స్వాతంత్ర సమర యోధురాలు, శ్రీమతి సుచేత కృపలాని - అచ్చంగా తెలుగు

స్వాతంత్ర సమర యోధురాలు, శ్రీమతి సుచేత కృపలాని

Share This
స్వాతంత్ర సమర యోధురాలు, భారత దేశములోని మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి శ్రీమతి సుచేత కృపలాని
అంబడిపూడి శ్యామసుందర రావు     

స్వాతంత్రము ముందు, స్వాతంత్ర పోరాటం లో పాల్గొని మహాత్మాగాంధీ తో కలసి పనిచేసిన స్వతంత్ర సమర యోధురాలు స్వాతంత్రము వచ్చినాక భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీలో ఎన్నుకోబడ్డ మహిళ శ్రీమతి సుచేత కృపలాని స్వాతంత్ర ఉద్యమములో ఎంతోమంది విద్యార్థులను తన ప్రసంగాల ద్వారా ప్రేరేపించి స్వాతంత్ర సమరంలో పాల్గొనేటట్లు చేసింది. అనేక సార్లు జైళ్లకు వెళ్ళింది. స్వాతంత్రము వచ్చినాక ప్రధాని నెహ్రు తన ఉపన్యాసము ఇచ్చినాక జాతీయ గీతము పాడింది. భార్య భర్తలుగా ఒకే కప్పు క్రింద నివసిస్తున్నప్పటికీ ఇద్దరు వేరు వేరు పార్టీల తరుఫున ఎన్నికలలో పోటీ చేసేవారు.ఆ రోజుల్లో  స్త్రీల  పట్ల  చూపించే వివక్షతకు వ్యతిరేకముగా పోరాడి చట్ట సభలకు ఎన్నికల లో పాల్గొని విజయాలు సాధించిన మహిళ సుచేత కృపలాని  ఈ రోజుకు కూడా 2017 నివేదిక అనుసరించి 542 సభ్యులున్న లోక్ సభలో స్త్రీల ప్రాతినిధ్యము 11. 8%మాత్రమే అంటే 64 మంది అలాగే245 మంది సభ్యులున్నరాజ్యసభలో స్త్రీలు 11%మాత్రమే అంటే 27 మంది ఇప్పటికూడా స్త్రీలకూ చట్ట సభలలో సగము మంది ఉండాలి అన్న వాదన దానికి సంబంధించిన బిల్లు (మహిళా రిజర్వేషన్ బిల్లు) కు మోక్షము రాలేదు సుచేతా కృపాలాని లాంటి స్త్రీ వాద వ్యక్తులు ఎప్పటినుంచో పోరాడుతూనే ఉన్నారు. 
రాజకీయాలలో ప్రజాస్వామ్య దేశాలలో మొదటిసారిగా ఇందిరాగాంధీ 1966లో ప్రధానిగా ఎన్నుకోబడింది అంతకన్నా 3 సంవత్సరాలకు ముందు భారతదేశములోని పెద్దదైన ఉత్తర ప్రదేశ్ కు మొట్ట మొదటిసారిగా ముఖ్య మంత్రిగా ఎన్నుకోబడి చరిత్ర సృష్టించిన మహిళా శ్రీమతి సుచేత కృపలాని రాజకీయాలలో ఈ పదవి ఆవిడకు సులభముగా వచ్చినది ఏమీకాదు అంతకు ముందు మహాత్మాగాంధీ లాంటి ప్రముఖులతో పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొని చాలా మంది ఆడవారిని ప్రేరేపించి స్వతంత్ర పోరాటంలో పాల్గొనేటట్లు చేసిన వనిత అంతేకాకుండా భారత రాజ్యాంగ  నిర్మాణ కమిటీలో ప్రాతినిధ్యము వహించిన 15 మంది స్త్రీ సభ్యులలో ఈవిడ ఒకరు. 
ఈవిడ హర్యానా రాష్ట్రములోని అంబాలలో జూన్ 25, 1908లో స్వాతంత్రోద్యము ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో జన్మించింది. సుచేత కృపాలాని తన జీవిత కధ " యాన్ ఆన్  ఫినిషిడ్ బయోగ్రఫీ" లోతన  బాల్య అనుభవాలను వివరిస్తుంది. జలియన్ వాలా బాగ్ ఉదంతము వలన సుచేత ,సోదరి సులేఖలకు వచ్చిన కోపముతో ఆంగ్లో ఇండియన్ పిల్లలను వారికి వచ్చిన తిట్లతో తిట్టి వారి కోపాన్ని తీర్చుకున్నారుట జలియన్ వాలా బాగ్ ఉదంతము తరువాత ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఢిల్లీ వచ్చినప్పుడు సుచేత చదువుతున్న స్కూలు పిల్లలను అయన గౌరవార్థము జరిగిన సభకు తీసుకువెళ్లారు ఆ చర్యను సోదరీమణులు ఇద్దరు పిరికి చర్యగా భావించారు.