ప్రపంచాన్ని ప్రభావితము చేసిన కొంత మంది గొప్ప మేధావులు
అంబడిపూడి శ్యామసుందర రావు.
సరిఅయిన ఉపాధ్యాయుడు లేకుండా పిల్లలను జ్ఞావంతులుగా చేయటము కష్టము పిల్లలనే కాదు పెద్దలను కూడా జ్ఞావంతులుగా చేసి సమాజాన్ని సక్రమముగా నడిపించటంలో గురువులపాత్ర ఏంతో వుంది అంటే గురువు తన భోధనలను తరగతి వరకే పరిమితము చేయనవసరం లేదు ఆ విధముగా తరగతి దాటిన వారి బోధనలు సమాజము పై ప్రభావాన్ని చూపి సమాజాన్ని సరి దిద్దటంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ప్రపంచవ్యాప్తముగా సమాజానికి సమాజ శ్రేయస్సుకు పాటుపడిన గురువులు ఎంతమందో వారిలో కొంతమంది గురించి వారి బోధనలు సమాజానికి ఏవిధముగా మేలు చేసినాయి అన్న విషయాలను తెలుసుకుందాము. ఈ విధముగా తెలుసుకోవటం వల్ల నేటి ఉపాధ్యాయులు కూడా సమాజాభి వృద్ధి వారి వంతు కృషి చేయటానికి అవకాశము ఉంటుంది.
1.కన్ఫ్యూషియస్ (551-479 BC):- ఈయన చైనాకు చెందిన,సాంఘిక తత్వవేత్త, మంచి ఆలోచనాపరుడు. ఈయన ప్రభోదాలు చైనీయులను,జపాన్ వారిని, కొరియన్లను,వియత్నాం వారిని చాలా మటుకు ప్రభావితము చేశాయి. అయన లోతైన వేదాంత ధోరణుల వల్ల అయన ప్రభుత్వ మరియు వ్యక్తిగత నీతి నియమాలకు ఒక బలమైన ప్రచారకుడిగా పనిచేశాడు ఈయన భోధనలన్నీకన్ఫ్యూషనిజం అనే వేదాంత ధోరణులకు దారితీసాయి.
2. అరిస్టాటిల్ (384-322బిసి )గ్రీకుకు చెందిన గొప్ప ఫిలాసఫర్లలో (వేదాంతులలో)అరిస్టాటిల్ ఒకడు. ఇతను ప్రముఖ తత్వవేత్త ప్లేటో శిష్యుడు, ఆతరువాత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి అలెగ్జాన్డర్ గురువు గా ప్రఖ్యాతి చెందాడు. అయన ఆలోచనలు,ప్రపంచములో సాగుతున్న ధోరణులు అన్ని కలిసి అయన జీవితాంతము ప్రపంచానికి అనేక విషయాలలో విలువైన సమాచారాన్ని అందించాడు ఈయన పద్య రచన, భౌతిక శాస్త్రము,మెటాఫిజిక్స్ జీవ శాస్త్రము ,జంతు శాస్త్రము,రాజకీయ శాస్త్రము,తర్కము,సంగీతము వంటి ఎన్నో అంశాలపై విలువైన సమాచారాన్ని ప్రపంచానికి అందించాడు.మొత్తము మీద చెప్పాలంటే అయన వ్రేలు పెట్టని శాస్త్ర విభాగము లేదు. .
3.జాన్ అమోస్ కోమెనియాస్(1592-1670) :-ఈయన మోరేవియన్ ఉపాధ్యాయుడు, బోధకుడు,శాస్త్రవేత్త.ఈయన వ్యక్తిగతముగా గొప్ప మత ప్రభోధకుడు. అయన జీవితాంతము మోరేవియన్ ప్రొటెస్టబ్ట్ బిషప్ గాను,ఒక మత శరణార్థిగాను కొనసాగేడు. ఈయనకు "డిడాక్టిక మాగ్నా" అనే గ్రంధము మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ గ్రంధములో అయన యూనివెర్సల్ ఎడ్యుకేషన్( అంతర్జాతీయ విద్య) అవసరము గురించి వివరిస్తాడు.
4.జాన్ లాక్ (1632-1704):- ఈయన బ్రిటీష్ డాక్టరు మరియు తత్వవేత్త. ఈయన నమ్మిన సిద్ధాంతము విద్యార్థులకు చదువుల ముందు క్యారెక్టర్ (శీలము) ను బోధించాలి అని. ఈయన వ్రాతల్లో మంచి నడవడి శీలము,ప్రాపంచిక చదువులను ఏవిధముగా అధిగమిస్తుందో వివరిస్తూ చివరికి రెండు అవసరమే అని తన బోధనల ద్వారా తెలియజేస్తాడు. చదువు మంచి నడవడి రెండు మనిషికిసమాజము ముందుకు నడవటానికి అవసరమే అని అయన ప్రభోధనలు లోకానికి తెలియజేశాయి.
