చౌరస్తాలో దీపస్తంభం
సిగ్గు వలువలు వొలిచేసి
ఆశలతలుపులు తెరిచేసి
వలపుల జడివానలో
తడిచిన ఆ క్షణాలు
ఎవరూ చూడలేదనుకున్నారు
ఆ ప్రేమజంట...!
తారు రోడ్డు ప్రహరిగోడై
నడకదారే పడకమంచమై
ఆదమరచి నిదురించిన
వీధి రాజుల
వేదనల జీవనం
ఎవరికీ పట్టదనుకున్నడు
మేడలో మారాజు !!
ప్రేమపావురాల కువకువలు
విటులతెరచాటు వికృతాలు
నిరాశాబలవన్మరణాలు
కటికచీకటి చాటు కఠోరవాస్తవాలు
వెన్నెలవెలుగుల నిఘా వేసాడు రేరాజు!
చౌరస్తాలో దీపస్తంభమై !
***
నా కవితలని ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్న అచ్చంగా తెలుగు సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదం
ReplyDelete