శ్రీథరమాధురి -55 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి -55

Share This
శ్రీథరమాధురి -55
(వినాయకుడి గురించి పూజ్య గురూజీ అమృత వాక్కులు )

శిష్యుడు: వినాయక చతుర్థి సమయంలో గణపతిని ఎందుకు పరిహాసం చేస్తారో నాకు తెలియదు. కార్గిల్ గణేషా వరల్డ్ కప్ గణేశా ఇలా వివిధ ఆకారాల్లో గణపతి బ్యాటింగ్ బౌలింగ్ చేస్తున్నట్లుగా చిత్రీకరిస్తారు. గణేష్ దేవుడిని ఈ విధంగా చూపుతారు. నా సందేహానికి దయతో సమాధానం ఇవ్వండి ప్రణామములు.
"శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భు జమ్ ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"
నీ ప్రశ్నకు సమాధానం దిగువ తెలిపిన గణపతి లోకంలో దాక్కుని ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఈ దేవతకు 'ప్రసన్నవదనం' ఉన్నట్లుగా ప్రస్తావించలేదు. ఆయన ముఖం ఆనందమయంగా ఉంటుంది పూర్తి సంతోషం, ప్రకాశం తో నిండిపోయి ఉంటుంది. దీనికే మరొక అర్థం ఏమిటంటే ఆయన మీరు ఆనందంగా నవ్వుతూ ఉంటే చూసేందుకు ఇష్టపడతారు. మీరు ఆశ్చర్య పోయి నవ్వేందుకు ఆయన కొన్ని చేష్టలను చేస్తారు. కాబట్టి ఈ స్వరూపంలోని దైవం మిమ్మల్ని ఆనందంగా చూసేందుకు ఇష్టపడుతారు. కాబట్టి ఇక్కడ జోక్ అనేది ఆనందం లో అంతర్భాగం అవుతుంది. పరిహాసం లేకుండా నవ్వడం అనేది అసాధ్యం అవుతుంది. అందుకే ఆయన పరిహాసం చేస్తారు ఇతరులు తనను పరిహాసం చేసేందుకు అనుమతిస్తారు, దీనివల్ల ఇటువంటి ప్రక్రియలో అందరూ ఆనందంగా ఉంటారు.
   
శిష్యురాలు: ప్రణామములు గురూజీ. గణేష విసర్జన అనేది వేదాల్లో కాని శాస్త్రాలలో చెప్పబడిందా? నా అజ్ఞానాన్ని క్షమించండి గురూజీ. 
నాకు తెలిసినంతవరకు వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఇటువంటి ప్రస్తావన లేకపోయినా, ఒక పురాతన ఆచారం మాత్రం ఉండేది. ప్రజలు తమ పొలాల్లో అందుబాటులో ఉన్న బంకమట్టిని, ఇసుక ను ఉపయోగించి గణపతి ప్రతిమను తయారు చేసేవారు. మూడు రోజులపాటు ఆయన్ని ఆరాధించి ఆ ప్రతిమను తమ బావిలో కాని, చెరువులో కాని విసర్జించే వారు.
ఇక్కడ నమ్మిక ఏమిటంటే, మహాగణపతే స్వయంగా ఒక విఘ్నం. ఆ విజ్ఞానికి మూడు రోజులు పూజలు సెల్ఫీ మంచినీటిలో కరిగించి నప్పుడు, మీ జీవితంలోని విఘ్నాలన్నీ తొలగిపోతాయి. 
ఇటువంటి ఆచారంలో కాలుష్యానికి తావు లేదు ఎందుకంటే ఆ మట్టి ఇసుక అనేవి వారి స్వంత పొలాల నుంచి సేకరించినవి, ప్రతిమను కరిగించే నీరు మంచినీరు, త్రాగు నీరు కనుక.
ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ నగరాన్ని తీసుకోండి. నమ్మకం పేరుతో మనం సున్నం, ఇనుప రాడ్లు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇంకా కొన్నిసార్లు రాళ్ళు, సిమెంట్ వంటి వాటితో భారీ విగ్రహాలను సృష్టిస్తారు. వీటిని క్రైం ల సహాయంతో హుస్సేన్ సాగర్లో పడేస్తారు. హుస్సేన్ సాగర్ మునుపే పారిశ్రామిక వ్యర్థాల తో నిండిపోయి ఉంది. అదృష్టవశాత్తు కాలుష్యం విషయంలో నేడు కొంత అవగాహన కలగడం నేను గమనించాను. ప్రభుత్వం కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్ని కఠినమైన ప్రమాణాలను నిర్దేశించి, వాటిని ఖచ్చితంగా పాటించేలా తగిన మార్గాలను అవలంబిస్తోంది.
కానీ సగటు మనిషి ఇటువంటి సమస్యల యొక్క తీవ్రతను గుర్తించే వరకు ప్రభుత్వం కూడా అద్భుతాలనేమీ చేయలేదు. చట్టాన్ని అమలు పరిచేలా చూసే కోర్టులు ఈ విషయంలో ప్రజలను మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పినప్పటికీ, ఈ విషయాలు స్వభావరీత్యా ఉద్వేగపరమైనవనీ, స్వయంగా మహాగణపతే వీటిని నివారించాలని పూనుకుంటే తప్ప, సులువుగా నియంత్రించేందుకు వీలు కానివని నా భావన.
    
