పుష్య మిత్ర - 32 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 32
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్తాడు. మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర.  ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం వలన ఆలోచనలో పడతారు. ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు.  పాకిస్థాన్ వెళ్ళిన పంచాపకేశన్ బృందాన్ని దిల్లీలో  సీ.ఐ.డీ డిపార్ట్మెంటు  వలవేసి పట్టుకుని దిల్లీకి దూరంగా ఉన్న ఒక పాడుబడిన గృహంలో బంధిస్తారు. వలవేసి పట్టుకుని దిల్లీకి దూరంగా ఉన్న ఒక పాడుబడిన గృహంలో బంధిస్తారు. పీ.ఎం. ఆ నిథిపై పంచాపకేశన్ కన్ను ఉందన్న సంగతి రూఢి చేయగా పుష్యమిత్రుడు దాన్ని ఎవరూ స్వాధీనం చేసుకోలేరని, దానికి నాగబంధం వేశానని చెబుతాడు. (ఇక చదవండి)
దిల్లీకి దూరంగా ఉన్న ఒక పాడుబడ్డ బంగళాలో బందీ అయిన వెంకటేశన్ బృందానికి ఏం చెయ్యాలో దిక్కు తోచడంలేదు. కాంటాక్ట్ చెయ్యడానికి ఫోన్లు లేవు. ఆ బంగ్లాలో తిరుగుతూ ఉండగా అక్కడ ఒక పనిచెయ్యని ల్యాండ్ లైన్ ఫోను కనిపిస్తుంది వారికి. వెంటనే వెంకటేశన్ కులశేఖరన్ ను పిలిచి "ఇప్పుడు నీ టాలెంట్ ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. నీవు కమ్యూనికేషన్ ఇంజినీరువు కదా! ఈ ఫోనె కనెక్షన్ ఇవ్వు లేదా వేరే మోడ్ లో సార్ కు కనెక్షన్ ఇవ్వు" అనగానే కులశేఖరన్ ఆ పనిలోకి దిగాడు. కిటికీల నుండి బీ.ఎస్.ఎన్.ఎల్ స్తంభాలు ఎంత దూరం ఉన్నదీ అంచనా వేసి లాభంలేదని నిర్ణయించి, తన జేబులో దాచుకున్న హ్యం రేడియో ఎక్విప్మెంట్ బయటకు తీసాడు. హైఫ్రీక్వెన్సీ ద్వారా చివరకు తమిళనాడు లోని శ్రీపెరుంబుదూర్ లో ఉన్న తన ఫ్రెండ్ తో మాట్లాడి, వెంకటేశన్ కు ఇచ్చాడు ఫోను. వెంకటేశన్ చెప్పాల్సిందంతా చెప్పాడు.
*    *    *
"సార్! మన అబాండండ్ ఆఫీసర్స్ క్వార్టర్స్లో బందీలుగా ఉంచిన వాళ్ళు పారిపోయారు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. మనుషులు లేరు."
"ఎట్టిపరిస్థితులలోను వారిని వదలకండి. ఎలా ఐనా సరే! పట్టుకోండి. వాళ్ళ పాస్పోర్ట్ ఆధారాలతో తమిళ్నాడు మొత్తం గాలించండి.  చాలా ప్రమాదం” పీ.ఎం. చాలా కూల్ గా చెప్పాడు. కానీ ఫెయిల్ అయితే పనిష్మెంటు ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసినదే!
*    *    *
"మిస్టర్ పంచాపకేశన్! ఎక్కడున్నారు. మీరు ఫోను చాలాసేపటి నుండి ఎత్తడంలేదు. అర్జెంటుగా మీరు నా ఆఫీసుకు రండి. వెరీ వెరీ అర్జెంట్."
"అప్పుడే తప్పించుకున్న బృందాన్ని సిక్కుల వేషాలు వేయించి కార్లో ఇద్దరినీ, బస్సుల్లో ఇద్దరినీ, రైళ్ళలో ఇద్దరినీ చొప్పున అందర్నీ కష్టపడి రాష్ట్రం దాటించి ఊపిరి పీల్చుకున్న ఎఫ్.ఎం.కు ఈ ఫోను తో ఏదో కీడు శంకించాడు.
