ప్రముఖుల జీవితాల ఆధారముగా తీసిన కొన్ని బయో పిక్ ల పరిచయము - అచ్చంగా తెలుగు

ప్రముఖుల జీవితాల ఆధారముగా తీసిన కొన్ని బయో పిక్ ల పరిచయము

Share This
ప్రముఖుల జీవితాల ఆధారముగా తీసిన కొన్ని బయో పిక్ ల పరిచయము
అంబడిపూడి శ్యామసుందర రావు.         

ఈ మధ్య మన తెలుగులో మాహానటి అనే పేరుతొ  ప్రముఖ నటి సావిత్రి జీవితము  ఆధారముగా తీసిన సినిమా సూపర్ హిట్ అయింది హిందీలో సంజు సంజయ్ దత్ జీవితమూ ఆధారముగా తీసిన సినిమాకూడా హిట్ అయింది  ఈ విధముగా ప్రముఖుల జీవితాల ఆధారముగా తీసిన సినిమాలు  అన్ని భాషలలో 

వచ్చాయి వస్తున్నాయి ఇదేమి కొత్తగాదు.ఎన్టీ రామారావు పేరు మీద కూడా బయో పిక్ రాబోతుంది.   సినిమా ప్రేక్షకులకు ముఖ్యముగా హాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన కొంత మంది వ్యక్తుల జీవితాల ఆధారముగా తీసిన సినిమాల గురించి తెలిసే వుంటుంది హాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తముగా ప్రదర్శించేవి కాబట్టి మన భారతీయ ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను చూసి ఆనందించే వుంటారు అటువంటి జీవిత కధల ఆధారముగా తీసిన సినిమాలు ప్రజాదరణ పొందటమే కాకుండా బాక్స్ అఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకుని ఏవిధమైన వివాదాలు లేకుండా పూర్తిగా సక్సెస్ అయినాయి అటువంటి సినిమాలు కొన్నింటిని అవి ఎవరి జీవితమూ ఆధారముగా ఎవరు తీశారు మొదలైన విషయాల గురించి క్లుప్తముగా తెలుసుకుందాము ఆ విధముగా తెలుసుకుంటే ఆ సినిమాలు చూడనివారు ఇప్పుడైనా చూసి అందించవచ్చు
1. లారెన్స్ ఆఫ్ అరేబియా :ఈ సినిమాను 1962లో డేవిడ్ లీన్ నిర్మించాడు ఇది బ్రిటిష్  మిలిటరీ నాయకుడైన  టి. ఇ. లారెన్స్ జీవితమూ ఆధారముగా తీయబడింది.ఈ సినిమా అన్ని విధాలుగా ఒక ఖచ్చితమైన జీవిత చరిత్రలు సంబంధించిన సినిమాగా చెప్పవచ్చు ఈ సినిమా నిర్మాత డేవిడ్ లీన్ ను గప్ప సినిమా నిర్మాతల వరుసలో నిలబెట్టింది. ఇది 10 అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడి అందులో 7 అవార్డులను అందుకున్నది. 1999 లో ఈ సినిమా ను బ్రిటిష్ చరిత్రలోనే 3వ గొప్ప సినిమాగా బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది.ఈ సినిమా 1935 లో లారెన్స్ కు  సంభవించిన ప్రమాదకరమైన మోటార్  బైక్ ఆక్సిడెంట్ తో ప్రారంభమవుతుంది. లారెన్స్ పాత్రధారి పీటర్ ఓ తూలే తన ప్రమాదకరమైన మోటార్ సైకిల్ ప్రయాణాన్ని లాంగ్ షాట్ లో చూపిస్తారు. ఈ సంఘటన లారెన్స్ చావు ఆ తరువాత అయన గౌరవార్థము సెయింట్ పాల్స్ కెథడ్రల్ లో జరిగే ప్రార్ధనలతో ముగిస్తారు. ఇందులో ఒక  విలేఖరి సమస్యాత్మక మిలిటరీ అధికారి వివరాలు సేకరించటానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రయత్నములో అతనికి సరిఅయిన సమాధానాలు దొరకవు చివరకు అతని ప్రయత్నములో విజయము సాధించలేకపోతాడు. కాబట్టి ఈ సినిమా విజయవంతముగా లారెన్స్ జీవితములో మిస్టరీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ సినిమా గొప్ప విశేషము ఏమిటి అంటే చివరివరకు ప్రేక్షకులు ముగింపును ఉహించలేకపోతారు అంటే సస్పెన్స్ సినిమా అన్నమాట.సినిమా విడుదల అయినప్పటినుండి ప్రేక్షకుల విమర్శకుల ఆదరాభిమానాలు పొందిన సినిమా ఈ సినిమా ఒక గొప్ప కళా ఖండముగా సినీ జగత్తులో నిలిచిపోయింది. ఈ సినిమాతో బాగా పేరుతెచ్చుకున్న మరో నటుడు ఒమర్ షెరీఫ్ .
