పర్యావరణం - అచ్చంగా తెలుగు
పర్యావరణం
పెయ్యేటి రంగారావు


'నాయనలారా!  వినాయకచవితి ఉత్సవాలకి మీరు ప్లేస్టర్ ఆఫ్ పేరిస్ విగ్రహాలు కొనకండి.  కేవలం మట్టితో చేసిన విగ్రహాలే కొనండి.'
'ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎవరన్నా తీస్తున్నారా?'

'దానికీ దీనికీ సంబంధం ఏమిటి నాయనా?'

'మీరు సినిమాలే బ్లాక్ అండ్ వైట్ చూడడానికి ఇష్టపడటల్లేదు.  మేము ఆరాధించే వినాయకుడిని, ఒక మట్టిముద్దతో రంగులు లేకుండా, ఏవిధమైన అలంకారాలు లేకుండా తయారుచేస్తే, ఆ అ విగ్రహానికే మేము పూజలు చేయాలా?  మీ కార్యాలయాల్లో మీరు పెట్టుకునే మీ పార్టీనాయకుల ఫొటోలు కూడా రంగుల్లోనే పెట్టుకుంటున్నారే?  రోడ్ల కూడళ్ళలో, ట్రాఫిక్ కి భంగం కలిగేలా మీరు నిలబెట్టే మీ పార్టీనాయకుల, దేశనాయకుల విగ్రహాలు కూడ మట్టితో తయారుచేయించకుండా, రంగులతో చేయిస్తున్నారే?'
'ఆ విగ్రహాలను మేము నదుల్లో నిమజ్జనం చేయటల్లేదు కదా నాయనా?'
'బాబ్బాబూ, చేసేద్దురూ!  చూడలేక చస్తున్నాం.'
మేము పర్యావరణం గురించి మాట్లాడుతున్నాము నాయనా!'
'సరే, దానికే వస్తాను.  మేము ఇళ్ళలో పెట్టుకుని పూజలు చేసే చిన్న విగ్రహాల గురించి సలహాలు గుప్పిస్తున్నారే?  ఏ ఏడాదికాయేడు ఎత్తు పెంచుకుంటూ పోయి, కూడళ్ళలో పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్న వారిని అలా చేయవద్దని మీరు వత్తిడి తీసుకురాలేరా?  అక్కడ మీ నాయకులే వచ్చి పెద్దగా ఆర్భాటాలు చేస్తారే?'
'......................'
'సరే, పోనీండి.  ఒక్కొక్క పాయింటుకే వద్దాము.  పర్యావరణ పరిరక్షణ అంటున్నారు.  ప్లేస్టిక్ ని నిషేధించాలి అంటున్నారు.  అంటూనే, మళ్ళీ అందులే గ్రేడింగ్స్ ఎందుకు?  మీరు సంచులు నిషేధించాము అంటున్నారు.  మరి విచ్చలవిడిగా రోడ్డుపక్కన అన్ని దుకాణాల వాళ్ళూ విచ్చలవిడిగా అన్ని గ్రేడింగ్స్ వీ ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారుగా?  మీ చూపు మసకబారిందా?  పైగా మీరు చేసిన తుగ్లక్ పనికి షాపులవాళ్ళు వినియోగదారుల్ని వేధించుకు తింటున్నారు.  ప్లాస్టిక్ సంచీ కావాలంటే అదనంగా రెండు రూపాయల నించి ఆ పైన చెల్లించాలట?  అటు తిరిగి, ఇటు తిరిగి మీరు ప్రయోగించే బాణాలన్నీ మధ్యతరగతి వాళ్ళ గుండెల్లో గుచ్చుకునేవేగా?'
'.........................'
'దీనికీ మీరు మాట్లాడరు.  పోనీ ఒకటి చెప్పండి.  ఒక్క హైదరాబాదు లోనే రోజుకు పదమూడు వేలకు పైగా వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయే?  వీటివల్ల వాతావరణ ఎంత కలుషితమవుతోందో మీకు తెలియనంత అజ్ఞానులా?  ఎందుకు అల్లా అనుమతిస్తూ పోతున్నారు?  ఏ మహానగరం చూసినా దారుణంగా నివాసయోగ్యం కాకుండా పోతున్నదే?'
'........................'
'దీనికీ మీరు మాట్లాడరు. పోనీ ఇది చెప్పండి.  జీవనదులన్నీ దారుణంగా కలుషితమై పోతున్నాయే?  పరిశ్రమల వ్యర్థాలన్నీ విచ్చలవిడిగా నదుల్లోకి వదులుతున్నారే?  ఇది కూడా మీరు పరిషరించలేని సమస్యా?  లేక మీరు కలగజేసుకోకుండా వుండడానికి వేరే ఉద్దేశ్యం వుందా?'
'.........................' 
'నాకు తెలుసు.  మీరు దేనికీ మాట్లాడరు.  మీకన్నా బధిరాంధక మూకశవాలు నయం.  ఐనా సామాన్యమానవుడు పర్యావరణాన్ని రక్షించటం లేదని ఒక అరుపు అరిచి ఊరుకుంటారు.'
'....................'
'స్వఛ్ఛభారత్ పేరుతో రోడ్ల పక్కన మరుగుదొడ్లు ఏర్పాటు చేసారు.  సంతోషం.  కాని వాటిల్లోంచి మూత్రం రోడ్ల మీదకు పారుతోంది.  మీరు గమనించరా?'
'అలాగా?  తప్పకుండా చర్య తీసుకుంటాం."
'చాలా సంతోషం.  వెళ్ళి రండి.'
_________________

No comments:

Post a Comment

Pages