*    *    *
"మిస్టర్ కేశన్! మనం కష్టపడి పట్టుకున్న ఉగ్రవాదులను కొంతమంది తెలివిగా తప్పిస్తున్నారు."
"పాకిస్తాన్ వాళ్ళకు చాలా ఇంటెలిజెన్సు బృందం ఉంది సార్!"
"ఓహో! కానీ వాళ్ళు తప్పించుకోలేరు. పట్టుకుని తీరుతాం!" అని అతని కళ్ళల్లోకి చూశాడు.
ముఖ కవళికల్ల్లో ఏమాత్రం తేడా లేదు.
"యెస్ సార్! మనం మాత్రం తక్కువ తిన్నామా? ఖచ్చితంగా పట్టుకోవలసినదే!. అవును దేనికో పిలిచారు. అర్జెంట్ అన్నారు"
"అవును. రూపాయ విలువ రోజు రోజుకు పడిపోతోంది. ఎలా? మన ప్రభుత్వం మీద అపనమ్మకం వస్తోంది జనానికి. స్టాక్ మార్కెట్లు కుప్పగూలుతున్నాయి రోజు రోజుకు."
"సార్! రూపాయ విలువ గురించి మీకు తెలియదా చెప్పండి. నన్ను ఎందుకు బ్లేం చేస్తున్నారు? దానికి చాలా కారణాలున్నాయి"
"అవును. నేను నిన్ను తప్పు పట్టడంలేదు. ప్రతిపక్షాల ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి?"
సార్! దేశీయ కరెన్సీ విలువ మున్ముందు మరింత పతనం కావచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ బార్‌క్లేస్‌ తాజా నివేదిక ఈమధ్యే హెచ్చరించిన విషయం మీకు తెలియంది కాదు. గ్లోబల్‌ మార్కెట్లో కొండెక్కిన ముడిచమురు ధరలతోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటంతో రూపాయికి మరీ ప్రమాదం వాటిల్లుతోంది. మున్ముందు ఈ గండం మరింత పెద్దది అవ్వొచ్చని కూడా బార్‌క్లేస్‌ బాహాటంగా అంటోంది. ఈ ఏడాది చివరినాటికల్లా డాలర్‌తో దేశీయ కరెన్సీ మారకం విలువ రూ.72కు చేరుకోవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. అంటే, ఈ ఏడాది రూపాయి విలువ 11.3 శాతం మేర క్షీణించిందన్న మాట. సంస్థ అంచనాలను బట్టి చూస్తే.. కరెన్సీ మార్కెట్లో 2013నాటి కంటే అధ్వాన్న పరిస్థితులు చవిచూడాల్సి రావచ్చు. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం రేటు 68 ఎగువ స్థాయిలో ఉంది. మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసేసరికి 68.25 వద్ద స్థిరపడింది. ప్రతికూల బాండ్‌ మార్కెట్‌తోపాటు ఆర్‌.బి.ఐ విధానంలో అస్పష్టత, 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెరిగిన రాజకీయ అనిశ్చితి కారణంగా భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోయిందని బార్‌క్లేస్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ సంస్థ గతంలో డాలర్‌తో రూపాయి ఎక్స్ఛేంజ్‌ రేటును రూ.69గా అంచనా వేసింది. అసలు గొప్ప సమస్య ఏమిటంటే..ఏడాది క్రితం మార్కెట్లో ఉన్న సెంటిమెంట్‌ తారుమారైందని బార్‌క్లేస్‌ అభియోగం.

"కానీ కొంత కాలం క్రితం మనం ఈ విషయంలో ముందంజలో ఉన్నాం కదా?"