ఆమె అమాయకురాలు ఆమె ఒక గుడికి వెళ్లి మిడిమిడి జ్ఞానం ఉన్న ఒక ఆలయ పూజారి ని కలిసింది. ఆమె ఈ మంత్రాన్ని పఠించసాగింది...
'శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.'
ఆ పూజారి ముందు ఆమె మహాగణపతిని ప్రార్థించింది.
ఆ పూజారి ఇలా అన్నారు ,'ఇది గణపతి మంత్రం కాదు, ఈ మంత్రంలో 'విష్ణుం' అని వస్తుంది కనుక ఇది విష్ణు మంత్రం. కాబట్టి దీన్ని చదివేటప్పుడు మనసులో విష్ణువుని ఉంచుకో గణపతిని కాదు.'
ఇది విన్నాక ఆమె గందరగోళానికి గురైంది.
'విష్ణుం' అనే మాటను గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం.
విష్ణు లేక విష్ణుం అనే పదానికి సర్వవ్యాపి అనే అర్థం ఉంది. అయినా అన్ని చోట్ల అవతరిస్తారు ఆయన్ను అన్ని చోట్ల దర్శించవచ్చు. ఆయన ఒక చెట్టు కింద కూర్చుని కనిపిస్తారు. ఆయన ఇంట్లో ఉంటారు. ఆయన ఆఫీస్ లో ఉంటారు. ఆయన వీధి చివరన ఉంటారు. ఆయన చెరువు వద్ద ఉంటారు. ఆయన సముద్రతీరంలో ఉంటారు. ఆయన అడవిలో ఉంటారు. ఆయన అన్ని చోట్లా వ్యాపించి ఉంటారు.
దైవం అంతటా అన్నిటా నిండి ఉంటారు ఆయన తెలుపు రంగు దుస్తులు ధరిస్తారు. శ్వేత వర్ణంలో ఉంటారు. నాలుగు చేతులతో ప్రసన్నమైన ముఖంతో ఉంటారు. ఈ ప్రార్థనలో విఘ్నం స్వరూపంలో కూడా ఉండే దైవానికి నా ప్రణామాలు.
తెలుపు రంగు స్వచ్ఛతను సూచిస్తుంది నాలుగు చేతులు ఆయన ఇతర ప్రాణి కంటే కూడా శక్తిమంతులని సూచిస్తాయి. ఆయన వదనం ఎప్పుడు ప్రసన్నంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఇది ఆయన పరిపూర్ణ ఆనందంతో ప్రేమతో నిండి ఉంటారు అని తెలుపుతుంది.
ముఖం ఆనందంగా ప్రసన్నంగా ఉండడం అనేది విశ్వ చైతన్యాన్ని సూచిస్తుంది. మీరు ఈ స్వరూపంలో గణపతిని ప్రార్థించినా లేక విష్ణువును ప్రార్ధించినా ఒకటే. కానీ 'విష్ణుం' అన్న ఈ పదం దైవం సర్వవ్యాపి అని తెలియజేస్తుంది. ఆయన ఒక చిన్న అణువులో కూడా ఉంటారు ఒక పెద్ద స్తంభంలో కూడా ఉంటారు, అన్నింటా, అంతటా, ఉంటారన్నదే దీని భావం.
ఇప్పుడు నమ్మకం విషయానికి వస్తే ఆమె గణపతిని ప్రార్థించేటప్పుడు, ఆ పూజారి ఆమె ఆలోచనా విధానాన్ని నియంత్రించి, తనకు సరైనదని అనిపించిన భావనలో ఆమెను కూడా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ రకమైన నియంత్రణ చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే అది ఒకరి విశ్వాసం, నమ్మకాల వ్యవస్థలో జోక్యం కల్పించుకుంటుంది. ఇది పూర్తిగా అభ్యంతరకరమైనది.
ఋగ్వేదం ఇలా అంటుంది 'ఏకం సత్ విప్రః బహుధా వదంతి'.
సత్యం అనేది ఒక్కటే కాని చాలామంది దాన్ని వేరువేరుగా పిలుస్తారు.