5.ఫ్రెడరిక్ ఫ్రొబెల్ (1782-1852):- జర్మన్ అధ్యాపకుడు,శిక్షకుడు,బోధకుడు అయన ఫెడెరిక్ ఒకనాటి పేస్టలోజి శిష్యుడు. పేస్టలోజి ప్రస్తుత నవీన విద్యావిధానానికే పునాది లాంటివాడు పరిశోధనల అనంతరము ప్రతి విద్యార్థి తనకంటూ ప్రత్యేకమైనసామర్ధ్యాలు నేర్చుకోవటానికి కొన్ని అవసరాలు ఉంటాయని గుర్తించాడు. ఈయన ప్రాధమిక విద్యాభ్యాసము యొక్క ఆవశ్యకతను గుర్తించినవీన కిండర్ గార్దన్ విద్యావిధానాన్ని అభివృద్ధి చేశాడు
6. హేన్రి డేవిడ్ థోరు 1817-1862):- థోరు అమెరికన్ రచయితా,కవి చరిత్రకారుడు,తత్వవేత్త,మరియు సర్వేయర్. ఈయన తన పుస్తకము "వాల్డెన్"ద్వారా బాగా ప్రాచుర్యము పొందాడు. ఈ పుస్తకములో అయన సహజ వాతావరణములో సాధారణ జీవితాన్ని గడపటానికి అవసరమైన గుణాలను వివరిస్తాడు. ఈయన వ్యాసాలూ, కవిత్వము,జర్నల్స్ మొదలైనవి సుమారు 20 భారీ సంపుటాలు గా వెలువడ్డాయి ఈ సంపుటాలు ప్రపంచవ్యాప్తముగా ఎందరినో ప్రభావితము చేశాయి.
7 బుకర్ టి వాషింగ్టన్ (1856-1915):- ఈయన ప్రముఖ అమెరికన్ ఎడ్యుకేటర్,రాజకీయ నాయకుడు ,రచయిత ,మంచి వక్త మరియు అమెరికాలోని ఆఫ్రికన్ అమెరికన్ కంమ్యూనిటీలో మంచి పేరున్న ప్రతిభాశాలి ఈయన నల్లజాతీయుల బానిసల ఆఖరి తరము నుండి వచ్చి జాతి వివక్షత కు వ్యతిరేకముగా అమెరికాలో జరిగిన సివిల్ రైట్స్ ఉద్యమములో పాల్గొన్న వ్యక్తి.
8. నోహ్ వెబ్స్టర్ (1758-1843):-ఈయన అమెరికాలోని పాఠ్య పుస్తకాల రచయిత, నిఘంటుకర్త (డిక్షనరీ తయారుచేసినవాడు),స్పెల్లింగ్ లను సంస్కరించినవాడు ,సంపాదకుడు మరియు ఔత్సాహిక పదకర్త, అన్నిటి కన్నా గొప్ప విషయము ఈయన "ఫాథర్ ఆఫ్ అమెరికన్ స్కాలర్షిప్ అండ్ ఎడ్యుకేషన్ " గా గుర్తింపు పొందాడు. ఈయన ముందు అమెరికన్ విద్యార్థులు ఐదు తరాలుగా " బ్లు బ్యాక్డ్ స్పెల్లర్ " పాఠ్య పుస్తకాలను ఇంగ్లిష్ నేర్చుకోవటానికి చదువుతుండేవాఋ ఈయన స్పెల్లింగ్ సిస్టం లో తెచ్చిన మార్పుమొత్తము అమెరికన్ విద్యావిధానం లోనే పెను మార్పు తెచ్చింది అందుకనే వెబ్స్టర్ డిక్షనరీలో ఇంగ్లిష్ పదాలకు స్పెల్లింగులు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లోని పదాలకు భిన్నముగాను, సులువుగాను ఉంటాయి.
9.ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955):-ఈయన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, థియరీ ఆఫ్ రెలెటివిటి వంటి ముఖ్యమైన సిద్ధాంతాన్ని ఇంకా ఇతర సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త. ఇంకో రకముగా చెప్పాలంటే న్యూటన్ తరువాత అంత పేరు ప్రఖ్యాతులు గడించిన శాస్త్రవేత్త. 1921లో ఈయనకు నోబెల్ ఫ్రీజ్ భౌతిక శాస్త్రములో ఫోటో ఎలెక్ట్రిక్ లా కనుగొన్నందుకు ఇచ్చారు. శాస్త్రవేత్తగానే కాకుండా గొప్ప మానవతా వాదిగా పేరు పొందిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ .మంచి సంగీత విద్వాంసుడు కూడా.
10. ఆయిన్ రాండ్ (1905-1982):- ఈయన ప్రముఖ రష్యన్ అమెరికన్ తత్వవేత్త నవలాకారుడు,నాటక రచయిత ఈయన వ్రాసిన పుస్తకాలలో రెండు బాగా ప్రాచుర్యము పొందినాయి అవి,"ద ఫౌంటెన్ హెడ్ ",అట్లాస్ ష్రాగ్గడ్". ఈయన అబ్ జెక్టివిజం అనే కొత్త ఫిలాసఫికల్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాడు,ఆ సిస్టం ప్రస్తుతము ప్రపంచవ్యాప్తముగా ప్రభావితము చేస్తుంది.
***
No comments:
Post a Comment