డబ్బులేని మొక్క - అచ్చంగా తెలుగు

డబ్బులేని మొక్క
ప్రతాప వెంకట సుబ్బారాయుడు 


ఎవరేమనుకున్నా
డబ్బు.. మనిషి మొక్క ఏపుగా పెరగడానికి
ఎరువు..అదరువు
ఎవరు కనుక్కున్నారో కాని 
అది మంచి ఎరువుకూడా.

మన మొక్కకి పూలు కాయలున్నంత సేపు
అందరూ మన చుట్టూ తిరుగుతారు
కాస్త నీరు తగలక
వాలి.. సోలి..వడలి పోయామా
దగ్గరకు రావడం మాట అటుంచి 
చూడ్డానికీ ఇష్టపడరు.

అందుకే మనల్ని జాగ్రత్తగా చూసుకునే 
తోటమాలిని ఎంచుకోవాలి
నిర్లక్ష్యం వహించామా
సమాజం దృష్టిలో!
మనం ఓ పిచ్చి మొక్క
*****

No comments:

Post a Comment

Pages