2..నెపోలియన్ :-1927లో ఎబెల్ గాన్స్ ప్రాన్స్ దేశస్తుడైన మిలిటరీ నాయకుడు యోధుడు అయినా నెపోలియన్ బోనాపార్టీ జీవితమూ ఆధారముగా తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో ఒక జీవిత గాధ చాలా అందముగా వెండితెరపై చిత్రీకరించ బడింది.సినీ చరిత్రలో బహుశా ఇది ఒక దృశ్య కావ్యముగా పేరుతెచ్చుకున్న సిమాల్లో ఒకటి. ఈ సినిమాలో గాన్స్ నెపోలియన్ జీవిత చరిత్రను చిత్రీకరించటములో ఎన్నో ఆధునిక విధానాలను ఉపయోగించాడు అంటే ఒకేసారి అనేక కెమెరాలతో చిత్రీకరించటం వంటి విధానాలు,హ్యాన్డ్ హెల్డ్ కెమెరా షాట్స్,మొజాయిక్ షాట్స్ ,స్ప్లిట్ స్క్రీన్స్,అండర్ వాటర్ కెమెరా లాంటివి ఈ సినిమా చిత్రీకరణలో ఉపయోగించాడు ఈ ఆధునిక పద్దతులను ఉపయోగించి తానూ చెప్పదలచుకున్న విషయాలను అంటే కధలోని అంశాలను ఈ ఆధునిక పద్దతులతో మేళవించి సినిమాను అబ్దుతముగా తీశాడు ఈ సినిమా నెపోలియన్ బాల్యము నుండి మిలిటరీ స్కూల్ కు హాజరు అవటం ప్రారంభదశలో నెపోలియన్ సైన్యములో అధిష్టించిన పదవులు అన్ని వరుసక్రమములో చూపించాడు.యవ్వన దశలో మంచు బంతులతో యుద్ధము ఒక సైనిక ప్రచారములో భాగముగా చూపించారు.పది సంవత్సరాల తరువాత నెపోలియన్ ను సైన్యములో యువ లెఫ్టినెంట్ గా ప్రెంచ్ విప్లవం సమయము లో చూస్తాము కోర్సికాలోని తన కుటుంబ సభ్యులను కలవటానికి వచ్చినప్పుడు రాజకీయ పరిణామాలు నెపోలియన్ కు వ్యతిరేకముగా మారి అతన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. అందుచేత కుటుంబాన్ని తీసుకొని ప్రాన్స్ కు పారిపోయి అక్కడ పదాతి దళములో సైనికాధికారిగా చేరుతాడు. సాధారణముగా ఇటువంటి చరిత్రకెక్కిన నాయకుల జీవిత చరిత్రల చిత్రీకరణ తెరపై వారి మరణముతో ముగుస్తుంది.కానీ నెపోలియన్ సినిమాలో ముగింపు భిన్నముగా ఉంటుంది ఎందుకంటే     గాన్స్ నెపోలియన్ జీవితమూ కెరీర్ మొత్తము ఆరు భాగాలుగా చిత్రీకరించ దలచుకున్నాడు కానీ అతని బడ్జెట్ మొత్తము మొదటి భాగానికి అయిపొయింది కాబట్టి ఆతను అనుకున్న మొత్తము ప్రాజెక్ట్ తీయటం అసాధ్యమనిపించింది అందుచేతనే ముగింపు హడావుడిగా చేశాడు ఈ సినిమాలో నెపోలియన్ పాత్రధారి ఆల్బర్ట్ డియోడిన్. మొత్తానికి ఈ సినిమా సినీ జగత్తులో ఒక మంచి దృశ్య కావ్యముగా నిలిచిపోతుంది. 
