రోగమేరా జీవితం (వ్యాసం )
-- జీడిగుంట నరసింహ మూర్తి
పూర్వం సహజ మరణాలే ఎక్కువగా ఉండేవి. గత కొన్నేళ్లుగా కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్ని వెంటనే ప్రాణాలుతీసేవి మరి కొన్ని బ్రతినంత కాలం మనశ్శాంతిగా బ్రతక నియ్యకమంచంమ్మీదే అన్నీ జరిపించుకునే రోగాలు. ఇన్ని రోగాలతో బాధపడే వారికోసం మందుల పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగాపుట్టుకొస్తున్నాయి. డాక్టర్లూ పెరిగిపోతున్నారు. అయితే ఇక్కడ ఏతావాతా చెప్పదల్చుకున్నది ఏమిటంటే ఈ రోగాల విషయంలో అతిసామాన్యుడికి సయితం అవగాహన పెరిగిపోతూ వస్తోంది. డాక్టర్దగ్గరకు వెళ్లి వాళ్ళే తమ సమస్యలు, ఎందువల్ల అవి వచ్చాయోవాటికి గతంలో ఏమి మందులు వాడారో, ఎన్ని హాస్పిటల్స్ తిరిగారోఅన్ని వివరాలు వైద్యులకు రిపోర్టులు చూడకుండానే సగంచెప్పేస్తున్నారు. అవును AN EXPERIENCED PATIENT IS EQUIVALENT TO JUNIOR DOCTOR అన్నట్టు అనుభవంరోగిది . ఆదాయం వైద్యుడిది అన్నట్టుగా కూడా కొన్ని చోట్ల పరిస్తితితయారయ్యింది. సరే విషయంలోకి వద్దాం.
మా పక్క అపార్ట్మెంట్లో అరవై ఏళ్ళు దాటిన నాకు బాగా పరిచయంవున్న స్నేహితులు వున్నారు. వాళ్లకు నిండుగా డబ్బు లేకపోయినా,నిలువెత్తునా రోగాలు మాత్రం వున్నాయి. వాళ్ళు డాక్టర్ విద్యచదవలేదు కాని ఇప్పుడు ఎంతో మంది ఎదుర్కుంటున్న రోగాలు ,వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్తూ వుంటేఆశ్చర్యం వేస్తూ వుండేది. అంతే కాదు వాళ్ళ భార్యలు కూడావాళ్ళతో వంత పాడి తమకు తెలిసిన విషయాలు చెప్పే వాళ్ళు.
వాళ్ళ మాటల్లో ముఖ్యంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్లాంటి ప్రమాదకరమైన జబ్బులు గురించి ఎక్కువగా దొర్లేవి. వాటిగురించి మనకూ కొంత తెలిసినా కూడా వాళ్ళ నోట్లోంచి వింటూవుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపించేది.
ముఖ్యంగా బీపీ మొదట్లో వంశ పారంపర్య వ్యాధి అయినా ఇప్పుడుఇరవై ఏళ్ళు కూడా దాటని పిల్లల్లో కూడా వస్తోందని, చదువుల్లో,ఉద్యోగాలలో వాళ్ళు తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారని , ఉప్పూ,ఊరగాయ లేకపోతే వాళ్లకు ముద్ద దిగటం లేదని, ఇంకా వేరేకారణాలు వున్నా ముఖ్యంగా ఈ రెండూ వాళ్ళను బీపీలో ముంచితెలుస్తున్నాయని చెప్పారు. బీపీ నార్మల్ అంటే systolic less than 120 diastolic less than 80 వుండాలని అంతకు మించివుంటే రిస్క్ లో ఉన్నట్టే అని చెప్పారు. ఇది సామాన్యంగా అందరికీతెలిసిన విషయమే అయినా కూడా వాళ్ళ ఉత్సాహాన్ని నీరు కార్చదలుచుకోలేదు. ఇక దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆచరించదగ్గవి, ఆచరించ లేనివి కూడా చెప్పరు.
మరో రోజు నేను అడక్కుండానే "మీకు BSC రోగాలు ఉన్నాయా అనిఅడిగాడు ఒకాయన. అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అని ఆయనఉద్దేశ్యం. లేకేం . ఇంకా పెద్ద లిస్తే వుంది అన్నాను. అయితే ఈ రోజుకొలెస్ట్రాల్ గురించి చెప్పుకుందాం అంటూ మొదలు పెట్టాడు .