'ఉపమశ్ర వస్తమం'
________________________________
దైవంతో సరిసమానమైనది ఏమీ లేదు. ఆయనే పరమమైన ఉనికి కలవారు.
దైవమే ఆకాశం దైవమే నక్షత్రాలు దైవమే గాలి దైవమే అగ్ని
దైవమే ఆకాశం దైవ మీ భూమి దైవమే శూన్యం దైవమే తండ్రి దైవమే తల్లి దైవమే మిత్రుడు
దైవమే పులి దైవమే అడవి
ఈ విధంగా వేదాలలోని శ్రుతులలో దైవం గురించి చెప్పబడ్డ కోట్లాది అంశాలు ఉన్నాయి.
అయినా కూడా ఈ జాబితా అసంపూర్ణమైనదే. అయినా వీటన్నిటికంటే గొప్పవారు. దైవం గురించిన మన వ్యక్తీకరణలో ఎప్పుడు కొంత కొరత ఉంటుంది. ఆయనను గురించి వెల్లడించలేము. పోలికలు, సారూప్యాలు, ఉపమానాలు ఎన్ని వాడినా, అవన్నీ ఆయన వైభవం ముందు తక్కువే అవుతాయి.
మీరు దైవాన్ని ఎంతగా కొనియాడినా, ఆయనను మెప్పించడం సాధ్యం కాదు. 
అందుకే ఆయనను 'ఉపమశ్ర వస్తమం' అంటారు.