3. ద ప్యాజన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్ (1928):- ఈ సినిమా ప్రముఖ ప్రెంచ్ నాయకురాలు జోన్ ఆఫ్ ార్క్ జీవితమూ ఆధారముగా కార్ల్ థియోడార్ డ్రైయర్ తీశాడు ఈ సినిమా హీరోయిన్ రెని మారియా ఫాల్కొనెట్టి సైలెంట్ సినిమా చరిత్రలో  అమోఘమైన అభ్దుత మైన కలకాలం నిలిచిపోయే పెరఫార్మెన్స్ ఇస్తుంది. ఈ సినిమా ప్రముఖ ప్రెంచ్ నాయకురాలు జోన్ గురించి తీసింది ఈవిడ ఇంగ్లండ్ కు వ్యతిరేకముగా పోరాడిన ధీర వనిత చివరకు ఇంగ్లిష్ వారికి చిక్కి బోనులో యుద్ధ ఖైదీగా  విచారణ ఎదుర్కొంటుంది. బహుశ ఈ సినిమా ఆశయాల ఆధారముగా తెరకెక్కిన గొప్ప మూకీ సినిమా గా చెప్పవచ్చు.ఈ సినిమా మీడియం షాట్స్ లోను క్లోజ్ అప్ షాట్స్ లోను చిత్రీకరించబడింది. ఈ రకమైన టెక్నీక్ ల వల్ల డ్రయర్ సినిమా కథను మనస్సులకు హత్తుకునేలా తీయగలిగాడు. కాలానికి అతీతముగా సినిమా ప్రజలలో ప్రజాదరణ పొందింది,.ఈ సినిమా సినిమాలు లేని రోజుల కాలానికి  ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ గా నిలిచింది. అని ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు జీన్ కొక్టు చెపుతాడు. 
4. మై డార్లింగ్ క్లెమెంటిన్ :-1946లో జాన్ ఫోర్డ్ సరిహద్దు మార్షల్(శాంతి భద్రతలను అదుపుచేసే వ్యక్తి)  అయినా వైట్ ఇయర్ప్ జీవితకథ ఆధారముగా తీసిన సినిమా . 20వ శతాబ్దపు గొప్ప సినిమాలలో ఇది ఒకటి.గా పేరు సంపాదించుకున్నా సినిమా ఇది.  ఈ సినిమాలో వైట్ ఇయర్ప్ జీవితము లోని కొద్దిరోజులను భావ యుక్తముగా చిత్రీకరించటం జరిగింది.ఈ సినిమాలో అరిజోనా ప్రాంతములోని ఒకే కొరల్ టుంబు స్టోన్ వద్ద జరిగిన తుపాకుల యుద్ధము లో   వైట్ ఇయర్ప్ యొక్క ప్రమేయము ను చిత్రీకరించటం జరిగింది కానీ చాలా సినిమాలలో ఈ ప్రముఖ తుపాకుల యుద్దాన్ని చూపించి నప్పటికీ ఫోర్డ్ ఈ సినిమాలో ఆ యుద్దాన్ని చిత్రీకరించినట్లు ఎవరు చిత్రీకరించలేదు అని చిత్ర విమర్శకుల అభిప్రాయము. సాధారణముగా అందరు సినిమా ప్రధానాంశముపై దృష్టి పెడతారు కానీ ఫోర్డ్ తన సినిమాలో ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టి చిత్రీకరించటం వలన సినిమా బాగా వచ్చింది. అంటే ఆయుద్దము రావటానికి గల కారణాలను ఫోర్డ్ తన సినిమాలో చూపించటం చాలా ముఖ్యమైన అంశము అందువల్ల సినిమా ప్రజలకు బాగా నచ్చింది. ఈ సినిమా కథను వైట్ ఇయర్ప్ పాత్రధారి హెన్రి  ఫండా ద్వారా వింటాము ఈ సరిహద్దు సేనాధిపతి నియమాలను కట్టుబాట్లను గౌరవించే మంచి  కలిగిన మార్షల్ మొదటిసారిగా