ముఖ్యంగా ఇందులో మూడు రకాల సమ్మేళనం అండీ. ఇందులోఒకటి LDL కొలెస్ట్రాల్ అంటారు. దీన్నే Low density Lipoprotein అంటారు. ఇంకోరకంగా ఇది బాడ్ కొలెస్ట్రాల్ కిందలెక్క. ఇది మన శరీరంలో Less than 100 వుండాలి. అంతకుమించి వుంటే ఇబ్బందే. ఇది పెరుక్కుంటూ పోతే గుండెకు సమస్యతప్పదు. ఇక రెండవది HDL కొలెస్ట్రాల్ . దీన్ని మంచి కొలెస్ట్రాల్కింద లెక్క కడతాం. దీన్ని HIgh density Lipoproteinఅంటారు. ఇది కాని less than 40 వుంటే మేజర్ రిస్క్ కింద లెక్క.అయితే టోటల్ కొలెస్ట్రాల్ less than 200 వుండేటట్టుచూసుకోవాలి ఇక మూడవది TRIGLYCERIDES ఇవి శరీరంలోఎనర్జీకి ఉపయోగపడతాయి. ఇవి BILOW 150 వుండేటట్టుగాచూసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వుంటే గుండెకు ముప్పుగాపరిగణించాల్సి వస్తుంది.
కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత అటువైపుగా వెళ్లాను. ఏమీ లేదండీ బాబూమీరు చెప్పిన రోగాలతో గుండె బరువెక్కి పోయింది. మీరు చెప్పినవిషయాలు ఇంట్లో కూడా చెప్పాను. వాళ్ళు భయపడకండి .అన్నిటికీ దేవుడే వున్నాడు అంటున్నారు.
"అది నిజమే అనుకో. కాని మన జాగ్రత్తలు మనం పడాలి కదా. నీకుతీరిక వుంటే చెప్పు ఇవాళ ఇంకో అతి ముఖ్యమైన రోగం అదే షుగర్వ్యాధి గురించి .ఇంకా చివరది థైరాయిడ్. దాని గురించి రెండుమూడు రోజుల తర్వాత సరేనా " అన్నాడు ఒకాయన.
ఇవన్నీ చాలా మందికి తెలిసిన విషయాలే కదా వీటికి ఇంతఉపోద్ఘాతం ఎందుకు ? అందామని అనుకున్నా పోనీ ఇంత ఇంట్రెస్ట్తీసుకుని ఈ రోజులూ ఎవరు చెపుతారు ? చాలా మందికి కూడాతెలుస్తుందిలే అని ఊరుకున్నాను.
ఇక షుగర్ర్ అనేది వ్యాధి కాదు. అది ఒక మెటబోలిక్ డిసార్డర్ .ఇదికూడా వంశ పారంపర్యంగా సంక్రమించినా కూడా ఇప్పుడున్నపరిస్తితులలో విపరీతమైన స్ట్రెస్, తినే పదార్ధాలలో అదుపు తప్పడం, HIGH GLYCIMIC కార్బోహైడ్రేట్ food తీసుకోవడం నిద్ర లేమిఇవన్నీ కూడా కారణాలే. అయితే షుగర్ వ్యాధి వుందనితెలుసుకున్నాక ఉదయం పూట ఏ మీ తీసుకోక ముందు అంటేFASTING షుగర్ 80 - 120 మధ్య , ఆహారం తీసుకున్న రెండుగంటల తర్వాత 160 లోపు READINGS వుండేటట్టుచూసుకోవాలి. అంతకు మించి షుగర్ కాని వుంటే గుండె దెబ్బతినొచ్చు, లివర్, కిడ్నీలు, కూడా ఎఫెక్ట్ కావచ్చు. అయితే దీనికిఆహార నియమాల గురించి మరోసారి చర్చించుకుందాం.
