శ్రీధరమాధురి - 58 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 58

Share This

శ్రీధరమాధురి - 58
(విజ్ఞానం, ఆత్మజ్ఞానం మధ్య ఉన్న భేదాల గురించి పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)

మార్పు అనేది జాగృతి లేకుండా సాధ్యం కాదు. అజ్ఞానం మటుమాయం అవ్వాలంటే జాగృతితో( జ్ఞానం తో) ఉండడం అన్నది కీలకమైనది. జాగృతి అన్నది లేకపోతే జ్ఞానం కూడా ఒక రకమైన అజ్ఞానమే అవుతుంది. ఒకరు అప్రమత్తంగా ఉన్నప్పుడు జ్ఞానం అనేది ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది.  మేధావులంతా ఆత్మజ్ఞానులు కాదు కానీ ఆత్మజ్ఞానం ఉన్నవారు నిశ్చయంగా మహా జ్ఞానులే.

   
మిడిమిడి జ్ఞానాన్ని  తోసిపుచ్చడమే అసలైన జ్ఞానం.

మేధస్సు ఉన్న వారు తమకున్న విజ్ఞానాన్ని వెల్లడించాలని ఉబలాటపడుతుంటారు. కానీ ప్రజ్ఞ ఉన్న ఆత్మజ్ఞాని ఇలా ఎన్నడూ చెయ్యరు. ఇదే విద్యావంతులైన పండితులకు, వైదుష్యం కల జ్ఞానులకు ఉన్న తేడా.
  
విజ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి మీరు నేర్చుకోవచ్చు. 
ఆత్మజ్ఞానం ఉన్నవారి వద్ద మీరు నేర్చుకున్నవన్నీ వదిలిపెట్టవచ్చు.

చాలా కాలం పాటు అన్నింటినీ చుట్టుకున్నాకా, మీరు విజ్ఞానం కలిగించే ఇబ్బందులను గురించి తెలుసుకున్నాకా, మీరు నేర్చుకున్నవన్నీ వదిలెయ్యాలని కాంక్షిస్తూ ఉంటారు.

ఈ ఆకాంక్ష ప్రగాఢమైన తపనగా మారినప్పుడు, ఆత్మజ్ఞాని మీకు తారసపడతారు.
***

No comments:

Post a Comment

Pages