అతనిని అతని సోదరులను కాన్సాస్ లో పశువులను తొలికెళుతూ ఉంటె చూస్తాము. విశ్రాన్తి కోసము వైట్ అతని పిల్లలు, మందను తమ్ముడు జేమ్స్ కు అప్పజెప్పి వెళతారు వాళ్ళు టుంబ్ స్టోన్ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఆ నగరము సరిఅయిన మార్షల్ లేక అరాచకము ప్రబలి ఉంటుంది ఆ పరిస్థితి చూసి వాళ్ల క్యామ్ప్ కు చేరుతాఋ అప్పటికే వాళ్ళ పశువులు దొంగలించ బడతాయి తమ్ముడు జేమ్స్ చంపబడతాడు ఇక్కడ అందరు వైట్ ప్రతీకార  చర్యలకు దిగుతాడని అనుకుంటారు వైట్ ప్రతికారము తీర్చుకోవాలని అనుకుంటాడు కానీ గుడ్డిగా ద్వేషముతో కాదు న్యాయబద్ధముగా తన ప్రతీకారాన్ని తీర్చు కోవాలనుకుంటాడు.కాబట్టి ఆ నగరాన్నీ చక్క దిద్దటానికి ఒక  మంచి మార్షల్ అవసరమని గుర్తిస్తాడు తన తమ్ముడిని చంపినా హంతకులను గుర్తించేంతవరకు అక్కడే ఉండాలని నిర్ణయించు కుంటాడు ఈ సినిమా కధ గన్ ఫైట్  గురించి మాత్రమే కాదు ఇది నాగరికత తెచ్చిన గన్ కల్చర్ అనర్ధాల గురించి అన్న విషయము ప్రేక్షకులకు అర్ధము అవుతుంది. 
5. ఆండ్రీ రుబ్ల్వ్ :- ఈ సినిమాను 1966లో ప్రముఖ రష్యన్ చిత్రకారుడు ఆండ్రీ రుబ్ల్వ్ జీవితమూ ఆధారముగా ఆండ్రీ తారకోవ్స్కి దర్శకత్వములో తీసినది. ఈ దర్శకుడు అర్ట్ హౌస్ డైరెక్టర్ గా తీసిన ఒక మంచి సినిమా ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన  ఆర్ట్ హౌస్ బయోపిక్స్ లో మంచి పేరు సంపాదించుకున్న సినిమా ఈ సినిమా 15వ శతాబ్దానికి చెందిన గొప్ప రష్యన్  ఐకనో గ్రాఫర్ ఇంచుమించు క్రీస్తును పోలిన ఆండ్రీ  రుబ్ల్వ్ జీవిత కధ పూర్తిగా రష్యన్ బ్యాక్ గ్రౌండ్ తో తీసిన సినిమా  ఇది ఎనిమిది భాగాలుగా విభజింపబడింది ప్రతి భాగము ఒక చిన్న కధలా ఉంటుంది. ప్రతిభాగానికి ముందు మాట ముగింపుమాట ,ఆ ముగింపుమాట తరువాత ప్రారంభమయే భాగానికి ఉపాద్ఘాతముగా ఉంటుంది ఈ సినిమా పూర్తిగా మూడు గంటలు నడుస్తుంది.కానీ చూస్తున్నంతసేపు ఈ చిత్రము పొడవు గురించి కాలము గురించి పట్టించుకోము దర్శకుడు ఈ పొడవును తానూ చెప్పదలచుకున్న చూపించదలచుకున్న అంశాలకు ఉపయోగించు కుంటాడు. ప్రేక్షకులను మెడిటేషన్ జోన్ లోకి తీసుకొని వెళతాడు. క్లైమాక్స్ సీన్లలో తేరా రంగులమయము అవుతుంది. రుబ్ల్వ్ యొక్క ప్రసిద్ధి చెందిన చిత్రాలను క్లోజ్ అప్ షాట్స్ లో చూపిస్తారు ఈ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఈ విధముగా ఈ సినిమా మంచి పద్య,దృశ్య అందమైన కావ్యముగా ప్రేక్షకులు గుర్తిస్తారు దర్శకుడి ప్రతిభను గుర్తిస్తారు. 