"అవును సార్! అప్పట్లో పన్ను వసూళ్లు సమృద్ధిగా ఉండటంతోపాటు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అప్పటి సానుకూల అంశాలని సంస్థ పేర్కొంది. దాంతో అమెరికా వడ్డీరేట్ల పెంపు ప్రభావాన్ని తట్టుకునే విషయంలో భారత్‌లాంటి వర్ధమాన దేశాల పరిస్థితి మిగతావాటితో పోలిస్తే మెరుగ్గా కన్పించింది. కానీ, గ్లోబల్‌ మార్కెట్లో క్రూడాయిల్‌ రేటు అనూహ్యంగా పెరగడం, బాండ్‌ మార్కెట్‌ రిటర్నులు తగ్గుముఖం పట్టడంతో విదేశీ ఫండ్‌ సంస్థలు ఈ ఏడాది ఇండియన్‌ ఈక్విటీ, బాండ్‌ మార్కెట్‌ నుంచి 670 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. దాంతో రూపాయి మారకం విలువ 2016 నాటికి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఏమి చెయ్యాలో తెలీడంలేదు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ వాటా తగ్గించుకుని రెండు మూడు రూపాయలు తగ్గించి ప్రజాకర్షణ చేస్తున్నారు. మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి సార్!". ఏ.టీ.ఎం లలో నగదు కొరత సమస్య కొంత వరకూ పరిష్కరించగలిగాం సార్! అని ముగించాడు.
“మిస్టర్ కేశన్! అసలు కారణం ఏమిటంటే ఇరాన్ చమురు దిగుమతులన్నీ నవంబరు నాటికి ఆపేయాలని అమెరికా మిత్రరాజ్యాలు అడిగిన తరువాత అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. లిబియా మరియు కెనడాల్లో సరఫరా అంతరాయాలపై ఆందోళనలు కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. మరోవైపు ఆయిల్‌ ధరలు కూడా పైపైకి పోతున్నాయి. మనం ఇంధనం విషయంలో స్వయం సమృద్ధి సాధించవలసిన తరుణం ఆసన్నమైంది. రేపు ఉదయం ఆర్.బీ.ఐ అఫిషియల్స్ తో మీటింగ్ పెట్టండి. త్వరలో అల్టర్నేటివ్ ఇంధనం, శిలాజ ఇంధనం మొదలైనవి తయారు చేసే దిశగా సైన్సు కాంగ్రెస్ ఏర్పాటు చేయండి.
"ఇవాళే నోట్ పుటప్ చేస్తాను సర్!"
"ఎస్. గో అహెడ్"
మీటింగ్ ముగిసిందన్నట్టు చూశాడు" పీ.ఎం.
ఎఫ్.ఎం. అటు బయటకు వెళ్ళగానే ఫోన్ ట్యాప్ చేసి మొత్తం రికార్డు చేయమని ఆదేశాలు ఇచ్చాడు.
*    *    *
రైలు పెట్టెలో ఎవరో ఇద్దరు వ్యక్తులు తనను అనుమానంగా చూస్తున్నారన్న విషయం పసిగట్టిన వెంకటేశన్ మెల్లిగా డోర్ వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. తరువాతి స్టేషన్లో ఆగాక క్రిందకు దిగి కాఫీ త్రాగి, కొంచెం కదిలాక ఎక్కుతున్నట్టు మెట్లపై నిలబడి స్పీడ్ కొంచెం అందుకున్నాక దూకేసి, వేరే బస్ లో కొంత దూరం ట్యాక్సీలో కొంత దూరం ట్రావెల్ చేసి ఆంధ్రా చేరుకున్నాడు.
అప్పటికే ఆరుగురి ఫొటోలు అన్ని స్టేషన్లలో ప్రింట్ అవుట్ తీసి చూస్తున్నారు. ఆవిషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న వెంకటేశన్ దగ్గరలో ఉన్న ఒక మంగలిషాపుకు వెళ్ళి గుండు కొట్టించుకుని, పంచ కట్టుకుని విబూధి, రుద్రాక్షలు వేసుకుని ఒక పూజారి వేషం ధరించాడు.
*    *    *
"సార్! వెరీ ఇంపార్టెంట్ న్యూస్. మన ఇండియన్ గ్లోబల్ ఐ విషయం పాకిస్తాన్ వాళ్ళకు తెలిసిపోయింది. దానికి దొరకకుండా ఉండడానికి పాక్ సైంటిస్ట్ లు కొంతమంది టీం గా అమెరికా వెళ్ళారు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ టీం అని ఏదో పేరు పెట్టుకుని వెళ్ళారు. ఒక 6 నెలలు అక్కడ ఉండి సొల్యూషన్ కనుక్కుని వస్తారట."
"ఏం పర్వాలేదు. నేను అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడాతాను. ఈ నెలాఖర్లో వెళ్తున్నా. భయపడకండి."
( సశేషం)

No comments:

Post a Comment

Pages