ఇద్దరు ఆ సభకు హాజలుకావటం అవమానముగా భావించారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్త మహిళా కాలేజీ నుండి బయటకు వచ్చి సుచేత స్వాతంత్ర్యోద్యమములో పాల్గొనాలి అని భావించింది కానీ దురదృష్ట వశాత్తు తండ్రి ,సోదరి ఇద్దరు 1929లో చనిపోవటం వల్ల కుటుంబ భాడేటాలు మోయవలసివచ్చి తన పధకాలను వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఫలితముగా బెనారస్ హిదూ విశ్వ విద్యాలయములో ప్రొఫెసర్ గా  చేరింది.
యూనివర్సిటీలో విద్యాబోధన చేస్తూ తన స్వాతంత్రోద్యమ భావ జాలాన్ని విద్యార్థులలో వ్యాప్తి చేస్తూ స్వతంత్ర ఉద్యమము యొక్క ఆవశ్యకతను వారికి తెలియజేసేది.ఈ యూనివర్సిటీలోనే ఆవిడ తన భావి జీవిత భాగస్వామి జీవిత్ రామ్ భగవాన్ దాస్ (ఆచార్య కృపలాని) ని కలుసుకొంది 1934లో బీహార్ లో వచ్చిన భుకంపము సహాయక చర్యలలో ఇద్దరి కలిసి పనిచేయటం వల్ల ఇద్దరు దగ్గర అయ్యారు ఆ సమయములోనే జమన్ లాల్ బజాజ్ తానూ నడుపుతున్న వార్ధాలోని మహిళా ఆశ్రమములో చేరి స్వతంత్ర పోరాటంలో మహిళల సంఖ్యను పెంచవలసినదిగా ఆహ్వానించాడు.వినోబా భావే ఆ సంస్థకు చైర్మన్ అయన సుచేత ప్రవేశాన్ని అనుమంతించవలసి ఉన్నది. సుచేత వినోబా భావే  కలవటానికి వెళ్ళినప్పుడు అయన నిరాహార దీక్షలో ఉన్నాడు ఆయన నిరాహార దీక్షకు కారణము ఆశ్రమములోని ఒక యువకుడు ఒక  ప్రేమలో పడటమే వారు చేసిన తప్పుకు వినోబా భావే తానూ స్వయముగా శిక్ష వేసుకున్నాడు వినోబా భావే మొండి వైఖరి నచ్చని సుచేత మహిళా ఆశ్రమములో చేరే ఆలోచన విరమించుకుంది. 
ఏది ఏమైనప్పటికి సుచేత ఆచార్య కృపలానిని 1938లో వివాహము చేసుకోవాలని నిశ్చయించుకుంది  ఇరు కుటుంబాలు ,మహాత్మా గాంధీ వంటి వారు ఈ వివాహ ప్రతిపాదనను వ్యతిరేకించినప్పటికీ పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నది తనకు కుడి భుజముగా వ్యవహరిస్తున్న జెబి కృపలాని ఈ వివాహము వల్ల దూరము అవుతాడని గాంధీజీ భయము. ఇంకా ఎవరినైనా పెళ్లిచేసుకోమని గాంధీ సలహాఇస్తే అలా చేయటము అనైతికం నిజాయతి కాదు అని ధైర్యముగా సుచేత  సమాధానము ఇచ్చింది అంతేకాకుండా ఈ పెళ్లి వల్ల గాంధీకి స్వతంత్ర పోరాటంలో అదనంగా ఇంకొకరు లభిస్తారు అని నచ్చజెప్పింది ఆ విధముగా అందరి ఆశీస్సులతో సుచేత తనకన్నా 20 ఏళ్ళు సీనియర్ అయిన ఆచార్య జె బి కృపలాని ని వివాహము చేసుకుంది.  
వివాహము చేసుకున్నప్పటినుండి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ 1940లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ విభాగాన్ని ప్రారంభించింది. 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమములో చురుకుగా పాల్గొని ప్రతిఫలంగా ఒక ఏడాది జైలు శిక్ష అనుభవించింది. సత్యాగ్రహ మూవ్ మెంట్ లో గాంధీకి బాసటగా నిలిచింది.ఆ రోజుల్లో మిగతా సీనియర్లతో పోలిస్తే ఈవిడ జైలు జీవితమూ అనుభవించింది తక్కువే. భర్త కృపలాని సుచేత ను రాజకీయాలుగాకుండా ఇంకా ఏదైనా ఇష్టమైన పని చేసుకోమని చెప్పేవాడట.కానీ సుచేత తన కిష్టమైన రాజకీయాలలోనే భర్తకు బాసటగా నిలిచింది. 