6. రేజింగ్ బుల్ :- ఈ సినిమా 1980లో పూర్వపు  మిడిల్ వెయిట్  చాంపియన్ జాక్  లా మోట జీవితము ఆధారముగా తీయబడింది.ఇది కూడా ప్రపంచ సినీ జగత్తులో ఒక కళాఖండముగా ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా ఆ సినిమా దర్శకుడైన మార్టిన్ స్కోర్సీ ని ఒక్కసారిగా అగ్రదర్శకుల వరుసలో నిలబెట్టింది. ఈ రోజుకు ఈ సినిమా దర్శకత్వము,ఎడిటింగ్,బ్లాక్ అండ్ వైట్ సినిమాటోగ్రఫీ  విభాగాలలో మాస్టర్ క్లాస్ లో ఉంటుంది.ఈ సినిమా హీరో రాబర్ట్ డి నీరో  తన కెరీర్ లో అభ్ధుతమైన నటనను ప్రదర్శిస్తాడు.సినిమా ప్రారంభములో జాక్ పాత్రధారి నీరో  బాక్సింగ్ రింగ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అనుగుణముగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేయటము చూస్తాము. తరువాతి సీన్ లో 42 ఏళ్ల , శరీరాకృటి సక్రమముగా లేని జాక్ నైట్ క్లబ్ మోనోలోగ్ కు రిహార్సిల్ చేస్తుంటాడు ఆ తరువాత జాక్ ఉచ్ఛస్థితిలో ఉన్న బాక్సింగ్ ఫైట్స్ చూపిస్తారు. ఈ విధముగా దర్శకుడు యవ్వనంలో ఉన్న జాక్ కు  పేద్ద జాక్ కు మధ్య గల వ్యత్యాసాన్ని చూపిస్తాడు. సినిమా చూసే ప్రేక్షకులకు ఈ మార్పు ఎలా వచ్చింది అన్న సందేహానికి సినిమా సమాధానము చెపుతుంది. ఈ విధముగా రేజింగ్ బుల్ సినిమా పూర్తిగా బాక్సింగ్ కు సంబంధించిన సినిమా కాదు ఈ సినిమా ఒక ఆడదాని పట్ల ఈర్ష్యగా ఉండే వ్యక్తి అందునా తన అసమర్ధత వల్ల కలిగే భాధను హింస ద్వారా ప్రదర్శించటం ఈకధలోని ముఖ్యాంశము,ఈ సినిమా 8 ఆస్కార్ అవార్డులకు ఎంపిక అయింది. కానీ ఉత్తమ చిత్రము అవార్డును దక్కించు కోలేక పోయింది అయినప్పటికీ ఇప్పటికి ఆ సినిమా ఇతర సినిమా దర్శకులకు నిర్మాతలకు ప్రేరణగా మిగిలి పోయింది
7. ద ఎలిఫెంట్ మ్యాన్ :-1980లో డేవిడ్ లించ్ తీవ్రమైన అంగవైకల్యము గల ఒక వికాలాంగుడు జోసెఫ్ మెర్రిక్ జీవితము ఆధారముగా తీసిన సినిమా ఇది. తీవ్రమైన అంగవైకల్యముగల జోసెఫ్ మెర్రిక్(సినిమాలో జాన్ మెర్రిక్ గా పిలువబడతాడు) ప్రశాంత మైన జీవితమూ గడపటానికి ఏవిధముగా కష్టపడవలసి వస్తుందో డేవిడ్ లించ్ తన సినిమాలో చూపిస్తాడు.ఈ సినిమా నిజమైన కాలానికి అతీతమైన అర్ధము లేని అపోహలకు దురాభిమానాలకు ఒక చక్కని పరిశీలన. లండన్ హాస్పిటల్ లోని సర్జన్ ఫ్రెడరిక్ ట్రీవ్స్ (పాత్రధారి అంథోని హాప్కిన్స్) ఒక షో లు జోసెఫ్ ఏ విధముగా అపహాస్యము చేయబడుటుంటాడో చూస్తాడు జోసెఫ్ తన అభీష్టానికి వ్యతిరేకముగా ఒక దుర్మార్గపు యజమాని బైట్స్ దుష్టపు ఆలోచనల వల్ల ఈ షో లో ఉంటాడు కారణము చిన్నతనానే జోసెఫ్ తల్లి అతన్నివదలి వెళ్ళిపోతుంది.