ్రమందుంచబడిన హస్త
పద్మము కలిగినట్టియు ధరించ బడిన కవచము కలిగినట్టియు జటల చేత అలంకరింపబడినట్టియు ఖర
దూషణ త్రిశరులను జయించినట్టియు కట్టబడిన యుండుము తోలు వ్రేళ్ళ తొడుగు గలిగినట్టియు
బాణములచే నిండిన అంబులపొదుల జోడు గలిగినట్టియు ధనుర్ధారి అయిన రాముని
సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ: శర సంపూర్ణ నిషంగియై కవచియై శ్యామాంగుడై విశ్వసృ
డ్గురుడై శోణ సరోజనేత్ర యుగుడైై గోదాంగుళీ త్రాణుడై
ఖరముఖ్యాసుర
యూథసంహరణుడై కాండాసనాగ్ర స్ఫుర
ద్గురుహస్తండగు నాజటిన్
గొలిచెదన్ గోదండరామప్రభున్.
12.శ్లో:శ్రీమత్కల్పద్రుమూలో సకలమణిమయే మండపే పుష్పకాఖ్యే
తన్మధ్యే సూర్యబింబ ద్యుతి
సరసిరుహే శోభమానష్టపత్రే
పశ్యన్నిష్టాంగదీప్త్యా
జనక తనయాయ వామభాగోప సేవ్యః
సఁమిత్రిః భాను పుత్రం పవనసుతయుతం పాతుమాం రామచంద్రః.
భావము:శోభగల కల్పవృక్షమురనెదుట నవరత్న వికారమైనట్టి పుష్పకమనునట్టి
మండపమందు దానినడుమ ప్రకాశించుచున్న ఎనిమిది రేకులుగల సూర్యబింబ కాంతిగల
పద్మమందున్నట్టియు ఇష్టమైన శరీర శోభగల సీతాదేవిచే నెడమవైపున సేవించదగినట్టియు
నాంజనేయునితో కూడిన లక్ష్మణుని,సుగ్రీవుని జూచు చున్నట్టి
రామచంద్రమూర్తి నన్ను రక్షించు గాక.
తెలుగు అనువాదపద్యము:
చ:సురతరుమూల నూత్నమణి శోభిత మండప మధ్య పుష్ప కాం
తర రవి దీపితాష్టదళ
తామరసాంతర వాసియై ధరా
వరసుత వామ భాగమున భాసిల లక్ష్మణ వాయుజాది స
త్పురుష సమర్చితుండయిన భూపతి రాముడు నన్ను బ్రోవుతన్.
13.శ్లో:వినీల జలదోపమం విమల చంద్ర బింబాననం
వినిద్ర మణి కుండలం
వికచ పుండరికేక్షణమ్
విభిన్న దనుజాధిపం
విధుత బాణబాణాసనం
విభీషణ వరప్రదం విజయ
రామ మీడే నిశం.
భావము:
తెలుగు అనువాదపద్యము:
మ:హరి నీలాంబుద గాతఅరం తామరస పత్రాక్షున్ శరచ్చంద్ర భా
సుర రక్త్రున్ మణికుండలాంచితు ధనుస్తూణి ర బాణోజ్జ్వలున్
సుర విద్వేషణ పోషణాంతకృ మునిస్తుత్యున్ దశ గ్రీవ సో
దర సమ్మోద విదాయకున్ వరదు సీతారాము.జింతించెదన్.
14.శ్లో:రాజద్రాజీవ నేత్రం రఘుకుల తిలకం రంజితాశేష లోకం
వామాంకారూఢ సీతం వరశర ధనుషం కుండలోద్దీప్తగండమ్
శ్యామం శాతం ప్రసన్నం దరహసిత ముఖం వజ్రసింహాసనస్థం
రామం రాజత్కిరీటం రవిశతవిశదం రాజరాజేశ మీడే.
