పుల్ల ఐస్ - అచ్చంగా తెలుగు
 "పుల్ల ఐస్ "
వాసం నాగరాజు 


బడి చుట్టీ గంట మోగిందంటే
వాడి కళ్ళలో కాంతులు మొలుస్తాయి
పుల్లాయిస్ నామ జపం చేస్తు
బడివాకిట వాలి పోతాడు

బడి పాఠాలు నేర్వలేదు
పేదరిక  జీవితపాఠాలు వల్లెవేసాడు
ఎక్కాలు చదవలేదు

ఆకలి లెక్కతప్పని పనిమంతుడు
వాడికి రోజు పరిక్షలే
ఒక్కోసారి అత్తెసరు మార్కులు
మరోసారి డిస్టింక్షన్ లో 

పిల్లల నోట పుల్లయిసు కరగాలి
వాడి గల్ల ఘల్లుమని నవ్వాలి
లేదంటే వాడు
ఐసుకరిగి మిగిలిపోయిన పుల్లవుతాడు 
 ***

1 comment:

Pages