ఆగస్టు 1947లో స్వాతంత్రము వచ్చినప్పుడు గాంధీ భార్య భర్తలను ఇద్దరినీ దేశవిభజన వల్ల నవకాళి లో జరిగిన హిందూ ముస్లిం అల్లర్ల సందర్భముగా  సహాయక చర్యల పర్యవేక్షణకు పంపించాడు. ఈ సందర్భము సుచేత కు రాజకీయాలలో ముఖ్యమైన పాఠము లాంటిది.దేశవిభజన వల్ల వచ్చిన కాందీశకులను బిచ్చగాళ్లుగా చూడవద్దు వారి ఆత్మగౌరవానికి భంగము  గాంధీ సుచేత తో చెప్పేవారట ఈ విషయములో గాంధీ ఫిలాసఫీని పూర్తిగా అర్ధము చేసుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఆ తరువాత నెహ్రు ప్రధానిగా ప్రమాణ శ్వీకారము చేసిన సందర్భముగా సుచేత వందేమాతరం, సారె  జహాఁ సి అచ్చా,  జన గణ మన వంటి గీతాలు పాడిన ఘనత సుచేతాకే దక్కింది. 
స్వాతంత్రము తరువాత ఆచార్య కృపలాని కి నెహ్రూకు మధ్య ఏర్పడ్డ అభిప్రాయ  భేదాలవల్ల 1950 ఆచార్య కృప లాని  కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ ని స్థాపించటంతో సుచేత న్యూ ఢిల్లీ పార్లమెంటు సీటును కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరుఫున గెలిచింది కానీ 1952లో ఆ పార్టీని వీడి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరింది. 1957లో అదే సీటును కాంగ్రెస్ పార్టీ తరుఫున గెలుచుకుంది ఈ విధముగా భార్య భర్తలు ఇద్దరు వీరు వేరు రాజకీయ పార్టీలలో కొనసాగారు కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతముగా విభేదించుకోలేదు పూర్తి ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరి ఇష్టాలు వారివే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 1963 నుండి 1967 వరకు భారత దేశములోనే పెద్దదైన ఉత్తర ప్రదేశ్ కు మొట్టమొదటి మహిళా ముఖ్య మంత్రిగా పనిచేసింది.తానూ ముఖ్య మంత్రిగా ఉన్నకాలములో పరిపాలనలో పారదర్శకతను చూపించింది ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన తరువాత ఉత్తర ప్రదేశ్ లోని గొండా నియాజక వర్గము నుండి పార్లమెంట్ కు ఎన్నికయై 1971లో రాజకీయాలనుండి విరమించుకుంది.ఆ తరువాత మూడేళ్లు అంటే 1974లో తుది శ్వాస విడిచింది. 
ఈ విధముగా రాజకీయాలలో మహాత్మా గాంధీ ,ఆచార్య కృపలాని లతో స్వతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని ఆ తరువాత కాలములో స్వతంత్ర భావాలు ఉన్న మహిళగా గుర్తింపు పొంది రాజకీయాలలో ఏవిధమైన మచ్చ లేకుండా గడిపింది ఈ విధముగా భారత డేస్ రాజకీయాలలో తన ధైన ప్రత్యేక ముద్రను ఏర్పరచగలిగింది వ్యక్తిగతము రాజకీయము వేరు అని నిరూపించగలిగింది  ఉంటూ భార్య భర్తలు ఇద్దరు  రాజకీయ పార్టీలలో   కొనసాగటమే.
***

No comments:

Post a Comment

Pages