భావము: ప్రకాశించుచున్న పద్మమువంటి నేత్రములు గలిగినట్టియు రఘువంశ
శ్రేష్ఠుడైనట్టియు ప్రకాశింప చేయబడు నెల్ల
లోకములకు గలిగినట్టియు నెడమతొడపై కూర్చొన్న సీత కలిగినట్టియు శ్రేష్ఠమైన
ధనుర్బాణములు గలిగినట్టియు కుండలములచే ప్రకాశించుచున్న గండస్థలములు గలిగినట్టియు నల్లనైనట్టియు
శాంతుడైనట్టియు ప్రసన్నుడైనట్టియు మందహాసముఖము గలిగినట్టియు వజ్రసింహాసనము
నందున్నట్టియు ప్రకాశించుచున్న కిరీటము గలిగినట్టియు సూర్యశతమువలె ప్రకాశమానుడైనట్టియు రాజరాజుల కధిపతియైనట్టియు
రాముని స్తుతించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
సరసిజు నేత్రు జాపధరు శాంత ప్రసన్ను దరస్మితాస్యు భా
స్కరకులు లోకరంజితు బ్రకాశ
కిరీటు సువర్ణకుండలున్
ధరణిసుతావలోకను పతంగ
శతోజ్జ్వలు వజ్రపీఠు గం
ధర నిభ నీలు రాజవర దాశరథిన్
శరణంబు వేడెదన్.
15.శ్లో:భద్రవ్యాఖ్యాన సముద్రాం కరసరసిరుహే దక్షిణే ధారయంతం
సవ్యే జానున్యుదారం కరమపిచ
ముదా ధారయంతం స్ఫురంతమ్
పశ్యంతం వామభాగే కరధృతకమలాం చిత్ర భూషా విశేషాం
వైదేహీం కాంచనాఢ్యాం స్తన భర నమితాం భావయే రామచంద్రమ్.
భావము:కుడి చేతియందు మంగళమగు నుపదేశ ముద్రను ధరించినట్టియు నెడమ
మోకాలి యందు గొప్పది యగు హస్తమును సంతోషముచే ధరించి నట్టియు, ప్రకాశించుచున్నట్టియు, చేత
ధరించబడిన పద్మము గలిగినట్టియు చిత్రములైన యలంకార విశేషములు గలిగినట్టియు బంగారు
చేత నొప్పునట్టియు స్తన భారము చేత వంగిన సీతను చూచు చున్నట్టియు రామచంద్రుని
ధ్యానించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:ఒక హస్తాబ్జము జానువందనుచి వేరొక్కంట వ్యాఖ్యాన ము
ద్రకరంబూని
సువర్ణ వర్ణ ధృత పద్మున్ జిత్రభూషాన్వితున్
బ్రకటోరఃస్థల జాత నమ్రయగు భార్యన్ దాపలం గాచు తా
రక నామున్ రవికోటి ధాముడగు శ్రీరామున్ బ్రశంసించెదన్.
16.శ్లో:విబుధ విటపీ మూలే జానకీ లక్ష్మణాభ్యాం
సహిత మనిల వేగం
బాణమాదాయ చాపమ్
బహుశర పటు తూణం
రమ్యపుష్పోప హారం
విబుధ భరణ చిత్తం
జింతయే రామచంద్రమ్
భావము:కల్పవృక్షము యొక్క మొదట సీతా లక్ష్మణులతో గూడినట్టియు
వాయు వేగము గల బాణమును ధరించి
విస్తారమైన బాణముల చేతమర్థమైన యంబులపొది గలిగినట్టియు సుందరమైన పువ్వుల కానుక
గలిగినట్టియు విద్వాసులను భరించుట యందు మనసు నిలిపి నట్టియు
రామచంద్రుని ధ్యానించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:అమరాగ స్థలి ధారుణీ తనయతో హర్షంబునన్ గూడి స
త్సుమ దామాంచితుడై యనేక
శరసంశోభానిషంగాస్త్రుడై
యమర త్రాణ ధురీణుడై పవన
వేగాజిహ్మ గోగ్రాస్తుడై
కమనీయాకృతి యైన
రామధరణీకాంతున్ మదిన్ గొల్చెదన్.
17.శ్లో: జానాతి రామ తవ తత్త్వ
గతిం హనూమాన్
జానాతి రామ తవ
సఖ్యగతిం కపీశః
జానాతి రామ
తవయుద్ధగతిం దశాస్యో
జానాతి రామ ధనదానుజ
ఏవ సత్యమ్.
