సుబ్బుమామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు
ఆట్లాడ్డం ఆటకాదర్రా..

పిల్లలూ! పిల్లకు ఆటలుండాలర్రా! ఆటలు మనకు మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తాయి. కొన్ని ఆటలు మన తెలివి తేటల్ని మెరుగుపరిస్తే, మరికొన్ని శరీర సౌష్ఠవాన్ని తీర్చిదిద్దుతాయి. ఇంతకూ మీకే ఆటలంటే ఇష్టం?
ఆటలు రెండు రకాలని తెలుసుగా? ఇండోర్ గేమ్స్..అవుట్ డోర్ గేమ్స్. మరియు స్పోర్ట్స్.
ఇహపోతే  స్పోర్ట్స్ కు గేమ్స్ కు తేడా ఏంటర్రా? తెలుసుకోండేఁ!
అసలు మీకు ఎన్ని ఆటలు తెలుసు? అందులో పాతకాలం ఆటలేమిటో ఎలా ఆడేవారో తెలుసుకోండి చాలా సరదాగా ఉంటుంది.
మీకో విషయం తెలుసా? చాలా ఆటలు కనుమరుగయిపోయాయర్రా. అవేమిటో మీ అమ్మా, నాన్నల్ని ఇతర పెద్దల్నీ అడిగి తెలుసుకోండి.
మన శరీరం, మనసులతో ఆడే ఆటలేమిటి? ఇతర వస్తువులు ఉపయోగిస్తూ ఆడేవేమిటి? ఇవి గాకుండా కొన్ని ప్రత్యేకంగా రూపొందించిన వస్తువులతో ఆడే ఆటలేమిటి?
ఇవన్నీ నోట్ చేసుకోండి.
గాజుల చినసత్యనారాయణగారి పెద్దబాలశిక్షలో కొన్ని పాత ఆటలను పొందుపరచారు వాటిని క్షుణ్నంగా అర్థం చేసుకోండి.
పెద్ద పెద్ద మైదానాలు, భారీగా రకరకాల వస్తువులు కావలసిన ఆటలేమిటి? ఆటలకి ఎంతమంది ఉండాలి?
ఆటలో అరటిపండు అంటారు కదా! అంటే ఏమిటి?
ఏయే ఆటలకి ఏయే నియమ నిబంధనలున్నాయి. అసలా నియమ నిబంధనలు ఎలా వచ్చుంటాయి?
చాలా ప్రశ్నలు వేశాను కదూ! తప్పదు ఆటలు అంత గొప్పవి మరి.
జీవితం అంటేనే ఆట. ఒకసారి గెలుస్తాం. మరోసారి ఓడిపోతాం. జీవితాన్ని ప్రతిబింబించేవేనర్రా ఆటలంటే.
ఆడుతూ..పాడుతూ..పనిచేస్తుంటే అసలు పనిచేసినట్టే ఉండదటరా! అందుకే పొలాల్లో పనులు ఆటల్లానే సరదాగా చేసి అవతల పడేస్తారు.
మీకు తెలిసిన ఆటలు ఆ ఆటల్లో ప్రముఖులను ఒక కాగితం మీద రాయండి.
ఆట్లాడ్డం ఆటకాదర్రా..దానికి ఎంతో కృషి..పట్టుదలా కావాలి.
ఈమాసానికి ఇంతేనర్రా మరి. ఉంటానే..
మీ సుబ్బుమామయ్య

No comments:

Post a Comment

Pages