శిష్యుడు ప్రియమైన గురుదేవ నీలి కమలం, రాత్రివేళ వికసించే నీలికలువా ఒకటేనా? ఉచ్చిష్ట గణపతి వంటి కొంతమంది దేవతలు చేతిలో నీలి కమలంతో కనిపిస్తారు. దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి?
గురూజీ: రాత్రివేళ వికసించే నీలి కలువ, నీలి కమలం ఒకటి కాదు.
నీలిరంగు 'మాయ'ను సూచిస్తుంది. ఈ 'మాయ' నే మన భ్రమ అంటాం. ఉదాహరణకు శూన్యం చీకటిగా ఉంటుంది కానీ భూమి  యొక్క 'అయానో స్పియర్' లో ఉన్న అనేక అణువుల ప్రతిఫలనం వల్ల మనకు ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. ఈ నీలిరంగే 'మాయ', ఇది కూడా దైవేచ్ఛే. 
ఈ మాయ అనే ప్రచ్ఛాదనం కింద, ప్రపంచం ఉంటుంది. మన కోరికలన్నీ దైవం యొక్క సంకల్పం వల్లనే జనిస్తాయి. దైవం మొత్తం విశ్వాన్ని సృష్టించారు. సృష్టిని సృష్టించాలనే ఆయన కోరికనే 'ప్రకృతి' అంటారు. ప్రకృతి అనేది ఆయన కోరికకు సంబంధించిన అంశం, ఇదే మాయ.
క్లుప్తంగా చెప్పాలంటే 'కుముదము' అంటే నీలి కమలం. కుముదము అనేది మాయ యొక్క అవతారమే. 
'ఉచ్చిష్ట గణపతి', ఆయన దేవేరి నీలి కమలంపై ఆసీనులై ఉంటారు. ఈ స్వరూపాన్ని ఎక్కువగా తాంత్రిక పద్ధతుల్లో ఆరాధిస్తారు. భౌతికమైన వాంఛలన్నీ తినడం ద్వారా ఒకరు తృప్తి అనే దశకు చేరుకుంటారు అక్కడినుంచి ఆధ్యాత్మిక తపన అనే ఒక బలీయమైన వాంఛ జనిస్తుంది.
ఉచిష్ట గణపతి జీవితంలోని భౌతిక ఆధ్యాత్మిక అంశాలన్నింటిని సమకూరుస్తారు. నీలిరంగు విజయానికి కూడా సంకేతం. విజయం అనేది తాత్కాలికమైనది. అందుకే నీలిరంగు ఒక భ్రమ.
మీరు విజయాన్ని సాధించారు అని భావిస్తే అపజయం మీ వంక దృష్టిని సారిస్తుంది. ఈ మాయా జగతిలో జయం లేక అపజయం అనేవి తాత్కాలికమైనవి. మాయ అది శాశ్వతమనే భ్రమను కల్పిస్తుంది. అందుకే మీరు 'ఉచిష్ట గణపతి' ని ప్రార్ధించినప్పుడు, మీరు జీవితం యొక్క తాత్కాలిక గురించిన జ్ఞానంతో ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అందుకే దైవం మాయ ద్వారా ప్రతిదీ అనిశ్చయమైనదని, వాటన్నిటికీ వెనుక ఉన్న రాజును తానేనని, బోధిస్తారు. అందుకే ఒక విఘ్నమైనా, ఒక మంచి విషయమైనా, ఒక చెడ్డ విషయమైనా, ఒక ఇంటిని కానీ ఆస్తిని కానీ పొందడమైనా, ప్రతిదీ మాయే, అందుకే అది అశాశ్వతమైనది. కానీ ఆ 'మాయ'లో కూడా దైవం ఉంటారు అందుకే మాయను కూడా తప్పించుకోలేం.
శ్రీ మహాగణపతి స్వరూపంలో ఉన్న దైవాన్ని విఘ్న నాయకుడిగా ఆరాధిస్తాము. 
ఆయనే విఘ్నం, ఆయన్ను ఆరాధించడం ద్వారా, ఆయన విఘ్నాలను సృష్టించకుండా ఉంటారు.‌ దైవం అమిత శక్తివంతులనేదే సత్యం
. అయినా ఒక పక్క మీకు చేసేందుకు పనిని ఇచ్చి మరొక పక్క అది అవకుండా విఘ్నాలను సృష్టిస్తారు. ఆయనే వర ప్రదాత, మరొక పక్క అనే శిక్షకులు, ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన వారు. పెద్ద ఎత్తున మంచి జరగడానికి ఆయన రెండు విధాలుగా చేసినా కూడా, మనం మనుషులం కనక ఆయన నిర్మాణాన్ని అర్థం చేసుకోలేము. అందుకే మొదట దయతో ఆయన ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ఎటువంటి విఘ్నాలను సృష్టించవద్దని మనం ఆయనను ప్రార్థిస్తాము. మనకు ఆ పనిని అనుగ్రహించింది ఆయనే కనుక, ఆయనే అది సరిగ్గా పూర్తయ్యేలా చూస్తారని మనం ఆయనను తేలిగ్గా భావించలేము. అందుకే ఈ కోరిక అనేది ఎటువంటి అవరోధాలు లేకుండా కార్యరూపం దాల్చాలి. అందుకే మనం అయినా శ్రీ మహాగణపతి గా అవతరించిన ఈ పవిత్రమైన రోజున ఆయన్ను ప్రార్థిస్తాము. భగవాన్ శ్రీ మహాగణపతి మహా రాజ్ కి జై.

No comments:

Post a Comment

Pages