భావము: ఓరామా! నూతత్త్వమార్గమును హనుమంతు డెరుగును.ఓ రామ
నీస్నేహమార్గమును సుగ్రీవు డెరుగును. ఓరామా నీ యుద్ధ మార్గమును రావణు డెరుగును.ఓరామా నీ సత్యమును విభీషణు
డెరుగును.
తెలుగు అనువాదపద్యము
ఉ:తావక మిత్ర భావమును తామరసాప్తసుతుండెరుంగు మీ
పావన తత్త్వ లక్షణము పావక
మిత్ర సుతుం డెరుంగు ధా
త్రీవర నీదు సంగర గతిం
దశకంఠు డెరుంగు భక్త లో
కావన నీదు సత్యము దశాస్యుని తమ్ము డెరుంగు రాఘవా.
18.శ్లో:హే రామ హే రమణే జగదేక వీర
హే నాథ హే రఘృపతో కరుణాల వాల
హే జానకీరమణ హే జగదేక బంధో
మాంపాహి దీన మనిశం కృపణం
కృతఘ్నమ్.
భావము:ఓ రామా !ఓమనోహరుడా !ఓ
జగత్తులయందు ముఖ్య వీరుడా!ఓ రఘుపతీ !ఓ దయాకరుడా!
!ఓ సీతాపతీ!ఓ జగత్తులకు ముఖ్య బంధుడా !దీనుడ నైనట్టియు
కృతఘ్నుడైనట్టియు నన్ను నెల్లప్పుడు
రక్షింపుము.
తెలుగు అనువాదపద్యము:
శా: ఓ రామా జగదేక వీరరమణా యో జానకీ నాయకా
యో రాజేంద్ర కృపాల వాల
వరదా యో విశ్వ విశ్వావనా
యో రాజీవ దళాక్ష యో రఘుపతే
యో నాథ మన్నింపు నా
నేరంబేను గృతఘ్నుడన్
గృపణుడన్ నిన్నే మదిన్నమ్మితిన్.
19.శ్లో:అయోధ్యనాథ రాజేంద్ర సీతాకాంత జగత్పతే
శ్రీరామ పుండరీకాక్ష
రామచంద్ర నమోస్తుతే.
భావము:ఓ అయోధ్యాపతీ !ఓ రాజశ్రేష్ఠా !ఓ సీతాపతీ! ఓజగదీశ్వరా
!ఓశ్రీరామా ఓపద్మ నేత్రుడా! ఓ రామచంద్రా
నీకు నమస్కారము!
తెలుగు అనువాదపద్యము:
మ:స్థిర సాకేత పురాధినాథునకు ధాత్రీపుత్రికాభర్తకున్
ధరణీజేంద్రునకున్
జగత్పతికి ద్త్యధ్వంసికిన్ సవ్య వి
స్ఫురితా మ్భోరుహ పత్ర
నేత్రునకు దేజోరాశికిన్ బాప ని
స్తరికిన్
శ్రీరఘురామచంద్రునకు నశ్రాంతంబు నే మ్రొక్కెదన్.
20శ్లో: దక్షిణో లక్ష్మణో ధన్వీ వామతో జానకీ శుభా
పురతో మారుతీర్యస్య
తన్నమామి రఘూత్తమమ్.
భావము: ఏరామునకు కుడివైపున ధనుర్ధారి యగు లక్ష్మణుడును, ఎడమవైపున మంగళ స్వరూపురాగు సీతయును ముందు హనుమంతుడునో గలరో అట్టి
రాముని నమస్కరించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము
ఉ:దాపట జానకీపతి ముదంబున నుండగ దక్షిణంబునన్
జాపము దాల్చు లక్ష్మణుడు
సన్నుతి జేయ బురోప కంఠమం
దా పవనాత్మజుండు వినయంబున
గొల్వ జెలంగునట్టి ధా
త్రీ పరిపాల శీలునకు శ్రీరఘురామునకేను మ్రొక్కెదన్.
(సశేషం )
No comments:
Post a Comment