అర్థం, అనర్థం
- యామిజాల జగదీశ్
జీవితంలో అర్థం చేసుకుంటే
దౌర్జన్యమూ మృదువుగానే అనిపిస్తుంది
అర్థంకాకుంటే
మృదుత్వం కూడా
దౌర్జన్యంగానే కనిపిస్తుంది
అర్థం చేసుకుంటే
రాయి విసిరినా కూడా
పువ్వుగానే అనిపిస్తుంది
అర్థంకాకుంటే
పువ్వు పడ్డా కూడా
ఓ రాయి తాకినట్టే అనిపిస్తుంది
జీవితంలో అర్థం చేసుకుంటే
ఆయుధం కూడా కాగితంలా అనిపిస్తుంది
అర్థంకాకుంటే
కాగితం కూడా ఆయుధంలా అనిపిస్తుంది
జీవితంలో అర్థం చేసుకుంటే
కోపం కూడా ఓ సుగుణంలా అనిపిస్తుంది
అర్థం కాకుంటే
సుగుణమూ కోపంగానే అనిపిస్తుంది
అర్థం చేసుకుంటే
విరసమూ సరసంగానే అనిపిస్తుంది
అర్థం చేసుకోకుంటే
సరసమూ విరసంగానే అనిపిస్తుంది..
జీవితాన్ని అర్థం చేసుకుంటే
చేర్పులూ మార్పులూ ఉంటాయి
ఇచ్చిపుచ్చుకోవడాలూ ఉంటాయి
అందుకే అర్థం చేసుకుని జీవించడం ముఖ్యం
***
No comments:
Post a Comment