డాక్టర్ ట్రీవ్స్ ఇది గుర్తించి జోసెఫ్ కు కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని బైట్స్ తో చెప్పి తీసుకువచ్చి బైట్స్ ఇష్టానికి వ్యతిరేకముగా జోసెఫ్ ను తన దగ్గరే హాస్పిటల్ లో ఉంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. క్రమముగా ట్రీవ్స్, జోసెఫ్ ల మధ్య బంధము పెరుగుతుంది. ట్రీవ్స్ జోసెఫ్ కు వైద్యము చేసి అతని జీవితములో సంతోషాన్ని తేవాలని 
ప్రయత్నిస్తుంటాడు.సినిమా ఆద్యంతమూ ప్రేక్షకులు డాక్టర్ ట్రీవ్స్ జోసెఫ్ లోని ఇమిడి ఉన్న అతః సౌందర్యాన్నిచూడటానికి  ఆసక్తి చూపుతారు. సినిమా సక్సెస్ అవటానికి మొట్ట మొదట కారణము లించ్ చూపించిన మానవతా కోణము ఎమోషనల్ ఫిల్మ్ మేకింగ్ లో ఇది ఒక మాస్టర్ పీస్ అందువల్లే  లించ్ కు పెట్టుబడి కన్నా ఐదు రేట్లు ఎక్కువ సంపాదించి పెట్టింది ఈ సినిమా. ఈ సినిమా మొత్తానికి జోసెఫ్ పాత్రధారి జాన్ హార్ట్ నటన అమోఘము అబ్దుతము సినిమా చూస్తున్నంత సేపు ఆ అసహ్యమైన మేక్ అప్ వెనుక ఉన్న నటుడు ఎవరు అన్నది ప్రేక్షకులు పట్టించుకోరు అతని నటన అంత  డామినేట్ చేస్తుంది.యదార్ధానికి నిజజీవితములో కన్నా సినిమాలో కొన్నిపాత్రలను కొంత మిస్ లీడింగ్ చూపిస్తారు ముఖ్యముగా డాక్టర్ ట్రీవ్స్ ను చాలా స్వార్ధముగా చూపిస్తారు.  మొత్తానికి జోసెఫ్ తానూ పడ్డ కష్టాలను మానవతా కోణములో చూపించి ఒక ఎమోషనల్ సినిమాగా మన ముందు లించ్ ఉంచుతాడు. 
8. గాంధీ :-1982లో రిచర్డ్ ఎటన్ బర్రో మన జాతి పిత  మహాత్మా గాంధీ జీవితచరిత్రను తెరకెక్కించాడు. ఈ సినిమాలో బెన్ కింగ్స్లీ గాంధీగా నటించాడు. రోహిణి హట్టంగడి కస్తూర్బా పాత్రలో నటించింది  భారతీయ హాలీవుడ్ నటులు ఎందరో ఈ సినిమాలో నటించారు. మహాత్మాగాంధీ స్వతంత్రముకోసము ఏ వీధంతా అహింసాయుత పోరాటాన్ని సాగించింది ఆ పోరాటానికి పురిగొల్పింది సన్నివేశాలను చక్కగా చిత్రీకరించారు. గాంధీ ఫిలాసఫీని కూడా అం తే అన్ని మతాలను సమానముగా ఆదరించటం కూడా చిపిస్తారు సౌత్ ఆఫ్రికాలో అంటే 1893లో రైలునుండి బయటకు గెంటివేయటంతో గాంధీ కి జాతి వివక్షత తెలిసి జాతి వివక్షతకు వ్యతిరేకముగా సౌత్ ఆఫ్రికాలో పోరాడి ఇండియా వచ్చి అప్పటికే సాగుతున్న స్వతంత్ర పోరాటానికి నాయకత్వము వహించి ప్రపంచములో  ఏదేశము సాధించని విజయాన్నిపొందుతాడు ఈ సినిమాకు ఆధారము గాంధీ సువీయ జీవితకథ "మై ఎక్స్ పీరియన్స్ విత్ ట్రూత్"  ఉత్తమ చిత్రము,,ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకత్వము స్క్రీన్ ప్లే మొదలైన ఎనిమిది అంశాలకు ఆస్కార్ అవార్డు లను గెలుచుకుంది. 
***               

No comments:

Post a Comment

Pages