ఓ ఆధునిక నాగరికుడా!
సుజాత తిమ్మన…
ఓ ఆధునిక నాగరికుడా
అడ్డుగోడలు అనుకుంటూ
ఆచారాలను , మన భారతీయ
ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను
తక్కువచేసి మాట్లాడకు
ఓ ఆధునిక నాగరికుడా ..
సత్యం కోసం సర్వస్వాన్ని పోగొట్టుకున్న
హరిచ్చంద్రుని కథ ఆదర్శంగానే కదా
గాంధీగారు సత్యాహింసల సాయంతో
బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టగలిగారు ..
ఓ ఆధునిక నాగరికుడా
పురాణాలు పుక్కిటమనకు
ధన్వంతరి చెప్పిన ఆరోగ్యసూత్రాలు
మన మనుగడకు ఇచ్చిన వరాలు
యోగం , ధ్యానం మనసును
నియంత్రించే సాధనాలు .
ఓ ఆధునిక నాగరికుడా
స్వార్ధం , ద్వేషం , అనే
మలినమైన అడ్డుగోడలను తొలగించి
మనిషి జన్మ పొందినందుకు
మానవత్వపు వెన్నెలను పంచు
నీవు నిండు జాబిలివై ..!
****************
No comments:
Post a Comment