శ్రీథరమాధురి -57 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి -57

Share This
శ్రీథరమాధురి -57
(జ్ఞానం, ఆత్మజ్ఞానం గురించి పూజ్య గురూజీ అమృత వాక్కులు )

ఈ లోకంలో జ్ఞానులకు, జ్ఞానానికి కొదవేమీ లేదు, కానీ,
నేను ఇంకా ఒక్క ఆత్మజ్ఞాని కోసం వెతుకుతున్నాను ఇంతవరకు ఒక్కరినైనా కనుగొనే అదృష్టం నాకు కలగలేదు. అటువంటి వారెవరైనా తారస పడితే నేను అతడి పక్కన కూర్చుని దైవంతో అతని సంభాషణలను వినే అవకాశం కలుగుతుంది.

దయ లేని జ్ఞానం ప్రమాదకరమైనది.

జ్ఞానం లేని వాళ్ళు కూడా దయతో మెలుగుతుంటారు.
కానీ కొందరు జ్ఞానులు దురహంకారంతో మెలుగుతుంటారు.

దురహంకారం అనేది దురాక్రమణ అన్న దానికి దగ్గరి బంధువు అటువంటి వారు సత్యాన్ని ఎన్నటికీ తెలుసుకోలేరు.
దయ అనేది జ్ఞానానికి దగ్గర బంధువు. ఇది ఉన్నవారే సత్యాన్ని తెలుసుకోగలరు.

జ్ఞానం కలగాలంటే అహాన్ని విడనాడాలి కానీ దురదృష్టవశాత్తు ఈ జ్ఞానం అనేది అహంకారానికి ఆజ్యం పోస్తోంది. కానీ నిజమైన జ్ఞానం కలగాలంటే అహాన్ని విడనాడాలి. విజ్ఞానం అనేది నిరూపించుకోవడానికి తపిస్తూ ఉంటుంది. నిరూపణ అడిగినప్పుడు లేక చూపినప్పుడు జ్ఞానం దాన్ని చూసి నవ్వుతుంది. విషయ పరిజ్ఞానం అసూయను రేకెత్తిస్తుంది, తనకంటే అధికమైనది ఏదైనా తారసపడితే, అది ఓర్వలేదు. కానీ నిజమైన జ్ఞానానికి తనకంటే నిమ్నమైనది, అధికమైనది ఏమీ ఉండదు.

మనం సంపాదించే జ్ఞానం చాలావరకు అరువు తెచ్చుకున్నదే అనుభవపూర్వకంగా తెలుసుకున్నది కాదు. ఈ రకమైన నేపథ్యంతో ఎంతోమంది విశ్లేషణ చేస్తూ, తీర్పులు ఇస్తుంటారు. హాస్యాస్పదమైన వ్యక్తులు.

స్వీయ అనుభవం లేకుండా జీవితంలో జ్ఞానాన్ని పొందాలని తపించడమే, ఒకరి జీవితాన్ని సంక్లిష్టం చేస్తుంది.

వినయం లేని జ్ఞానం విపత్కరమైనది.
 
దయ లేని జ్ఞానం నివారణ లేని రోగం వంటిది.

ఒక విషయం గురించి పరిజ్ఞానం లేని వ్యక్తి వద్దకు వెళ్ళి, మీ సందేహాలను తీర్చమని ఎన్నడూ కోరవద్దు.
 
విషయ పరిజ్ఞానం ప్రదర్శనలకు ఉవ్విళ్ళూరుతూ ఉంటే, జ్ఞాని వారిని చూసిన నవ్వుతాడు.
 
ఇతరులను గురించి విమర్శించేందుకు మనకు ఏమీ అధికారం ఉంది?
ఇతరుల కంటే అధికులమని ఒకరు ఏవిధంగా భావించగలుగుతారు?
ఒకరిని అంచనా వేసేందుకు ఒకరి వద్ద ఉన్న కొలమానం లేక ప్రమాణం ఏమిటి?
ఈ ప్రమాణం అనేది జ్ఞానం పేరుతో ఒకరు పోగు చేసుకున్న చెత్తేనని నా భావన.

విలువైన స్వీయ అనుభవం లేకుండా, పరువు తీసుకున్న విషయ పరిజ్ఞానం వల్ల చాలామంది ఇప్పటికే కుళ్ళి పోతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంతో ఇతరులను విమర్శించడం అనేది విపరీతమైనది. ఇది మానవత్వాన్ని నాశనం చేస్తుంది.
 
కేవలం విజ్ఞానాన్ని పోగు చేసుకోవడం మీ బాధల్ని తీర్చలేదు. ఇదంతా చెత్తే.
 
ఒక ఆత్మజ్ఞాని ఎన్నడు ఇతరులను గాయపరిచరు, కానీ పరిమిత జ్ఞానం ఉన్న వారు కొన్నిసార్లు పరులను పీడించే ఉద్దేశంతో గాయ పరిచి, ఆనందిస్తుంటారు.
 
ఇతరులు చెప్పిన మాటలను నమ్మకుండా ఉండడమనేది ఒక దీవెన. విచక్షణా జ్ఞానం అనేది మనం సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది సరిగ్గా పని చేయాలంటే అప్రమత్తంగా ఉండడం అనేది కీలకమైనది. మనలో చాలామంది చెప్పిందంతా నమ్ముతారు. దుష్టుడైన వ్యక్తి యొక్క మాటలను నమ్మడం అనేది ప్రమాదకరమైనది.
  
జ్ఞానం అనేది సిద్ధాంతపరమైనది కాదు. ఈ విశ్వం లో జరిగేదంతా, ఒకరు అంతర్గతంగా అనుభూతి చెందగలగడమే జ్ఞానం. ఒక్కసారి మీరు అనుభూతిని ఆస్వాదించడం మొదలుపెడితే, మీరే మీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వు కుంటారు. ఈ సమయానికి మీరు చేసిన తప్పులన్నింటికి మిమ్మల్ని మీరు క్షమించు కోగలుగుతారు. మీ ఉనికిలోనే మీరు పరమానందంగా ఉంటారు. మీరు దేనిలోను ఎవరిలోనూ లోపాన్ని వెదకరు. మీరు విమర్శలు చేయరు. అప్పుడు మీరు కేవలం మీ చర్యలనే కాక ఇతరుల చర్యలకు కూడా సాక్షిభూతంగా ఉంటారు. అలా సాక్షిభూతంగా ఉండే కళ్ళ నుంచి స్వచ్ఛమైన, మచ్చ లేని జ్ఞానం ఉదయిస్తుంది.
 
మీకు ఒక విషయంలో పరిజ్ఞానం ఉన్నట్లయితే, దాని గురించి వెల్లడించేటప్పుడు గొంతు చించుకుని కాని, దురహంకారంతో గాని వ్యవహరించమని అర్థం కాదు. మూర్ఖులని మీరు భావించే వారి కంటే, మీకు అనుగ్రహించబడిన కొద్దిపాటి పరిజ్ఞానం తప్పనిసరిగా మీలో సంతులనాన్ని కలిగించగలగాలి. 
   
హృదయంలో దయ లేకపోతే ఎంతటి జ్ఞానం ఉన్నా కూడా వ్యర్థమే. దయ ఉన్నట్లయితే జ్ఞానం అనేది మీకు కేవలం ఒక వరంగా మాత్రమే కాదు, ఈ సమాజంలో ఉన్న రుగ్మతలన్నింటికి కూడా విరుగుడుగా పనిచేస్తుంది.
 
***

No comments:

Post a Comment

Pages