షుగర్ వ్యాధి గురించి నేను ఆల్రెడీ నా డైరీ లో దాని ఆహారనియమాలు అన్నీ వివరంగా రాసుకోవడం వల్ల , గ్లూకోమీటర్ తోఎప్పటికప్పుడు రీడింగులు చెక్ చేసుకోవడం వల్ల ఇక ఆ విషయంగురించి బలవంతం చెయ్యలేదు.
ఏమోయి. థైరాయిడ్ గురించ్లి చెపుతా నన్నానుగా ఒకసారి ఇటొచ్చివెళ్ళు అన్నాడు మా ఫ్రెండ్.
ఏమీ లేదోయ్. పెద్దగ చెప్పేదేమీ లేదు. థైరాయిడ్ అనేదిహార్మోనులను ఉత్పత్తి చేసే ఒక గ్రంధి. దీని వల్ల ప్రయోజనాలు చాలావున్నా ఒక్కోసారి జీర్ణ ప్రక్రియలో తేడాలు రావడం వల్ల ఇది రెండురకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఇది ఓవర్ react అయ్యి రెండురకాలుగా వ్యాధి రూపంలో బాధ పెడుతుంది. మొదటిది హైపర్థైరాయిడ్ రెండవది హైపో థైరాయిడ్ గా చెప్తూ వుంటారు. అసలుథైరాయిడ్ సమస్యల వల్ల మనకు కొన్నివ్యాధులు అంటే మలబద్ధకం,శరీరం చల్ల బడటం, ఎక్కువసార్లు డిప్రెషన్ కు గురి కావడం, బరువుపెరగడం, ఆకలి లేక పోవడం , కంటి సమస్యలు, ప్రేగులలోశబ్దాలురావడం, విపరీతంగా చెమట పట్టడం లాంటి సమస్యలు కనిపిస్తూవుంటాయి. అయితే ఇందాక చెప్పినట్టు ఏవి రెండు రకాలుఅన్నానుగా. అందులో మొదటిది హైపర్ థైరాయిడ్ . .
హైపర్ థైరాయిడ్ లక్షణాలు : ఇది ఎక్కువగా పురుషులలో కనిపిస్తూవుంటుంది. వీరిలో అలసట ఎక్కువగా వుంటుంది. బరువు తగ్గుతారు.ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. జుట్టు రాలి పోవడం, వాంతులు,దోకులు తరచూ అవుతూ వుంటాయి. థైరాయిడ్ గ్రంధిఅసాధారణంగా హార్మోనులను ఉత్పత్తి చెయ్యడం ముఖ్య కారణం.
ఇక రెండొవది : హైపో థైరాయిడ్ : బలహీనత, బద్దకంగాఅనిపించడం, జుట్టు రాలడం, చర్మం పొడిగా మరి పొట్టు రాలిపోవడం, జలుబుతో కూడిన అసహనం, డిప్రెషన్ తరచుగా చికాకుపడటం, కండరాలలో తిమ్మెరలు, క్రమ రహిత నెలసరి ,సంతానోత్పత్తి లేమి , హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు,లాంటివి రోగి భరించాలి.
ఇటువంటి సమస్యలు వున్నప్పుడు రోగి మీనా మేషాలు లెక్కపెడుతూ కూర్చోక వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే వారు కృత్రిమథైరాయిడ్ హోర్మోనులను ప్రవేశ పెడతారు.
ఇదిగో చివర్లో ఒక మాట. ఇవన్నీ చాలా మంది డాక్టర్లేచెప్పాలనుకుంటారు. వారి నోటినుండే వినాలనుకుంటారు. ఏరోగానికైనా ఒక అవగాహన ఉండాలిగా. పుస్తకాల ద్వారా, రక రకాలమాధ్యమాల ద్వారా తెలుసుకోవడం ఏ మాత్రం తప్పుద్ కాదు. కానిమందులు వాడే విషయంలో మాత్రం డాక్టర్లని మాత్రమెసంప్రదించాలి. ఈ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. అంతేకాని్రోగం ముదరబెట్టుకో కూడదు.
బరువైన గుండెతో అక్కడ నుండి బయలుదేరాను. ప్రపంచమంతారోగాల మయంగా అనిపించింది. ఎవరో అన్నట్టు " రోగమేరా జీవితం" అన్న మాట నిజమే అనిపిస్తోంది.
***
No comments:
Post a Comment