కమనీయం – రమణీయం - పద్మావతి పరిణయం
ఓరుగంటి సుబ్రహ్మణ్యం
నవీ ముంబై వాషి తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సంధర్భంగా విజయవాడకు చెందిన నాట్యాచార్య బ్రహ్మశ్రీ భాగవతుల వెంకటరామ శర్మగారి నేత్రుత్వంలో
బ్రుందం "పద్మావతి పరిణయం" కూచిపూడి న్రుత్య రూపకం ప్రేక్షకులకు కనువిందు చేసింది.
ముల్లొకాలలో తనకు సగౌరవం దొరకలేదని భ్రుగుమహర్షి కినుకవహించి విష్ణువక్షస్థలం కాలితో తన్నిన సన్నివేశం
కళ్ళకుకట్టినట్ట్లు ప్రదర్శించారు. అడవిలో గజేంద్రుడు పద్మావతి చ్చెలికత్తెల వెంటబడి తరుముతున్న రూపకం, ఆకాశరాజు ఆగమనం , పద్మావతిదేవి వివాహ ప్రాస్థనం తదితర రూపకాలను ప్రదర్శించిన తీరు సభికులను మంత్రముగ్ధుల్ని చేసింది. సురభి ఆహార్యం కనువిందు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర బ్యాంకు డి.జి.ఎం శ్రీ రవి రమణగారిని , కళాకారులను ఇతర స్థానిక ప్రముఖులను కళా సమితి అధ్యక్షులు బండి నారాయణరెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు శాలువ పుస్పగుచ్చాలతో సత్కరించారు వందన సమర్పణతో సంక్రాతి సంబరాలు ముగిసాయి.
No comments:
Post a Comment