శివమ్మ కధ -18
శివం -45
శివం -45
రాజ కార్తీక్
(సామాన్యుని వలె మహాదేవుడు, తన భావుకతతో తన తల్లి శివమ్మ కి దూరం అయ్యి, ఆమె ఎలా తల్లడిల్లి ఆవేదన పడిందో చెబ్తున్నాడు )
శివమ్మ "ఎందుకు నాన్న ఏడుస్తున్నావు ..ఆకలి వేస్తుందా మళ్ళీ .." అంది ఆదుర్తాగా.
ఎందుకో తెలిదు, నేను నిజంగా ఎన్నో యుగాల నాటి బాధను, నా కన్నీటితో మా అమ్మ ఓదార్పుతో తీర్చుకుంటున్నా.
నేను "నిజంగా మా అమ్మ శివమ్మకి ఇంత కాలం ఎలా దూరం అయ్యాను? శివమ్మ తల్లికి నేను వరం ఇచ్చాను అనుకున్నారేమో. నేను కదా ఆమె బిడ్డ ల మారె భాగ్యాన్ని వరం గా తీసుకుంది ..జన్మ లేని నేను పుట్టాక లేని నేను ..ఈ తల్లి పోత్తిలి ప్రేమ సింహాసనం మీద కూర్చుంది ..భక్తీ వాళ్ళ కదా ..ఈ తల్లి ఉంది ఉంటె నేను స్మశానం లో ఉండే వదిన ..కపాలాలు దరించీ వాడిన ..తన కోరిక మేరకు ఎలాకావలంటే అల ఉన్దేవాడినా ,, ఈ లోకం లో నేను సృష్టించిన బంధాలు ఇంత గొప్పవ ,అన్ని ఆ శాస్వాతo అని తెల్సి కూడా ఇంత ప్రేమిస్తారా ..అందుకే దైవం కన్నా తల్లి కి మొదటి స్తానం ఇచ్చారు ఏమో . "
మా అమ్మ మాత్రం నా కన్నీరు తుడిచి నన్ను ఆడిస్తుంది ..సరదాగా నా నవ్వు చూడటానికి ..
అలా నేను మా అమ్మ సరదాగా ఉన్నాము ..
నేను కొంచెం నవ్వటం చూసి ..అందరు కూడా నవ్వుతున్నారు ..
ఇక మా అమ్మ నాకు అలంకరణ మొదలుపెట్టింది ..నేను దొరకకుండా ... బుడి బుడి అడుగులు వేసుకుంటూ మోకాళ్ళ మీద పకుతుంటే మా అమ్మ నన్ను చూసి ఆనందపడుతుంది ..అందరు నవ్వీ నవ్వు ...
శివమ్మ "ఆగు శివయ్య పరిగెత్తి దాకుంటావా .నేను నిన్ను పట్టుకోలేకపోతున్న.."
అక్కడ ఉన్న నంది బ్రుంగి నాగరాజు చంద్రుడు ..నన్ను తమ వైపు కి రమ్మని .పిలిచారు ..నేను వెళ్ళాను వాళ్ళు నన్ను వెనక దాచారు
శివమ్మ "స్వామి .ఏది మా కన్నయ్య .ఇటీ వచాడు ..",నంది మాత్రం సరదాగా ఏమో అన్నట్లు సైగ చేసాడు ..బ్రుంగి మాత్రం తడబడ్డాడు ,మిగతావాళ్ళు ఇక్కడీ ఉన్నాడు చూడు అనంట్లు సైగ చేసి చెప్పి చెప్పకుండా చెప్తున్నారు ...మా అమ్మ నన్ను పటుకోగానే నేను ఎంతల నవ్వనో..అందరు నవ్వారు
పైన ఉన్న అందరు విష్ణు దేవుడు బ్రహ్మ దేవుడు మీ త్రి మాతలు ,ఐతేయ్ న అల్లరి చుసీ మురిసిపోతున్నారు ..
నారదుడు "ఏమిటి అందరు అంతే ఉండిపోయారు ."
త్రీమాతలు "ఇటువంటి పుత్రుడు ఇంట ఉంటె అసలు ఆ తల్లికి ఎంత ఆనందమో,ప్రతిదినం పండుగే "
విష్ణు దేవుడు "ఇంట్లో ఏంటి అందరికి పండుగే"
బ్రహ్మ దేవుడు "ఈ బాలుడ్ని నాకు ఉన్న ౩ తలల తో ముద్దుఆడాలి .."
మహాదేవుడ్ని ఎప్పుడు చుసిన తీరు వేరు ఇప్పటి తీరు వేరు ..
ఇక నా బుడి బుడి అడుగులు నేను చేసే విన్యాసాలు చూసి అందరు ఎంతో ఆనందపడ్డారు .మా అమ్మ మరి ..
శివమ్మ "ఎన్ని ఆటలు అడతదో నా చిట్టి తండ్రి ".
అంతేనా ఇక నంది బ్రుంగి నాగరాజు చంద్రుడు అందరు మద్యలో నేను కుర్చుంటాను..వారు నన్ను ఆడించాలి నవ్వించాలి ..
వారు చేసిన క్రియలకు నేను నవ్వితే సరే లేకపోతె నేను అమాయకంగా మా అమ్మ వైపు చూస్తాను ..మా అమ్మ వారి వైపు చూస్తుంది ..
ఈ తంతు భలే ఉంది .నవ్వీ నవ్వు ..నన్ను ఆనందిమ్పచేయటానికి మార్గాలు వెతుకుంటూ వారు చేసిన హడావిడి అంత ఇంత కాదు
విష్ణు దేవుడు కూడా ఎంతో నవ్వుతున్నాడు ..బ్రహ్మ దేవుడు అయితే మూడు నోళ్ళ నవ్వుతున్నాడు ..నా హావభావాల శైలి అటువటింది మరి.
త్రిమాతలు కూడా అంతే, నవ్వి నవ్వి గుక్క తిప్పుకోలేకపోతున్నారు.
శివమ్మ "కన్నయ్య, ఎంత నవ్వించావు నన్ను కూడా ,ఇక అట మళ్ళీ మొదలుపెడదాము.నీకు అలంకారం చెయ్యాలి."
ఏమి అలంకరణో అని చూస్తున్నారు.
శివమ్మ తల్లి నన్నుఎత్తుకొని ఇంటిలోని ఒక గదిలోకి తీసుకోనివెళ్ళి, తలుపులువేసింది.
నేను ఒకటే ఏడుపు ..ఏమి అవుతుందోనని అందరికి ఆందోళన...
No comments:
Post a Comment